Latest Updates
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026
ఏ యే సెలబ్రెటీ కపుల్స్ మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉందో తెలుసా ?
ట్రూ లవ్ విషయానికి వస్తే.. వయసు అసలు మ్యాటరే కాదు. ఈ మాట చాలా మంది పాపులర్ స్టార్స్ నిరూపించారు. కొందమంది ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు వయసులో డిఫరెన్స్ గురించి తెలుస్తుంది. కానీ.. ప్రేమలో సక్సెస్ అవడానికి వయసుతో పనేముందిలే అనుకుంటూ ఉంటారు. అందుకే వయసు గురించి పట్టించుకోకుండా.. వెంటనే మూడుముళ్లతో ఒక్కటయిపోతారు.
సాధారణంగా భార్య వయసు భర్త కంటే తక్కువగా ఉండాలి అనే సంప్రదాయం ఉంది. అయితే.. కొంతమంది కపుల్స్ భార్య తనకంటే వయసులో పెద్దవాళ్లు కలిగి ఉన్నారు. అలాగే కొంతమంది కపుల్స్ కి ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంటుంది. మరి సెలబ్రెటీలు.. ఎవరు ఎక్కువ వయసు తేడా కలిగి ఉన్నారో తెలుసుకుందామా.. ఏ సెలబ్రెటీ కపుల్స్ మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉందో ఇప్పుడు చూద్దాం..

ఊర్మిళా, మోహ్సిన్ అక్తర్
2016 మార్చి 3న సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న ఊర్మిలా, అక్తర్ మధ్య ఏజ్ గ్యాప్ 10 ఏళ్లు. అయితే ఊర్మిలా కంటే.. అతనే 10 ఏళ్లు చిన్నవాడట.

కబీర్ బేడీ, పర్వీన్
70 ఏళ్ల నటుడు కబీర్ బేడీ.. జనవరి 15, 2016న తన గాల్ ఫ్రెండ్ పర్వీన్ ను పెళ్లాడాడు. అయితే.. ఆమె కబీర్ కంటే.. 28 ఏళ్లు చిన్నది.

అశిన్, రాహుల్ శర్మ
పాపులర్ యాక్టర్ అశిన్, రాహుల్ శర్మ మధ్య 10 ఏళ్ల గ్యాప్ ఉంది. రాహుల్ శర్మ కంటే అశిన్ 10 ఏళ్లు చిన్నది. వీళ్ల వివాహం 2016 జనవరి 19న జరిగింది.

షాహిద్ కపూర్, మీరా
షాహిద్ , మీరా మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉంది. షాహిద్ మీరా కంటే.. 13 ఏళ్లు పెద్దవాడు.

కరీనా, సైఫ్ అలీఖాన్
కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ ప్రేమ జంట.. మధ్య 10 ఏళ్ల గ్యాప్ ఉంది. కరీనా కపూర్ సైఫ్ కంటే.. 10 ఏళ్లు చిన్నది.

రితేష్, జెనీలియా
లవ్లీ కపుల్ జెనీలియా, రితేష్ మధ్య 9 ఏళ్లు వయసు తేడా ఉంది. రితేష్ జెనీలియా కంటే.. 9 ఏళ్లు పెద్దవాడు.

సోహా అలీఖాన్, కునాల్ ఖేము
సోహా అలీఖాన్, కునాల్ కి 2015 జనవరి 25 న పెళ్లైంది. కునాల్ ఖాము తన భార్య సోహా కంటే.. 5 ఏళ్లు చిన్నవాడు.

అమీర్ ఖాన్, కిరణ్ రావ్
అమీర్ ఖాన్, కిరణ్ రావ్ పెళ్లి 2005 డిసెంబర్ 28న అయింది. వీళ్లిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 9 ఏళ్లు.

హేమ మాలిని, ధర్మేంద్ర
ఐదేళ్ల డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకుని అందమైన జంటగా బాలీవుడ్ లో క్రేజ్ సంపాదించారు హేమమాలిని, ధర్మేంద్ర. వీళిద్దరి మధ్య 13 ఏళ్ల వ్యత్యాసం ఉంది.

సైరా భాను, దిలీప్ కుమార్
బాలీవుడ్ ట్రాజెడీ కింగ్ గా దిలీప్ కుమార్ కి, ముందుతరం గోల్డెన్ గర్ల్ గా సైరా భానుకి మంచి క్రేజ్ ఉంది. వీళ్లిద్దరు 1966లో ఒక్కటయ్యారు. వీళ్లద్దరి మధ్య 22 ఏళ్లు గ్యాప్ ఉంది. కానీ ఏజ్ వాళ్లకు సమస్య కాలేదు.

ఫరా ఖాన్, శిరీష్ కుందర్
వీళిద్దరి పెళ్లి 2004లో జరిగింది. అయితే శిరీష్ ఫరా ఖాన్ కంటే.. 8 ఏళ్లు వయసులో చిన్నవాడు.

జానీ, అంబర్ హియర్డ్
నటుడు జానీ డెప్ హీరోయిన్ అంబెర్ హియర్డ్ తో ఫిబ్రవరి 2015లో పెళ్లి అయింది. వీళ్లిద్దరి మధ్య 23 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది.

బోనీ కపూర్, శ్రీదేవి
అతిలోక సుందరిగా క్రేజ్ సంపాదించిన ఎవర్ గ్రీన్ బ్యూటీ శ్రీదేవి, బోనీ కపూర్ మధ్య 8 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉందట. శ్రీదేవిని పెళ్లి చేసుకోవడానికి బోనీ కపూర్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు.

డింపుల్ కపాడియా, రాజేష్ కన్నా
డింపుల్ కపాడియా, రాజేష్ ఖాన్నా మధ్య ఏజ్ గ్యాప్ 16 ఏళ్లు. వీళిద్దరి పెళ్లి జరిగే సమయానికి ఆమె వయసు 16 ఏళ్లు.

సంజయ్ దత్, మన్యతా
సంజయ్ దత్ పెళ్లి చేసుకున్న మాన్యతాకి మధ్య 19 ఏళ్ల గ్యాప్ ఉంది. మాన్యతా కంటే సంజయ్ 19 ఏళ్లు పెద్దవాడు.



Click it and Unblock the Notifications