Latest Updates
-
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్!
Keerthy Suresh : స్మార్ట్ లుక్ కావాలంటే.. కళావతిని ఫాలో అవ్వాల్సిందే...!
బ్లూ చుడీదార్లో మెస్మరైజ్ చేస్తున్న సర్కారు వారి పాట హీరోయిన్ కీర్తి సురేష్ ఔట్ ఫిట్స్ పై మీరూ ఓ లుక్కేయండి.
'సర్కారు వారి పాట' సినిమాలో మహేష్ బాబు సరసన నటించిన హీరోయిన్ బ్లూ కలర్ చుడిదార్లో చిరునవ్వుతో అభిమానులను మైమరిచేపోయేలా చేసింది.

రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ ఈ అమ్మడు ఫ్యాషన్ రంగంలో అందరి కంటే ఒక అడుగు ముందే ఉంటోంది. ఎప్పటికప్పుడు కొత్తగా.. సరికొత్త డ్రస్సులను ధరిస్తే.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

తాజాగా కళావతి అందాలను చూసి అమ్మాయిలు ఫిదా అయిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే మీరు కూడా కళావతి కీర్తి సురేష్ లా స్మార్ట్ గా కనిపించాలంటే ఇవి ట్రై చేయండి...

అందంగా కనిపించాలంటే..
ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో డ్రస్సు వేసుకున్న లేదా సారీ కట్టుకున్నా.. మనం ధరించే అవుట్ ఫిట్ చాలా ప్రధానమైనది. అయితే అందరిలో మీరు ప్రత్యేకంగా, మరింత అందంగా కనిపించాలంటే అవుట్ ఫిట్ కు మ్యాచ్ అయ్యే జ్యువెలరీ కూడా ముఖ్యమే. మీరు ధరించే అవుట్ పిట్ కు ఇవి మ్యాచింగులో లేకపోతే మీ లుక్ ఏ మాత్రం బాగుండదు సరికదా.. మరింత ఎబ్బెట్టుగా ఉంటుంది.

స్టైలీష్ ఇయర్ రింగ్స్..
ఒకప్పుడు చెవులకు మ్యాచింగ్ ధరించాలంటే మెడలో చోకర్ నెక్లెస్ లేదా చెయిన్ వంటివి వేసుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అందుకే వాటికి బదులుగా ఇయర్ జ్యువెలరీ మ్యాచ్ అయ్యేలా ఉంగరాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. కీర్తి సురేష్ కూడా అదే పని చేసిందిక్కడ. మీ ఇయర్ రింగ్స్ స్టైలీష్ గా కనిపించాలంటే బరువు తక్కువగా ఉండాలి. మీరు కూడా ఇలానే అనుకుంటూ ఉంటే, కళావతిని ఫాలో అయిపోతే చాలు.

బ్లూ కలర్ చుడీదార్లో..
అందరూ ఫాలో అయ్యే ఫ్యాషన్స్ నే మేము కూడా ఫాలో అయితే ఎలా? మనకంటూ నలుగురిలో కాస్త ప్రత్యేకత ఉండాలి కదా.. అందుకే సింపుల్ లుక్ లో కనిపించే కళావతి బ్లూ కలర్ చుడీదార్లను మీరూ ట్రై చేయండి.

హద్దులు దాటలేదు..
‘నేను శైలజా' సినిమాతో రామ్ తో ఈ అందాల భామ తెలుగులో తెరంగేట్రం చేసింది. తొలి సినిమా నుండి సాంప్రదాయ పద్ధతిలో ఉండే పాత్రలనే చేస్తోంది. అప్పుడప్పుడు గ్లామర్ పాత్రల్లో నటిస్తున్నా ఇప్పటిదాకా హద్దులు దాటలేదు. కేవలం తన యాక్టింగుతోనే మంచి పేరు తెచ్చుకుంది. దీంతో దక్షిణాదిన అగ్ర హీరోయిన్ల సరసన చేరింది.

నేటి తరం మహిళలు..
సంప్రదాయ దుస్తులకు మ్యాచ్ అయినట్లుగా ఇంకేవీ నప్పవని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నేటి తరం మహిళలు కూడా ఇలాంటి వాటిపైనే ఆసక్తి చూపుతున్నారు. కీర్తి సురేష్ కూడా ఇదే చేసింది.

ట్రెండీ అవుట్ ఫిట్లో..
అయితే ఈ భామ కేవలం నటనలోనే కాదు.. ఫ్యాషన్ రంగంలోనూ దూసుకెళ్తోంది. అదిరిపోయే డ్రస్సులను ధరించి.. మరింత అందంగా కనిపిస్తోంది. తాజాగా కీర్తి సురేష్ కనిపించి కళ్లు జిగేల్ మనే ట్రెండీ అవుట్ ఫిట్లో, బ్లూ కలర్ చుడీదార్లో కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసింది. అంతేకాదు రెడ్ లిప్స్, క్లీవేజ్ షోతో సెక్సీ ఫోజులివ్వడంతో కుర్రాళ్లకు నిద్ర పట్టడం లేదు. సమ్మర్ కు ముందే కీర్తి సురేష్ అందాల ఆరబోత చేయడంతో హీట్ మరింత పెరిగింది.
చూశారు కదా.. కళావతి ఫాలో అయిన ఫ్యాషన్స్ లో ఇవి కొన్ని మాత్రమే.. లేటెస్ట్ ట్రెండ్స్ గురించి మనకు తెలియాలంటే ఈ అందాల భామను ఫాలో అయిపోండి.



Click it and Unblock the Notifications