ప్రపంచంలోనే అత్యంత సెక్సీయెస్ట్ బ్యూటీస్ దీపికా..ప్రియాంక!

Posted By:
Subscribe to Boldsky

బాలీవుడ్‌ బ్యూటీ క్వీన్స్ ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే లు హాలీవుడ్‌ కు వెళ్లిన తర్వాత వారి క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. అందం విషయంలో వారు హాలీవుడ్‌ తారలతో పోటీ పడుతున్నారు. తాజాగా మ్యాగ్జిమ్‌ మ్యాగజైన్‌ నిర్వహించిన హాట్‌ బ్యూటీల జాబితాలో ఈ ఇద్దరు స్థానం దక్కించుకున్నారు.

2017 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే టాప్ 100 హాట్ బ్యూటీలను ఎంపిక చేసింది. మొత్తం వంద మంది బ్యూటీలతో కూడిన జాబితా కోసం మ్యాగ్జిమ్‌ పోల్ నిర్వహించింది.

Deepika and Priyank Chopra Becomes Hottest Woman Of The Year, Features On Maxim India Cover

ఐతే ఈ లిస్టులో అందరికంటే అగ్రస్థానంలో ప్రముఖ మోడల్ హెయిలీ బాల్డ్‌ విన్‌ మొదటి స్థానంలో నిలిచారు. ఎమ్మా వాట్సన్‌, ఎమ్మాస్టోన్‌, డకోటా జాన్సన్‌, కెండల్ జెన్నర్‌ వంటి తారలు హాట్‌ బ్యూటీలుగా నిలిచారు.

 Deepika and Priyank Chopra Becomes Hottest Woman Of The Year, Features On Maxim India Cover

మొత్తం వంద మంది బ్యూటీలను ఎంపిక చేశారు. వీరిలో భారత్‌ నుంచి ఇద్దరికి మాత్రమే చోటు దక్కింది. దీపికా, ప్రియాంక లు హాలీవుడ్‌ కు ఎంట్రీ ఇచ్చిన తర్వాతే వాళ్ల ఫేట్ మారిపోయింది. తొలి సినిమా ట్రిపుల్ ఎక్స్ తోనే దీపికకు బ్రహ్మాండంగా ప్రశంసలు లభించాయి. ఇక ప్రియాంకా చోప్రా కూడా క్వాంటికో అనే అమెరికన్ టీవీ సిరీస్‌తో హాలీవుడ్‌లో అడుగుపెట్టారు.

ఈ వారంలోనే ఆమె నటించిన తొలి హాలీవుడ్ మూవీ బేవాచ్ కూడా రిలీజ్ కానుంది. ప్రపంచంలో టాప్‌ 100 బ్యూటీల్లో చోటు దక్కటం పై దీపికా, ప్రియాంక సంతోషం వ్యక్తం చేశారు.

English summary

Deepika and Priyank Chopra Becomes Hottest Woman Of The Year, Features On Maxim India Cover

Deepika and Priyank Chopra Becomes Hottest Woman Of The Year, Features On Maxim India Cover
Subscribe Newsletter