Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
తన దుస్తుల ద్వారా సోనమ్ కపూర్ మనల్ని ఏడిపించిన 6 సందర్భాలు
సోనమ్ కపూర్,పరిచయం అక్కర్లేని పేరు.ఫ్యాషన్ లో ఆమె తనకంటూ ఒక శైలిని సృష్టించుకుంది. మన దేశంలో ఉన్న ఫ్యాషన్ ఐకాన్లలో ఆమె కూడా ఒకరు.తను స్వయంగా ప్రముఖ సినీ కుటుంబం నుండి వచ్చినా ఆమె స్వయం కృషితో ఈ స్థానానికి చేరుకున్నారు(కొంచెం తన తండ్రి అనీల్ కపూర్ సాయం కూడా ఉందనుకోండి).
అపూర్వమనిపించే దుస్తులు ధరించడంలో ఈమె ప్రసిద్ధి.తను అలా కనిపించడంతోనే ఆమె తన ఫ్యాషన్ తో చూపరులని షాక్ కి గురి చేస్తుంది.ఫ్యాషనిస్టా అనే పదానికి మారు పేరుగా సోనమ్ కపూర్ నిలిచింది అనడంలో అతిశయోక్తి లేదు.ఈ ఫ్యాషనిస్టా ఇమేజ్ ని ఆమె చాలా సీరియస్ గా తీసుకుంది అనచ్చు.
ఆమె తన దుస్తులని ఎంచుకోవడంలో చాలా సృజనాత్మకంగా ఆలోచిస్తుంది అనచ్చు.ఒక జాతి మొత్తం నీ నుండి ఫ్యాషన్ టిప్స్ గురించి ఎదురు చూస్తున్నాపుడు ఆమాత్రం జాగ్రత్త తీసుకోకపోతే ఎలాగ??
మాకు అర్ధమయ్యింది.హోదా పెద్దదయిన కొద్దీ బాధ్యత కూడా అలాగే పెరుగుతుంది.సోనం కపూర్ విషయానికొస్తే ఎప్పుడూ అందం గా కనిపించడం ఆమె బాధ్యత.కానీ ఒక్కోసారి ఆమె సాధారణ ప్రజల అభిరుచి కి భిన్నంగా వెళ్తుంది అని చెప్తే కాస్త బాధ కలుగుతుంది.
ఆమె తన దుస్తుల మీద కావాల్సిన దానికంటే ఎక్కువగా దృష్టి సారించడం వల్ల ఎదురయ్యే పరిణామాలు నిరాశాజనకంగా ఉంటున్నాయి.బహూశా ఆమె చేస్తున్నది అదేనేమో అని మాకనిపిస్తోంది.ఆమె మనల్ని ఇలా నిరాశకి గురి చేసిన సందర్భాల గురించే ఈనాటి ఆర్టికిల్.
ఫ్యాషన్ ప్రపంచంలో ఆమె బాగా పేరు సంపాదించుకుంది కానీ ఆమె ఒక్కోసారి కొంచం తన స్పీడుని తగ్గించుకోవాలి అని మాకనిపిస్తుంది.ఒక్కోసారి ఫ్యాషన్ పేరుతో ఆమె ధరించిన దుస్తులు మమ్మల్ని షాక్ కి గురి చేయడమే కాదు గట్టిగా ఏడ్వాలనిపించేటట్లు ఉంటాయి.ముఖ్యం గా అంతర్జాతీయ అవనికపై ఆమె భారత దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ధరించే దుస్తుల విషయం లో.
సోనమ్ కపూర్ తన దుస్తుల మీద దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమయ్యింది. ఫ్యాషన్ పేరుతో గాడీ గా ఉండే బట్టలు ధరించి చూపరులని షాక్ కి గురి చెయ్యకుండా ఉండటం పై ఆమె తన దృష్టిని నిలపాల్సిన అవసరం ఉంది.ఈమె తన దుస్తుల విషయం లో ఇలాగే కొనసాగితే అత్యంత చెత్త దుస్తుల ఎంపిక చేసుకున్న సెలిబ్రిటీల విభాగంలో ఆమెకి స్థానం దక్కినా దక్కవచ్చు.
ఆమె ఫ్యాషన్ పేరుతో ధరించిన దుస్తులు చూపరులని షాక్ కి గురిచెసిన సందర్భాలని క్రోడీకరించి మీముందుంచుతున్నాము.ఇది చదివేముందు మీలో తన్నుకొస్తున్న కన్నీళ్ళని తుడుచుకునేనుదుకు వీలుగా టిష్యూ ని దగ్గరపెట్టుకోండి.

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సోనమ్ కపూర్:
ఈ డ్రెస్సు అంతర్జాలం లో బాగా వ్యాప్తి చెందింది. ఎందుకో తెలుసా?? అత్యంత అసహ్యంగా ఉన్నందుకు.ఈ డ్రెస్స్ ధరించిన సోనమ్ అంతర్జాలం లో పేరడీలకి మూలబిందువయ్యింది.చీర కి తోడుగా కేప్ జాకెట్ ధరించాలని ఆమెకి ఎలా అనిపించి అసలు??

కాన్స్‌లో రిహానా ని అనుకరించిన సోనమ్:
మళ్ళీ కాన్స్ లోనే ఈమె ధరించిన ఈ ఈకల గౌను కళ్ళకి చాలా ఇబ్బంది కలిగించింది. సోనమ్ కపూర్ రిహానా ని అనుకరింద్దామని ప్రయత్నించింది కానీ ఆమె ప్రయత్నం దారుణం గా ఫెయిల్ అయ్యింది.

2016 స్టార్ డస్ట్ అవార్డ్స్:
వక్ష స్థలం మీద నల్లటి రెక్కల వలే ఉన్న ఈ నిలువు చారల గౌనులో సోనమ్ అత్యంత చెత్తగా ఉంది. బహూశా ఈమె అవార్డ్స్ పార్టీని "మేల్‌ఫీషియెంట్" సినిమా యొక్క ప్రీమియర్‌గా పొరపడినట్లుంది.

2016 స్టార్ స్క్రీన్స్ అవార్డ్:
ఈ డ్రెస్స్ ప్రయోగాత్మకంగా ఉంది కాని కాస్త అతి అయ్యింది సోనమ్.మాకు తెలుసు నువ్వు ఫ్యాషనిస్టావనీ, కొత్త కొత్త దుస్తులు ధరించడానికి ఆసక్తి చూపుతావనీను.కానీ సాదా నలుపు రంగు డ్రెస్స్‌ని అలా మిరుమిట్లు గొలిపే డిజైన్ చేతులతో కలిపి ధరించాలని అసలు ఎలా అనిపించింది నీకు??

ఎథినిక్ ఫ్యాషన్ ని కాస్త ఎక్కువ సీరియస్‌గా తీసుకున్నట్లుంది:
ఇక్కడ సోనమ్ ధోతీ మీద ఒక బ్లౌజు దానికి తోడుగా కేప్ జాకెట్ ధరించింది. అసలు ఈ కాంబినేషన్ ద్వారా ఆమె ఏమి తెలియచేయాలనుకుంటోందో గ్రహించడం కష్టమే.

ఫిల్మ్ ఫేర్ ప్రీ పార్టీ బ్యాష్:
వెడల్పాటి భుజాలమీద ప్యాడెడ్ షోల్డర్స్ ఉన్న డ్రెస్స్.అసలు ఇలా ధరించడం వల్ల నీకు ఒనగూరిన ప్రయోజనమేమిటీ సోనమ్??



Click it and Unblock the Notifications