Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
Jeans: జీన్స్ వేసుకుంటున్నారా?.. మీ ప్రైవేట్ పార్ట్స్‌కు ఈ రోగాలు రావడం ఖాయం!
చాలామందికి డ్రెస్ సెన్స్ ఉండదు. ఏ పూట ఎలాంటి బట్టలు వేసుకోవాలో చాలా మందికి తెలియదు. అలాంటి వ్యక్తులు రాత్రుళ్ళు పడుకునేటప్పుడు కూడా జీన్స్ ప్యాంట్ వేసుకొని పడుకుంటుంటారు. అలా పడుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ అలా పడుకోవడం చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయట. కేవలం పడుకునేటప్పుడు మాత్రమే కాదు సాధారణంగా జీన్స్ వేసుకున్నా సమస్యలే వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ జీన్స్ వేసుకొని పడుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? ఏ విధమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నిద్ర సమస్యలు
రాత్రి పడుకునేటప్పుడు జీన్స్ వేసుకొని పడుకోవడం వల్ల నిద్ర సమస్యలు వస్తాయి. రాత్రుళ్ళు సరిగ్గా నిద్రపట్టదు. ఎందుకంటే జీన్స్ వేసుకొని నిద్రపోవడం వల్ల కంఫర్ట్ సరిగ్గా ఉండదు. ఎందుకంటే రాత్రి టెంపరేచర్ తగ్గిపోయినప్పుడు జీన్స్‌లో గాలి ప్రసరణ సరిగ్గా జరగ్గా ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో సరిగ్గా నిద్రపట్టదు. నిద్రలోనే మాటి మాటికీ లేవడం, నిద్రపట్టకపోవడం వంటి సమస్యలు వస్తాయి.

ఫంగల్ ఇన్ఫెక్షన్స్
జీన్స్ సాధారణంగానే మందంగా ఉంటాయి. ఇవి గాలిని పీల్చుకోవు. అలాగే తేమను కూడా పీల్చుకోవు. దీని కారణంగా జీన్స్ ధరించడం వల్ల ప్రైవేట్ పార్ట్స్ వద్ద చెమటలు అలాగే ఉండిపోతాయి. ఇలా గంటల తరబడి చెమటలు ఉండిపోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇది క్రమంగా లైంగిక సమస్యలకు కారణం అవుతుంది. దీంతో పాటు ప్రైవేట్ పార్ట్స్ వద్ద అలర్జీ, దద్దుర్లు, తొడలు రాసుకుపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఒకవేళ జీన్స్ వేసుకొని పడుకోవడం వల్ల ఈ సమస్యలు అధికమవుతాయి.
పీరియడ్స్ నొప్పులు
మహిళలు పీరియడ్స్ సమయంలో జీన్స్ ప్యాంట్‌లకు దూరంగా ఉంటేనే చాలా మంచిది. జీన్స్ వంటి బిగుతుగా ఉండే దుస్తులు ధరించి పడుకోవడం వల్ల గర్భాశయం, పొత్తి కడుపు, జననేంద్రియాలపై ఒత్తిడి ఏర్పడుతుంది. దీంతో ఆ భాగాలకు రక్తప్రసరణ నిలిచిపోతుంది. అయితే పీరియడ్స్ సమయంలో ఈ సమస్య కాస్త అధికంగా ఉంటుంది. అలాగే పీరియడ్స్ సమయంలో వాటి వల్ల కలిగే నొప్పి కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే పీరియడ్స్ సమయంలో జీన్స్ ధరించడం మంచిది కాదని చెబుతుంటారు. అలాగే జీన్స్ ధరించడం వల్ల నడుం నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి.
అమ్మాయిలు జాగ్రత్త
జీన్స్ ధరించే విషయంలో అమ్మాయిలు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సాధారణంగా అమ్మాయిలు చాలా బిగుతుగా ఉండే జీన్స్ ధరిస్తుంటారు. ఇలా ధరించడం వల్ల జీన్స్ చర్మానికి కండరాలకు బలంగా పట్టుకుంటుంది. దీంతో చర్మం, నేరాలపై ఒత్తిడి బాగా పెరుగుతుంది. దీని కారణంగా రక్త ప్రసరణ తగ్గిపోతుంది. దీంతో చాలా ప్రాంతాల్లో వాపు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి.



Click it and Unblock the Notifications