Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Ram Charan: స్టైలిష్ లుక్ లో రామ్ చరణ్, మగధీరుడి స్టైల్‌పై అమెరికన్ యాంకర్ షాకింగ్ కామెంట్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈమధ్యకాలంలో స్టైలిష్ స్టార్ అవతారం ఎత్తుతున్నాడు. ఇటీవలి కాలంలో ఆయన ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ పై సూపర్ లుక్స్ లో దర్శనమిస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈమధ్యకాలంలో స్టైలిష్ స్టార్ అవతారం ఎత్తుతున్నాడు. ఇటీవలి కాలంలో ఆయన ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ పై సూపర్ లుక్స్ లో దర్శనమిస్తున్నారు. తాజాగా అమెరికన్ పాపులర్ షో గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షోలో పాల్గొన్న రామ్ చరణ్ పై అమెరికన్ యాంకర్ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షోలో పార్టిసిపేట్ చేసిన న్యూ ఏజ్ స్టార్ రామ్ చరణ్ కావడం గమనార్హం. ఈ ఘనత అందుకున్న తొలి తెలుగు హీరోగా రామ్ చరణ్ చరిత్ర సృష్టించారు. ఈ తరం ఇండియన్ సెలబ్రిటీల్లో ఈ ఘనత అందుకున్నది కూడా మెగా పవర్ స్టారే కావడం విశేషం. గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ లో రామ్ చరణ్ RRR ముచ్చట్లతో పాటు తన పర్సనల్ విషయాలను కూడా పంచుకున్నాడు.

ఆస్కార్ నామినేషన్స్ కోసం RRR ప్రత్యేక షోలు ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఇందుకోసం రామ్ చరణ్ అమెరికా వెళ్లారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ కోసం కూడా రామ్ చరణ్ యూఎస్ లో ఉన్నారు.

గోల్డెన్ గ్లోబ్ అవార్డులో పాల్గొన్న రామ్ చరణ్ సూపర్ లుక్ లో కనిపించారు. ఇండియాలో ఉన్నప్పుడు మెగా పవర్ స్టార్ గా అలరించే రామ్ చరణ్, విదేశాలకు వెళ్లినప్పుడు మాత్రం తన హ్యాండ్సమ్ లుక్స్ తో స్టైలిష్ స్టార్ గా మారిపోతున్నాడు.

గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షోలోని యాంకర్ కూడా రామ్ చరణ్ స్టైల్ గురించి పొగడటం విశేషం. ఇంటర్వ్యూ సమయంలో మన మనధీరుడు హ్యాండ్సమ్ ఫోజులో స్టైల్ గా కూర్చున్నాడు. దీనిని గమనించి టాక్ షో యాంకర్.. అతని స్వాగ్ చూడండి అంటూ కామెంట్ చేశాడు.

అమెరికన్ యాంకర్ కామెంట్ కు రామ్ చరణ్ బదులిస్తూ నేను వినయంగా నటించడానికి ట్రై చేస్తున్నా అంటూ సరదాగా సమాధానమిచ్చాడు. ఈ షోకి సంబందించిన ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చరణ్ స్టైలిష్ లుక్స్ చూసి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

అలాగే రేపు(ఫిబ్రవరి 24) బెవర్లీ హిల్స్ లో జరగబోయే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ కి ప్రజెంటర్ గా హాజరు కాబోతున్నాడు చెర్రీ. ఈ ఈవెంట్ లో విజేతగా నిలిచే వారికి రామ్ చరణే తన చేతుల మీదుగా అవార్డులు అందివ్వనున్నాడు. అయితే ఈ వేడుకల్లో రామ్ చరణ్ ఎలాంటి లుక్ లో కనిపించనున్నారో చూడాలి.

HAC అవార్డ్స్ వేడుకలో రామ్ చరణ్ లుక్స్ ఎలా ఉండబోతున్నాయో అని అతని ఫ్యాన్స్ తెగ ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.



Click it and Unblock the Notifications