Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
నెగటివ్ ఎనర్జీకి చెక్.. అమెథిస్ట్ బ్రాస్ లెట్ ధరించి అదృష్టం తెచ్చుకోండి!
మీరు ధరించే ఆభరణం కేవలం అందాన్ని మాత్రమే కాకుండా మీ జీవితంలో ప్రశాంతతను, పాజిటివ్ ఎనర్జీని కూడా తీసుకువస్తే ఎంత బాగుంటుంది? అటువంటి అద్భుతమైన ఆభరణమే అమెథిస్ట్ బ్రాస్ లెట్. చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపించే ఈ బ్రాస్ లెట్ లోని అమెథిస్ట్ పూసలు వాటి ప్రశాంతతను అందించే, స్వస్థపరిచే గుణాలకు ప్రసిద్ధి చెందాయి. ఇది మీ ఫ్యాషన్ కు ఒక ప్రత్యేకమైన అందాన్ని జోడించడమే కాకుండా అనేక రకాల ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
జ్యోతిషశాస్త్రంలో నవగ్రహాలలో శని దేవుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. ఆయన కర్మ ఫలదాత, న్యాయ దేవుడు. జాతకంలో శని స్థానం ప్రతికూలంగా ఉన్నప్పుడు జీవితంలో అనేక ఒడిదొడుకులు, సమస్యలు ఎదురవుతాయి. అయితే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉన్నట్టే, శని గ్రహ దోషాల నివారణకు జ్యోతిషశాస్త్రం కొన్ని శక్తివంతమైన ఉపాయాలను సూచించింది. శనికి సంబంధించిన దోషాలతో బాధపడేవారు అమెథిస్ట్ బ్రాస్‌లెట్ ధరించడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చని పండితులు చెబుతారు.

అమెథిస్ట్ బ్రాస్ లెట్ ప్రయోజనాలు
ఈ బ్రాస్ లెట్ ధరించడం వల్ల శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇది మన శరీరంలోని ఆజ్ఞా చక్రం (మూడవ కన్ను), సహస్రార చక్రాలను సమతుల్యం చేసి ఆధ్యాత్మిక చైతన్యాన్ని, అంతరదృష్టిని పెంచుతుంది.
మానసిక ప్రశాంతతను కోరుకునే వారికి ఇది ఒక వరం లాంటిది. ఒత్తిడి, ఆందోళన, తరచూ మారే మూడ్ స్వింగ్స్ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగించి భావోద్వేగాలను అదుపులో ఉంచుతుంది.
ఇది ప్రతికూల ఆలోచనలను తొలగించి, మానసిక స్పష్టతను పెంచుతుంది. దీనివల్ల సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది.
నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి అమెథిస్ట్ బ్రాస్ లెట్ చక్కగా సహాయపడుతుంది. మనసును శాంతపరిచి, గాఢమైన, ప్రశాంతమైన నిద్రను ప్రోత్సహిస్తుంది. చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీల నుండి రక్షణ కవచంలా పనిచేస్తూ మీకు భద్రతా భావాన్ని, సానుకూల దృక్పథాన్ని అందిస్తుంది.

ఎలా ధరించాలి?
ఈ బ్రాస్ లెట్ పూర్తి ప్రయోజనాలను పొందడానికి దానిని సరైన పద్ధతిలో ధరించడం ముఖ్యం. దీనిని శనివారం ఉదయం ధరించడం ఉత్తమం. ధరించే ముందు ఈ బ్రాస్ లెట్ ను శుద్ధి చేయాలి. ఒక గిన్నెలో శుభ్రమైన నీరు తీసుకుని అందులో చిటికెడు సముద్రపు ఉప్పు వేసి కొన్ని గంటల పాటు బ్రాస్ లెట్ ను నానబెట్టాలి. ఇది దానిలోని నెగిటివ్ ఎనర్జీని తొలగించి తిరిగి శక్తివంతం చేస్తుంది.
అమెథిస్ట్ బ్రాస్ లెట్ ను ఈ లింక్ క్లిక్ చేసి కొనుగోలు చేయవచ్చు
శుద్ధి చేశాక బ్రాస్ లెట్ ను మీ చేతుల్లో పట్టుకుని మీకు కావలసిన మానసిక స్పష్టత, భావోద్వేగ సమతుల్యం, ఆధ్యాత్మిక రక్షణ కోసం మనస్ఫూర్తిగా సంకల్పించుకోండి. ఆ తర్వాత "ఓం శాంతి శాంతి శాంతి" అనే మంత్రాన్ని 11 సార్లు జపించి బ్రాస్ లెట్ ను ధరించండి. అమెథిస్ట్ బ్రాస్ లెట్ ఏ దుస్తులకైనా రాజ సౌందర్యాన్ని జోడిస్తుంది. ఈ అమెథిస్ట్ బ్రాస్ లెట్ కేవలం మీ ఫ్యాషన్‌ను మాత్రమే కాదు మీ జీవితంలో సానుకూల మార్పును కూడా తీసుకువస్తుంది.
Disclaimer: ఈ కథనంలో స్పాన్సర్ చేయబడిన లింక్ లు ఉన్నాయి. మీకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా వాటి ద్వారా మీరు ఏదైనా కొనుగోలు చేస్తే మేము ఒక చిన్న కమిషన్ సంపాదించవచ్చు. దయచేసి కొనుగోలు చేసే ముందు అన్ని ప్రొడక్ట్ వివరాలు,రివ్యూలను చెక్ చేయండి. మీ కొనుగోలు వల్ల తలెత్తే ఏవైనా సమస్యలకు మేము బాధ్యత వహించము.



Click it and Unblock the Notifications
