Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
విమానాశ్రయంలో తాజాగా దర్శనమిచ్చిన దీపిక, తన సొగసుతో అందరి మతి చెదరగొట్టేసింది!
విమానాశ్రయంలో తాజాగా దర్శనమిచ్చిన దీపిక, తన సొగసుతో అందరి మతి చెదరగొట్టేసింది!
దీపికా పడుకొనే ఎప్పుడు తన వస్త్రశైలి చాలా సౌకర్యవంతమైనదిగా ఉండాలని కోరుకోవడమే కాక, దానిని అనుసరించి చూపిస్తుంది. తాజాగా విమానాశ్రయంలో ఆమె దర్శనమిచ్చినపుడు, ఆమె వస్త్రధారణ అధునాతన శైలిని ప్రతిబింబిస్తూ, విశ్రాంతినిచ్చే విధంగా ఉన్నాయి. చూపరులు ఖచ్చితంగా మెచ్చే రూపంలో ఆమె అపురూపంగా కనపడింది. విమానాశ్రయంలో అడుగు పెట్టిపెట్టగానే కెమెరా కళ్ళకు చిక్కిన ఈ నటీమణి, తన వెలకట్టలేని చిరునవ్వుతో పోజులిచ్చింది.
ఈ దుస్తుల రంగు, ఈ మధ్య దీపికకు తెలుపుపై పెరుగుతున్న ప్రేమకు సంకేతమిస్తున్నాయి. అవును,ఈ 'పద్మావత్' తారామణి, ఈ మధ్య కాలంలో తెల్లని దుస్తులలో ఎక్కువగా కనిపిస్తుంది.

విమానాశ్రయం వద్ద కనిపించినప్పుడు, ఆమె బిగుతైన తెల్లని స్లీవ్ లెస్ షార్ట్ టాప్ కు జతగా ఆమె నల్లటి బాటమ్స్ తో జత చేసింది. ఆమె హై వెయిస్ట్ ట్రౌసర్స్ సమకాలీనంగా కనిపిస్తూ, మెటాలిక్ టచ్ కలిగి ఉన్నాయి. ఆ మేలు కలయికలో ఆమె మనోహరంగా కనిపించింది. నలుపు మరియు తెలుపు రంగులలో దుస్తులను, చక్కగా జతపరిస్తే, చూపరులను తలతిప్పుకొనివ్వవనడానికి దీపిక ఒక ఉదాహరణ.

ఆమె ధరించిన పాశ్చాత్య వస్త్రధారణకు నప్పేలా నల్లని స్పోర్ట్స్ షూలు ధరించింది. ఆ నలుపు రంగుల షేడ్స్ కూడా ఆమె వస్త్రధారణతో చక్కగా నప్పాయి. దీపిక కేవలం ఒక వాచ్ మరియు కొన్ని స్టైలిష్ గాజులను ధరించింది. ఆమె అలంకరణ చాలా తక్కువగా ఉంది మరియు ఆమె పొడవైన జుట్టును వదులుగా గాలికి ఊగేలా వదిలేసింది.

దీపిక యొక్క ఈ లుక్ మాకు తెగ నచ్చేసింది? మరి మీ సంగతి ఏమిటి? మీ అభిప్రాయాలను మాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి.



Click it and Unblock the Notifications