Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
Aditi rao: అందాలతో అదరహో అనిపిస్తున్న అదితిరావ్
తన ఔట్ ఫిట్ తో ఎప్పుడు మెస్మరైజ్ చేస్తుంది అదితి రావు హైదరీ. తను ఏది ధరించినా తన అందం రెట్టింపు అయ్యేలా చూసుకుంటుంది.
Aditi rao: అందం, అభినయం కలగలిపినట్లు ఉంటుంది అదితి రావు హైదరీని చూస్తుంటే. తన నటన ప్రతిభతో తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతోంది ఈ చిన్నది. అదితి రావు హైదరీ చేసినవి కొన్ని సినిమాలే. కానీ, ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఈ భామ. అందానికి అందం, ప్రతిభకు ప్రతిభ ఉన్న అతి కొద్ది నటీమణుల్లో అదితిరావు ఒకరు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అందాల తార.. ఫ్యాషన్ పాఠాలను చెప్పకనే చెబుతోంది.
తన ఔట్ ఫిట్ తో ఎప్పుడు మెస్మరైజ్ చేస్తుంది అదితి రావు హైదరీ. తను ఏది ధరించినా తన అందం రెట్టింపు అయ్యేలా చూసుకుంటుంది. వివిధ సందర్భాల్లో తన ఫ్యాషన్ వేర్ ఎలా ఉందో ఓ లుక్ వేద్దాం.

1. ఫెస్టివ్ వేర్
అదితి రావు హైదరీ ఫెస్టివ్ వేర్ లో చూపుతిప్పుకోనివ్వదు. లెహంగాలో ఈ అమ్మడి లుక్ అదిరిపోతుంది. మనీష్ మల్హోత్రా, పునీత్ బాలనా, జయంతి రెడ్డి అలాగే సుకృతి & ఆకృతి వంటి ప్రముఖ డిజైనర్ల లెహంగాల్లో అదితి కనిపించి కవ్వించిన సందర్భాలు బోలెడు. ఇక్కడ పసుపు రంగు దుపట్టా, ఎరుపు రంగుతో ఉన్న శ్యామల్ భూమిక రూపొందించిన ఈ లెహంగాలో అదితి అదరహో అనిపిస్తోంది.

2. చీరలో అదితి చమక్కులు
చీరలో అదితి కనిపించిన సందర్భాలు బోలెడు. చీరలో కనిపించినా.. సాధారణ డ్రెస్సుల్లో కనిపించినా.. అదితి తన స్టైల్ ను మాత్రం అలాగే క్యారీ చేస్తుంది. ఆరెంజ్ సిల్క్ సారీలో లేత గులాబీ రంగు బార్డర్ సారీలో అదితి కనిపించింది. హెయిర్ ను లూజ్ గా వదిలే తన శైలిని ఇక్కడ కూడా క్యారీ చేసింది ఈ అమ్మడు. 3/4 హ్యాండ్స్ కలిగిన బ్లౌజ్ వేసుకుంది. మెడలో చోకర్ అదితి అందాన్ని అమాంతం పెంచేశాయి. చీరలో అదితి రావ్ చాలా అందంగా ఉంది. ఆమె చీరకు సరిపోయేలా బ్రోకేడ్ బ్లౌజ్ ధరించింది.

3. అదితి 'వైట్' అందాలు
తెలుపు రంగు చీరలో వైట్ పికాక్ ల మెరిసిపోతోంది అదితి. డీప్ నెక్ తో ఫుల్ స్లీవ్ బ్లౌజ్ ఈ చీరకు చాలా చక్కగా సూట్ అయింది. ముదురు రంగు లిప్ షేడ్ అదితికి ఎంతో బాగుంది.

4. మోనోక్రోమ్ లుక్ లో అదితి
డార్క్ పింక్ కలర్ మోనోక్రోమ్ ఔట్ ఫిట్ అదితికి చక్కగా సరిపోయింది. లూజ్ ప్యాంట్ పైన ఫుల్ హ్యాండ్స్ జాకెట్ లుక్ చాలా బాగుంది. మెడలో సన్నని చోకర్ తో ఈ అమ్మడి ఫోజ్ సూపర్ కూల్ గా ఉంది.

5. స్లీవ్ లెస్ ఫుల్ ఫ్రాక్
గులాబీ రంగులో ఆకుల డిజైన్ తో ఉన్న ఫుల్ ఫ్రాక్ లో అదితి మోర్ ఫ్యాషనబుల్ గా కనిపిస్తోంది. స్లీవ్ లెస్ తో వచ్చిన ఈ ఫుల్ ఫ్రాక్ లో హైదరీ అందం హైలట్ అయింది. పెద్ద సైజ్ చోకర్ ట్రెడిషన్ లుక్ ను మరింత పెంచి చూపిస్తోంది.

6. ఓల్డ్ ఇజ్ గోల్డ్
నలుపు రంగు చీరలో పాత కాలపు లుక్ లో అదితి రావు అదిరిపోయింది. పఫ్ మోడల్ జాకెట్ ఈ లుక్ కు సరిగ్గా సరిపోయింది.

7. పచ్చని చీరలో అదితి పరువాలు
పచ్చని చీరలో దేవకన్యలా ఉంది అదితి. స్లీవ్ లెస్ బ్లౌజ్ తో కనిపించి మెరిసింది. హెయిర్ ను కొప్పులా మార్చి, పూలు పెట్టింది.



Click it and Unblock the Notifications