Latest Updates
-
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు! -
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్లో పడిపోతారు.! -
త్వరగా ప్రెగ్నెన్నీ రావాలంటే..భార్యాభర్తలు తప్పక తినాల్సిన ఫ్రూట్ ఏది? -
వర్షాకాలంలో ఇంట్లో ఆ వాసన పోవాలంటే.. ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి.! -
కేవలం 1 స్పూన్ నూనెతో కుక్కర్ లో పానీ పూరీలు..డీప్ ఫ్రై లేకుండానే బండి మీది టేస్ట్! -
అభిజిత్ ముహూర్తం: ఈ రాశుల వారికి నేడు ధనయోగం.. పట్టిందల్లా బంగారం! -
ఎదుటి వ్యక్తిని ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారా.. వారి దృష్టిలో మీ విలువ తగ్గినట్లే.! -
జూన్ 22న వరీయాన్ యోగం.. ఈ రాశుల వారికి కెరీర్, వ్యాపారాల్లో తిరుగులేని అదృష్టం! -
వినాయక చవితి వెనక ఉన్న అసలు పురాణ కథ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు -
కర్కాటకంలోకి బుధుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం!
సరబ్జిత్ ప్రీమియర్ లో ఆకర్షణగా నిలిచిన 10 బెస్ట్ డ్రెస్డ్ సెలెబ్రిటీస్
ఇంకొన్ని గంటల్లో 'సరబ్జిత్' అనే ప్రతిష్టాత్మక బాలీవుడ్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రీమియర్ షో ఇటీవలే ప్రదర్శింపబడింది. ఈ ఈవెంట్ లో సెలెబ్రిటీస్ అందరూ అద్భుతమైన అవుట్ ఫిట్స్ తో విచ్చేశారు.
ఈ సినిమాకి చెందిన నటీనటులతో పాటు బుల్లితెర సెలెబ్రిటీస్ కూడా సరబ్జిత్ ప్రీమియర్ కి విచ్చేశారు. స్టార్స్ తో ఈ ప్రిమియర్ షో ఈవెంట్ కన్నులవిందుగా అనిపించింది. విచ్చేసిన స్టార్స్ అందరూ ఫ్యాషనబుల్ గా డ్రెస్ అప్ అయి వచ్చారు. ఫ్యాషన్ వరల్డ్ వైపు తీసుకుపోవడానికి సిద్ధమయ్యారు.
ఈ ఏడాది కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో తన రెడ్ కార్పెట్ అపియరన్స్ తో అభిమానుల మధ్య ఫ్యాషన్ చర్చలకు ఆస్కారమిచ్చిన ఐశ్వర్యారాయ్ కూడా ఈ ఈవెంట్ కి తన భర్త అభిషేక్ బచ్చన్ తో సహా హాజరయింది.
కేన్స్ రెడ్ కార్పెట్ అపియరెన్స్ లో శారీలో సందడి చేసిన రీచా చందనతో పాటు ఈ సినిమాకు చెందిన మిగతా నటీనటులు కూడా ఈ ఈవెంట్ లో గ్రేట్ గా కనిపించారు.
ఇప్పుడు, సరబ్జిత్ ప్రీమియర్ లో సందడి చేసిన సెలెబ్స్ స్టైలిష్ లుక్స్ ను ఒకసారి చూద్దాం.

ఐశ్వర్యా రాయ్ బచ్చన్
థియా కౌచర్ జాకర్డ్ బాల్ గౌన్ లో ఐశ్వర్య ఎంతో అద్భుతంగా కనిపించింది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ లుక్ లో పర్పిల్ లిప్స్ తో షాకిచ్చిన ఐశ్వర్య, సరబ్జిత్ ప్రీమియర్ షో లో ఆకర్షణీయమైన పింక్ లిప్స్ తోఈవెంట్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.

రిచా చందన
గ్రే అజ్జీ & ఓస్టా బాల్ గౌన్ తో రిచా తన అందంతో ఆకట్టుకుంది. నడుము వద్ద మెరిసే పూల తీరు రీచా అవుట్ ఫిట్ కి అదనపు ఆకర్షణగా నిలిచాయి.

రందీప్ హూడా
ఈ ప్రీమియర్ షో కి కీలకమైన వ్యక్తి అయిన రందీప్ హూడా ఆకర్షణీయమైన బ్లూ బ్లేజర్ లో అలాగే బ్లాక్ బో టై తో సందడి చేశాడు. ఇంతకు ముందు కంటే రందీప్ హూడా చాలా అందంగా కనిపించాడు.

ఆదిత్య శెట్టి
ఈ యువ నటి దేశీ లుక్ తో ఈవెంట్ లో సందడి చేసింది. క్రీమ్ కలర్ లేస్ అవుట్ ఫిట్ పై భారీ వర్క్ చేయబడిన దుపట్టాను ధరించింది.

దివ్యా ఖోస్లా కుమార్
ఈ స్టైలిష్ అమ్మడు ప్రింటెడ్ అషిమా లీనా అవుట్ ఫిట్ తో ప్రీమియర్ లో ఆకర్షణీయంగా అలాగే ప్రకాశవంతంగా కనిపించింది. ఈ అవుట్ ఫిట్ పై సత్యానీ జ్యువలరీ అదనపు ఆకర్షణగా నిలిచింది.

సోనాల్ చౌహాన్
మాడిసన్ వారి స్ట్రెయిట్ కట్ పింక్ డ్రెస్ లో సోనాల్ చౌహాన్ బార్బీ డాల్ లా కనిపించింది. ఫ్రింజ్డ్ హెయిర్ కట్ సోనాల్ చౌహాన్ అపియరెన్స్ కు అదనపు ఆకర్షణ కలిగించడంలో తోడైంది.

డైసీ షా
సోనమ్ లూత్రియా డిజైన్ చేసిన కోల్డ్ షోల్డర్ క్రాప్ టాప్ తో పాటు లేస్ లు ఫాషనబుల్ గా ఈవెంట్ కు తగినట్టుగా ఉన్నాయి. అలాగే పౌడర్ బ్లూ షేడ్స్ కలిగిన ఈ అవుట్ ఫిట్ లో డైసీ షా ఆకర్షణీయంగా కనిపించింది.

ఊర్వశి రౌతెలా
బ్లాక్ జంప్ సూట్ లో అలాగే హాల్టర్ నెక్ లో ఊర్వశి చాలా సింపుల్ గా అలాగే చక్కగా కనిపించింది. మొత్తం అవుట్ ఫిట్ పై ఐరన్ ప్లీటెడ్ టెక్స్చర్ తో ఊర్వశి ఈ షో లో తనదైన స్టైల్ ను ఒలకబొసింది.

మందన కరిమి
బ్లాక్ టాప్ తో అలాగే చెక్డ్ ఫిట్టేడ్ ప్యాంట్స్ తో ఈవెంట్ కు విచ్చేసిన మందన అవుట్ ఫిట్స్ ట్రెండీగా లేకపోయినా మందన మాత్రం ఈ అవుట్ ఫిట్స్ లో మెరిసిపోయింది. మెడ వద్ద సమ్మర్ ట్రెండ్ చౌకర్ తో మందన చాలా కూల్ గా కనిపించింది.

అంకితా లోఖాండే
ప్యాంట్ సూట్ ని ధరించే హాటీస్ క్లబ్ లో ఇటీవల జాయిన్ అయిన అంకితా వైట్ ప్యాంట్ సూట్ లో ఈ ఈవెంట్ లో తళుక్కుమంది. ఇటువంటి ఫాషన్ చాయిసెస్ ని అంకితా కంటిన్యూ చేస్తుందని ఆశిద్దాం.



Click it and Unblock the Notifications