Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
Hebah Patel: హెబ్బా పటేల్ గ్లామర్ షో, చీరలో మత్తెక్కించే చూపులతో గిలిగింతలు
హీరోయిన్ హెబ్బా పటేల్.. తెలుగులో కుమారి 21ఎఫ్ మూవీ ద్వారా సూపర్ క్రేజ్ సంపాదించుకుంది ఈ భామ. అంతకుముందే 'అలా ఎలా' అనే చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టినప్పటికీ పెద్దగా పేరు, గుర్తింపు రాలేదు. కానీ సుకుమార్ రైటింగ్స్ ద్వారా తెరకెక్కిన కుమారి 21ఎఫ్ ద్వారా యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది హెబ్బా పటేల్.

'అధ్యక్ష' అనే కన్నడ మూవీతో సినీ కెరీర్ ప్రారంభించింది హెబ్బా. సిల్వర్ స్క్రీన్ పై కనిపించాలన్న కోరికతో సినిమాల వైపు వచ్చింది. ఈ బ్యూటీకి కుమారి 21ఎఫ్ అనుకోని రేంజ్ లో హిట్ వచ్చింది. ఆ తర్వాత వరుస పెట్టి ఆఫర్లు వచ్చాయి.

ఒకదాని తర్వాత మరొకటి చేస్తూ చాలా బిజీగా మారిపోయింది హెబ్బా. అయితే 'ఈడో రకం ఆడో రకం', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రాలు తప్పా మిగతావేవీ అంతగా ఆడలేదు. బాక్సాఫీస్ ముందు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి.

కుమారి 21 ఎఫ్ తో ఒక్కసారిగా పెరిగిన హెబ్బా పటేల్ క్రేజ్.. వరుస ఫ్లాపులతో క్రమంగా డౌన్ అయిపోయింది. తెలుగులో ఆఫర్లు తగ్గిపోయాయి. ఎప్పుడో ఒకప్పుడు అన్నట్లుగా ఒకటీ అర సినిమాల్లో కనిపిస్తోంది ఈ బ్యూటీ.

పెద్దగా అవకాశాలు లేకపోవడంతో క్రమంగా ఫేడవుట్ అవుతున్న క్రమంలోనే ఓదెల రైల్వేస్టేషన్ అనే సినిమాలో డీ గ్లామరస్ రోల్ ఆఫర్ వచ్చింది. దానిని ఒడిసిపట్టుకున్న హెబ్బా తన శక్తి మేర నటించి మెప్పించింది. తన అందచందాలతో అలరించే గ్లామరస్ పాత్రల్లో నటించిన హెబ్బాకు ఓదెల రైల్వేస్టేషన్ డిఫరెంట్ రోల్ ఆఫర్ చేసింది.

తన క్యారెక్టర్ లో చక్కగా నటించి విమర్శకుల ప్రశంసలు పొందింది. సైకో థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ మూవీ కూడా అనుకున్నంత రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ తాజాగా 'వ్యవస్థ' అనే సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ పెద్దగా ప్రేక్షకులకు ఆకట్టుకున్నట్లుగా కనిపించడం లేదు. పెద్దగా బజ్ క్రియేట్ చేయలేకపోవడంతో దానిపై సినీ అభిమానుల ఫోకస్ పడటం లేదు.

తాజాగా హెబ్బా పటేల్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తెల్ల చీరలో ఉన్న పిక్స్ పోస్టు చేసింది. ఇందులో తన పరువాలు ప్రదర్శించింది.(All Images: Instagram)



Click it and Unblock the Notifications