Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Year-ender 2022: 2022లో ఈ చీరకట్టులే దుమ్ము లేపాయి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం
జార్జెట్, శాటిన్, ఆర్గాన్జా నుండి ఓంబ్రే, సిల్క్ వరకు 2022 ఏడాదిలో ఎలాంటి చీర కట్టులు దుమ్ములేపాయో తెలుసుకుందాం. 2022లో అత్యంత స్టైలిష్ చీర ట్రెండ్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఫ్యాషన్ ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూనే ఉంటుంది. రోజుకా ఫ్యాషన్ వస్తోంది. కానీ కొన్ని ట్రెండ్స్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. ఈ ట్రెండ్ తప్పకుండా ఫాలో కావాల్సిందే అనేలా చేస్తాయి. ఫ్యాషన్‌లో ఎన్ని వెస్టర్న్ వేర్స్ వచ్చినా, ఎన్ని కొత్త ఔట్‌ఫిట్స్ వచ్చినా చీరది ఎప్పటికీ ప్రత్యేక స్థానమే. కట్టులో చిన్న చిన్న మార్పులు చేసినప్పటికీ చీర చీరనే. దాని అందానికి మరేదీ సాటి రాదు. మిగతా ఫ్యాషన్ లాగే చీర కూడా ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. చీర ఫ్యాషన్ పోకడలు విభిన్నంగా ఉంటాయనడంలో సందేహం లేదు.

జార్జెట్, శాటిన్, ఆర్గాన్జా నుండి ఓంబ్రే, సిల్క్ వరకు 2022 ఏడాదిలో ఎలాంటి చీర కట్టులు దుమ్ములేపాయో తెలుసుకుందాం. 2022లో అత్యంత స్టైలిష్ చీర ట్రెండ్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
1. సీక్విన్స్ శారీ
సీక్విన్ శారీలు మెషింగ్, సిల్క్, జార్జెట్ లేదా క్రేప్ వంటి అలంకరణలతో ఉంటాయి. సెక్విన్ శారీ అనేది వివాహమైనా, కుటుంబ సమేతమైనా, పార్టీ అయినా లేదా ఈవెంట్ అయినా ఏ సందర్భంలోనైనా సరైన దుస్తులుగా ఉంటాయి.
2. ఓంబ్రే శారీ
ఓంబ్రే శారీలను ర్యాప్‌లో వివిధ రంగుల దారాలతో తయారు చేస్తారు. అల్లిన బట్టలతో అందమైన మరియు ప్రత్యేకమైన షేడ్స్‌ను అందిస్తాయి. ఓంబ్రే అంటే ఫ్రెంచ్ భాషలో షేడ్ అని అర్థం.
3. ప్లీటెడ్ శారీ
ప్లీటెడ్ శారీలు లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్. ప్యాటర్న్‌లతో కూడిన చీరలు, డిఫరెంట్‌గా ట్రెండీగా కనిపించేలా చేస్తాయి.
4. పాస్టెల్ సిల్క్ శారీ
క్లిష్టమైన డిజైన్‌లతో రూపొందించబడిన, పాస్టెల్ సిల్క్ చీరలుస సాధారణ పాస్టెల్ రంగులతో వస్తాయి. వాటిని స్టైల్, గ్రేస్‌తో సులభంగా అలంకరించవచ్చు. సులభంగా క్యారీ చేయవచ్చు.
5. ఆర్గాన్జా
ఆర్గాన్జా చీరలు పట్టు, షీర్ ఫ్యాబ్రిక్‌తో తేలికగా అలాగే మంచి లుక్‌తో ఉంటుంది. సెలబ్రిటీలు ఆర్గాన్జా చీరలను సాంప్రదాయ డ్రెప్‌ల నుండి పార్టీ లుక్స్ వరకు అనేక సందర్భాల్లో పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దారు.



Click it and Unblock the Notifications