Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
రూపాయి ఖర్చు లేకుండా ఇలా చేస్తే..యామీ గౌతమ్ లా మిలమిల మెరిసిపోాతారు
యామీ గౌతమ్..ఈ పేరు వినగానే చాలామందికి గుర్తుకువచ్చేది ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్. ఈ ఒక్క యాడ్ తో యామీ గౌతమ్(yami gautam) చాలా పాపులారిటీ సంపాదించుకుంది. యామి గౌతమ్ నేచురల్ బ్యూటీ. సహజ సౌందర్యం, మెరిసే చర్మం ఈ అమ్మడి సొంతం. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ లో ఈ అమ్మడిని చూసిన బాలీవుడ్ ప్రొడ్యూసర్లకు మైండ్ బ్లాక్ అయింది. యామీ అందానికి ఫిదా అయిన ప్రొడ్యూసర్లు ఆమెకు వరుసగీా సినిమా ఆఫర్లు చేశారు. 2012లో యామీ గౌతమ్ నటించిన ఫస్ట్ బాలీవుడ్ మూవీ విక్కీ డోనర్. మొదటి సినిమాతోనే బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది. వైవిధ్యమైన పాత్రల్లో ఆమె నటించిన సినిమాలు కొన్ని సూపర్ హిట్ అయ్యాయి.
అందంగా మెరిసిపోయేలా ఉండే యామీ గౌతమ్ చాలా కాస్ట్లీ స్కిన్ కేర్ ప్రొడక్ట్ లను వాడుతుందని చాలామంది అనుకుంటారు. అయితే ఆమె తన చర్మ సౌందర్యం కోసం అసలు ఖరీదైన ప్రొడక్ట్ లనే వాడదు. అవును ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పింది. అయితే చర్మ సౌందర్యం కోసం యామీ గౌతమ్ ఏం చేస్తుందని ఆలోచిస్తున్నారా?ఇటీవలే 34 ఏళ్లు పూర్తి చేసుకొని 35వ వసంతంలోకి అడుగుపెట్టిన యామి గౌతమ్ తన చర్మ సౌందర్యం కోసం ఖరీదైన ప్రొడక్ట్ లను బదులుగా హోమ్ రెమెడీస్(yami gautam home remedies) పాలో అవుతానని చాలాసార్లు ఇంటర్వ్యూలలో చెప్పింది.యామీ గౌతమ్ ఏం ఈ హోం రెమెడీస్ పాటిస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం.

రైస్ ఫేస్ మాస్క్
యామీ గౌతమ్ తన చర్మం మెరుపును కాపాడుకోవడానికి బియ్యం పిండి మాస్క్‌ను అప్లై చేస్తుంది. ఈ మాస్క్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది, సహజమైన మెరుపును తెస్తుంది.
రైస్ మాస్క్ ఎలా తయారు చేయాలి
-బియ్యం పిండి కొంచెం ఓ బౌల్ లో తీసుకోండి.
-అందులో రోజ్ వాటర్ మరియు పెరుగు కలపాలి.
-ఈ మాస్క్‌ను ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాల పాటు ఉంచి తర్వాత కడిగేయాలి.
దేశీ నెయ్యి
యామి గౌతమ్ తన చర్మ సంరక్షణ కోసం దేశీ నెయ్యి ఉపయోగిస్తుంది. చర్మం తేమను నిర్వహించడంలో దేశీ నెయ్యి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది చర్మాన్ని తేమగా, మృదువుగా చేస్తుంది.
ఎలా ఉపయోగించాలి
-రాత్రి పడుకునే ముందు దేశీ నెయ్యిని ముఖంపై సున్నితంగా మసాజ్ చేయండి.
తేనె,కలబంద
సహజమైన వస్తువులు చర్మానికి చాలా మేలు చేస్తాయని యామీ గౌతమ్ అభిప్రాయపడ్డారు. ఆమె తేనె, పసుపు, కలబంద వంటి వాటిని కూడా ఉపయోగిస్తుంది. మీరు కూడా సహజమైన మెరుపును పొందాలనుకుంటే ఈ హోమ్ రెమెడీస్ ఫాలో అవ్వండి.
యామీ గౌతమ్ హెయిర్ కేర్ రొటీన్
ఆమె హెయిర్ కేర్ కూడా పూర్తిగా హోం రెమెడీస్ మీద ఆధారపడి ఉంటుంది. యామి కొబ్బరి నూనె, ఉసిరి నూనెను ఉపయోగిస్తుంది.
డైట్,ఫిట్‌నెస్ సీక్రెట్
యామి గౌతమ్ బాహ్య సంరక్షణపై మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారం, యోగాపై కూడా శ్రద్ధ చూపుతుంది. లోపల నుండి ఆరోగ్యంగా ఉన్నప్పుడే చర్మం, జుట్టుపై ప్రభావం కనిపిస్తుందని ఆమె నమ్మతది.



Click it and Unblock the Notifications