For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సభ్యసాచి నిలాయ క్రియేషన్స్ కోసం బెంగాలీ ముద్దుగుమ్మలా మారిన దీపికా పడుకొనే

|

సభ్యసాచి ముఖర్జీ డిజైన్స్ గురించి ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. ఫ్యాషన్ క్రియేషన్స్ తో పాటు అనుభవజ్ఞుడైన ఇంటీరియర్ డిజైనర్ గా కూడా సభ్యసాచి పేరుపొందాడు.యాషియన్ పెయింట్స్ నిలయాకి అత్యద్భుతమైన ఇంటీరియర్ కలెక్షన్ ను అందించాడు. భారతీయ సాంప్రదాయం ఉట్టిపడే రీతిలో కొన్ని కొత్త డిజైన్స్ ను రూపొందించాడు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే సభ్య ఫెవరెట్ మోడల్ అన్న విషయం తెలిసినదే. దీపికా తన హొయలుతో నిలాయ కోసం మోడలింగ్ చేసింది.

మహారాణి లుక్ లో తళుక్కుమన్న దీపికా

మహారాణి లుక్ లో తళుక్కుమన్న దీపికా

బెంగాల్ హిస్టరీ గురించి తెలుసుకున్న వారికి దీపికా లుక్ యిట్టె అర్థమైపోతుంది. ఈ లుక్ లో బోనెడి కుటుంబానికి చెందిన మహిళల రాయల్ లుక్ లో దర్శనమిచ్చింది దీపికా. సభ్యసాచి చేత రూపొందించబడిన బీజ్ శారీని ధరించి ఎమెరాల్డ్ చోకర్ ను మ్యాచ్ చేసింది దీపికా. రాయల్ మేకప్ ని అలాగే హెయిర్ స్టయిల్ తో ఆకట్టుకుంది. ఈ డిజైనర్ రూపొందించిన గుల్దాస్తా ఫ్లోరల్ బ్యాక్గ్రౌండ్ వద్ద దీపికా స్టైల్ చూస్తే ఆమె రాయల్టీకి ముగ్ధులవ్వాల్సిందే.

సొగసైన దృక్పధం:

సొగసైన దృక్పధం:

ఈ లుక్ కూడా బెంగాలీ మహిళను ప్రతిబింబించేదే. సభ్యసాచి ఆర్ట్ ఫౌండేషన్ వారిచే హ్యాండ్ పెయింట్ వేయబడిన గ్లాసీ రెడ్ బెనారస్ శారీలో మెరిసింది దీపికా. క్లాసీ జ్యూవెలరీని ధరించి తన లుక్ ని మరింత రాయల్ గా మార్చుకుంది. చక్కటి బొట్టును కూడా ధరించింది. ఫ్లోరా మరియు ఫానా మూలాంశంగా రూపొందించబడిన బెంగాల్ రెడ్ బ్యాక్ గ్రౌండ్ అనేది జీవితపు చెట్టును గుర్తుచేస్తూ ఆకట్టుకుంది.

జమిందారీ లుక్:

జమిందారీ లుక్:

బెంగాల్ రాయల్ ఫెమిలీస్ కి చెందిన మహిళలు స్టైల్ ఐకాన్ లా ఉండేవారు. అటువంటి ఇమేజ్ లో దీపిక యిట్టె ఇమిడిపోయింది. దీపికా గోల్డెన్ జరీతో పాటు ఎంబ్రాయిడరీ అలాగే మోటిఫ్ ప్రింట్స్ కలిగిన బెనారస్ శారీని ధరించింది. జరీ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీతో బ్లవుజ్ డిజైన్ కూడా మ్యాచ్ అయింది.

మిక్స్ అండ్ మ్యాచ్ జ్యువెలరీ

మిక్స్ అండ్ మ్యాచ్ జ్యువెలరీ

అద్భుతమైన కుందన్ జ్యూవెలరీతో పాటు నెక్లెస్ అనేది రాజస్థాన్ ఆర్ట్ ని ప్రతిబింబించింది. ఇంతకుముందెప్పుడూ దీపికా ఇంత అందంగా కనిపంచలేదంటే అతిశయోక్తి కాదేమో. బెంగాలీ సంప్రదాయాన్ని ఉట్టిపడేలా చేసే ఎర్రబొట్టుని ధరించింది దీపికా. లో బన్ హెయిర్ స్టైల్ తో తళుక్కుమంది.

నార్త్ కలకత్తాని ప్రతిబింబించింది:

నార్త్ కలకత్తాని ప్రతిబింబించింది:

సభ్యసాచిలోని బెంగాలీ సైడ్ అనేది ఈ డిజైన్స్ లో ప్రతిబింబించింది. పురాతన ఇంటీరియర్ డిజైన్స్ లో కూడా బెంగాలీతనం ఉట్టిపడింది. పురాతన పెయింటింగ్స్, ఫర్నిచర్స్, మాసీ మరియు ఫ్లోరల్ డిజైన్ వాల్స్, ఇవన్నీ నార్త్ కలకత్తాని ప్రతిబింబిస్తున్నాయి.

English summary

Deepika Padukone Turns Royally Bengali For Sabyasachi And Nilaaya

There is no matter of doubt when it concerns Sabyasachi Mukherjee's designs. Apart from his fashion creations, he is an expert interior designer too, and for his interior collection for Asian Paints' Nilaaya, he created some new designs. Deepika Padukone modelled for Nilaaya, reflecting sheer elegance.
Story first published:Wednesday, February 7, 2018, 12:59 [IST]
Desktop Bottom Promotion