Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ప్రపుల్ పటేల్ కుమార్తె సంగీత్‌లో ధోనీ, జహీర్ ఫ్యాషన్ షో
ప్రపుల్ పటేల్ కుమార్తె సంగీత్‌లో ధోనీ, జహీర్ ఫ్యాషన్ షో
మాజీ కేంద్రమంత్రి ప్రపుల్ పటేల్ కుమార్తె పూర్ణా పటేల్ సంగీత్ కార్యక్రమానికి తారాలోకం దిగివచ్చింది. అందులోనూ కుటుంబాలతో వచ్చిన క్రికెటర్లు ధోనీ, జహీర్‌ఖాన్ అందరి దృష్టినీ తమపైనే నిలుపుకున్నారు. వివాహానికి ముందు జరిగే ఈ కార్యక్రమంలో వీరిద్దరూ సందడి సందడి చేశారు.
సెమీ-ఫార్మల్ దుస్తుల్లో వచ్చిన ధోనీ అందర్నీ కట్టిపడేశారు. కాలర్‌తో కూడిన ఆలివ్ గ్రీన్ కుర్తా వేసుకున్న ధోనీ, దానికి ఏమాత్రం పోలికలేని స్ట్రెయిట్ ఫిట్ నేవీ బ్లూ జీన్స్ ధరించాడు. ఈ కాంబినేషనే అందర్నీ ఆకర్షించింది. అతని దేశీ అవతారానికి ముగ్ధుల్ని చేసింది.

ధోనీతో పాటే వేడుకకు వచ్చిన అతని భార్య సాక్షి ధోనీ మెరూన్ రంగు చీరను కట్టుకుని, అద్భుత అలంకరణలతో కూడిన వెండి రంగు బ్లౌజ్‌తో మెరిసిపోయింది. వారి ముద్దుల చిన్నారి, జీవా పూల డిజైన్లతో ఉన్న కాషామ మరియు తెలుపు వర్ణాల సంప్రదాయ దుస్తులను వేసుకుని అందరి కళ్లను తనవైపు తిప్పుకుంది.

ఎంఎస్ ధోనీ కుమార్తె
మరో వైపు జహీర్ ఖాన్, తన సంప్రదాయ దుస్తుల్లో క్లాసీగా కనిపించాడు. అనితా డోంగ్రో రూపొందించిన దుస్తులు ధరించిన జహీర్, అందరి చూపునూ ఆకర్షించాడు. నీలి రంగు పూల బొమ్మలతో కూడిన పురాతన శైలిలోని తెల్లని కుర్తాకు, తెల్లని పైజామాను, నల్లని చెప్పులు వేసుకుని తన ప్రత్యేకతను చాటుకున్నాడు.

జహీర్ ఖాన్ భార్య, సినీ నటి, సాగరిక ఘట్కే బంగారు బోర్డర్ ఉన్న బూడిద రంగు చీరను ధరించింది. ఆకుపచ్చ రంగులో మెరుపుల పూల డిజైన్‌తో అదరగొట్టే బ్లౌజ్‌ను ఆమె ధరించింది. వెండి రంగులోని చెవి లోలాకులతో తన అందాన్ని మరింత పెంచుకుంది.

సరే, ధోనీ , జహీర్‌లు మనల్ని మెప్పించారు కానీ, ఇద్దరిలో మిమ్మల్ని బాగా మెప్పించిందెవరో మాకు చెప్పండి?




Click it and Unblock the Notifications