Latest Updates
-
నీట్ రద్దుతో మొదలైన గొడవలు.. మీ రిలేషన్షిప్ను కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
పెళ్లికి ముందే ఆస్తుల ఒప్పందం… ఇది విడాకుల కోసమా లేక బంధం కోసం భద్రతా? అసలు నిజం ఇదే! -
మే 18: గ్రహాల కటాక్షంతో ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. మీ రాశి ఉందేమో చూడండి! -
రాజయోగం, ధన యోగం కలయిక.. ఈ రాశుల వారికి నేడు ఊహించని ధనలాభం, అదృష్టం మీదే! -
మైసూర్ మటన్ పులావ్..టేస్ట్ కి సలాం కొట్టాల్సిందే!..ఈజీగా చేసుకోండిలా.. -
ఈరోజు సోమవారం.. పనులు మొదలుపెట్టే ముందు ఈ రాహుకాలం, శుభ ముహూర్తాలు చూసుకున్నారా? -
కడుపుకు తేలికగా, నోటికి రుచిగా ఉండే కమ్మనిపెరుగు ఉప్మా.. బ్రేక్ ఫాస్ట్ కి బెస్ట్ ఆప్షన్! -
రేవతి నక్షత్రంలోకి శని ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు.. జీవితంలో ఊహించని మార్పులు! -
మిథునం, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - సోమవారం, 18 మే 2026 -
లంచ్ బాక్స్ కైనా, లైట్ డిన్నర్ కైనా ది బెస్ట్ ఆప్షన్.. నిమిషాల్లో రెడీ అయ్యే అవకాడో చికెన్ సలాడ్
డాన్స్ ఫ్యాషన్ ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన 7 రకాల అవుట్ ఫిట్స్
డ్యాన్స్ ని రక్తి కట్టించడంలో దుస్తులతో పాటు ఫ్యాషన్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇంకా చెప్పాలంటే, వస్త్రాలంకరణ నాట్యాన్ని రక్తి కట్టించండంలో తనదైన పాత్ర పోషిస్తుంది. సృజనాత్మకత అనే కళతో మేళవింపబడిన దృశ్యకళ అనే రెండు వర్గాల కళల సమ్మేళనమే డ్యాన్స్ ను రక్తి కట్టిస్తాయని పేర్కొనవచ్చు.డుబ్లిన్ డ్యాన్స్ ఫెస్టివల్ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో, డ్యాన్స్ కి సంబంధించిన ఫ్యాషన్ అవుట్ ఫిట్స్ విశేషాలతో మీ ముందుకొస్తున్నాం.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల నృత్య రూపాలున్నాయి. స్టన్నింగ్ కాస్త్య్యూమ్స్ తో అలాగే అవుట్ ఫిట్స్ తో నృత్య కళాకారులు వివిధ రకాల నృత్య రూపాలను పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను విస్మయపరుస్తుంటారు. అంతెందుకు, మన భారతదేశంలోనే దాదాపు పన్నెండు రకాల నృత్య రూపాలలో అద్భుతమైన వస్త్రాలంకరణలను మనం గమనించవచ్చు.
అలాగే, అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన వెస్ట్రన్ డ్యాన్స్ ఫార్మ్స్ కూడా వివిధ షోల ద్వారా మనకి వినోదాన్ని పంచాయి. ఆయా డ్యాన్స్ ఫార్మ్స్ లో వాడే దుస్తులు ఆ పాత్రల ప్రాధాన్యానికి తగినట్టుగా ఉండడంతో పాటు ఆయా పాత్రల ఔన్నిత్యాన్ని పెంచి డ్యాన్స్ మూవ్మెంట్స్ కు అనుగుణంగా ఉంటూ ప్రేక్షకుల మూడ్ ను సెట్ చేసే విధంగా ఉంటాయి.
ప్రతి రకం కాస్ట్యూమ్ కేవలం కనువిందు కోసమే కాకుండా, ఆయా డ్యాన్స్ మూవ్మెంట్స్ కి తగినట్టుగా ఫ్లెక్సిబిల్ గా ఇమిడిపోతాయన్నది గమనించదగిన విషయం. అటువంటి కాస్ట్యూమ్స్ లో మనం అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన కొన్ని డ్యాన్స్ కాస్ట్యూమ్స్ ని గురించి తెలుసుకుందాం ...

వాల్జ్ కాస్ట్యూమ్
మృదువైన అలాగే నెమ్మదిగా సాగే ఫోక్ డ్యాన్స్ కు మనోహరమైన బాల్ గౌన్ అవసరమవుతుంది. ఈ బాల్ గౌన్ ఆకర్షణీయమైన ప్రిన్సెస్ లుక్ ని ఇవ్వడంలో సఫలీకృతమవుతుంది. అఫ్ కోర్స్, ఈ డ్యాన్స్ లో మీతో జతకట్టే వ్యక్తికూడా నిశితమైన వస్త్రాలంకరణతో షో ని మెస్మరైజ్ చేస్తాడు.

బ్యాలెట్ కాస్ట్యూమ్
సుందరమైన అలాగే మనోహరమైన డ్యాన్స్ ఫార్మ్ గా బ్యాలెట్ డ్యాన్స్ ని అభివర్ణించవచ్చు. బ్యాలెట్ డ్యాన్స్ వస్త్రాలు మృదువైన రంగులతో, శరీరానికి తగినట్టుగా ఫిట్ గా ఉంటూ ఒక జత స్లాక్స్ తో అలాగే ఆకర్షణీయమైన టుల్లె టుటు స్కర్ట్ తో పొందికగా ఉంటాయి.

సాల్సా కాస్ట్యూమ్
కలర్ ఫుల్ గా, సెక్సీగా ఉంటూ ప్రతి ఒక్కరికి తగినంత వినోదాన్నిచ్చే సాల్సా డ్యాన్స్ లో కాస్ట్యూమ్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ డ్యాన్స్ ని అద్భుతంగా రక్తి కట్టించడానికి వాడే లేటిన్ అమెరికా కాస్ట్యూమ్స్ నే ఇందులో ముఖ్యంగా మనం అభినందించవలసిన అంశం.

జైవ్ కాస్ట్యూమ్
ఈ డ్యాన్స్ ఫార్మ్ ఉల్లాసభరితంగా ఉంటూ అవధులు లేకుండా వినోదాన్ని పంచడంలో విజయం సాధిస్తుంది. ఈ డ్యాన్స్ ఫార్మ్ కి వాడే కాస్ట్యూమ్స్ కొంచెం ప్రెప్పీ గా ఓల్డ్ స్కూల్ టచ్ లో ఉంటాయి. ఈ డ్యాన్స్ ఫార్మ్ లో వాడే కాస్ట్యూమ్స్ లో రఫుల్స్ తో పాటు మనోహరమైన హార్ట్ నెక్ లైన్స్ ను గమనించవచ్చు.

సాంబా కాస్ట్యూమ్
సంప్రదాయమైన ఈ బ్రెజిలియన్ డ్యాన్స్ చాలా వినోదంతో పాటు మనోహరంగా ఉంటుంది. చాలా తక్కువ దుస్తులను ఈ డాన్స్ లో ధరిస్తారు. అందువల్ల డ్యాన్స్ కు ఈ దుస్తులు చాలా సపోర్టివ్ గా ఉంటాయి. ఇంకా ఈ కాస్ట్యూమ్ లో ఫెదర్స్, చైన్స్ తో పాటు బీడ్స్ ను కూడా గమించవచ్చు.

హిప్-హాప్ కాస్ట్యూమ్
విశేషంగా ఆదరింపబడుతున్న పాప్ కల్చర్ వల్ల హిప్-హాప్ అవుట్ ఫిట్స్ కు ఆదరణ పెరిగింది. ఈ కాస్ట్యూమ్స్ యువతీ యువకులలో క్యాజువాల్ వేర్ లో భాగం అయిపోయాయనడంలో అతిశయోక్తి లేదు. స్వెట్ షర్ట్స్ తో పాటు బ్యాగీ లోవెయిస్ట్ ప్యాంట్స్, అలాగే వివిధ స్టేట్మెంట్స్ కలిగిన హుడీస్ తో ఈ కాస్ట్యూమ్స్ విశేష ఆదరణ పొందుతున్నాయి.

రుమ్బా కాస్ట్యూమ్
పొరలు పొరలుగా ఉండే ఈ కాస్ట్యూమ్ రుమ్బా డ్యాన్స్ మూవ్స్ కి అనుగుణంగా ఉంటాయి. ఆధునిక రుమ్బా డ్యాన్స్ కాస్ట్యూమ్స్ మనోహరంగా ఉంటాయి. అంతే కాకుండా ఈ కాస్ట్యూమ్స్ డ్యాన్స్ మూవ్స్ చాలా క్లియర్ గా కనిపించి ప్రేక్షకులకు వినోదాన్ని పంచే విధంగా డిజైన్ చేయబడ్డాయి.



Click it and Unblock the Notifications