For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చలికాలం నుండి వసంతకాలంలోకి మారేటప్పుడు మేటి 6 ఫిబ్రవరి ఫ్యాషన్ చిట్కాలు

మీ వార్డ్ రోబ్ నిండిపోయి బయటకి ప్రవహిస్తున్నా మీకు సరిగా వేసుకోటానికి ఏ బట్టలూ లేవని తెలిసినప్పుడు, మీ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా?

|

మీ వార్డ్ రోబ్ నిండిపోయి బయటకి ప్రవహిస్తున్నా మీకు సరిగా వేసుకోటానికి ఏ బట్టలూ లేవని తెలిసినప్పుడు, మీ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా?

చలికాలం అయిపోతున్న చివరి రోజుల్లో, వసంతకాలం మొదలవబోతున్నప్పుడు చలికి వణికిపోతూ, అదే సమయంలో చెమటలు పడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది.

అందుకే ఫిబ్రవరి వంటి నెలలో విచిత్రమైన వాతావరణంలో కూడా మీరు అందంగా కన్పించటానికి మీరు వేసుకోవాల్సిన దుస్తులను ఎంపిక చేయటంలో మీకు సాయపడేట్టుగా, మేము మీ వార్డ్ రోబ్ ను చలికాలం నుండి వసంతకాలంలోకి తగ్గట్టు చక్కగా మార్చుకోటానికి 6 చిట్కాలను ఇక్కడ అందించాం. ; బాలీవుడ్ లో మన తారల ఫ్యాషన్ నుంచి ప్రేరణ పొంది సూచించినవి. ఇక చదివి ప్రయత్నించండి.

చిట్కా#1 లేయర్లుగా ఒకదానిపై ఒకటి వేసుకోండి, కానీ తేలికగా ఉండేట్లు చూసుకోండి

చిట్కా#1 లేయర్లుగా ఒకదానిపై ఒకటి వేసుకోండి, కానీ తేలికగా ఉండేట్లు చూసుకోండి

వణికి చచ్చిపోయే చలి ఉండకపోవచ్చు, కానీ సూదులతో గుచ్చినట్లుండే చలి ఉండవచ్చు. అందుకని మందంగా ఉన్న ఊలు దుస్తులను ఇక ఆపేసి, తేలికపాటివి కానీ లేయర్లుగా ఒకదానిపై ఇంకో మ్యాచింగ్ వి అలా వేసుకోండి - ఇదిగో ఈ చిత్రంలో కరీనా కపూర్ ఉన్నట్లు - సింపుల్ ట్రౌజర్లు, టీ షర్టు మరియు డెనిమ్ జాకెట్ లుక్ ప్రయత్నించండి.

ఇంకా జాక్వెలిన్ వేసుకున్న కామీ డ్రస్ మరియు జాకెట్ లాగా ప్రయత్నించండి.

చిట్కా #2 పొడుగ్గా ఉంచుకోండి

చిట్కా #2 పొడుగ్గా ఉంచుకోండి

ఫిబ్రవరి నెలలో సాధారణంగా చలికాలంలో ముడుచుకున్న పువ్వులు మెల్లగా వికసిస్తాయి. గాలిలో కూడా ఇంకా తేమ ఉంటుంది, అందుకని సమ్మర్ స్కర్టులు మరియు కామిసోల్స్ ధరించడానికి ఇది అప్పుడే మంచి సమయం కాదు.

అందుకే ఈ నెలలో మీ బట్టలు పొడవుగా ఉంచుకోటం మంచిది, అవి సన్నని దారాలైన తేలికపాటి ఊలు వంటి వాటితో చేసినవైనా సరే. ఇదిగో ఈ చిత్రంలో దీపికా పదుకునే వేసుకున్న బెల్ స్లీవ్స్ ఉన్న పేస్టేల్ టాప్ మరియు ఓవర్ క్రాప్డ్ ప్యాంట్ల లాగా లేదా తాప్సీ ధరించిన స్లీవ్ లెస్ టాప్ మరియు లాంగ్ స్కర్ట్ లుక్ ను ప్రయత్నించండి.

చిట్కా#3 మీకు రిప్డ్ ప్యాంట్లు నచ్చితే, ఫుల్ బ్లోన్ హోల్స్ బదులు ష్రెడ్స్ మరియు స్క్రేప్స్ ను ప్రయత్నించండి

చిట్కా#3 మీకు రిప్డ్ ప్యాంట్లు నచ్చితే, ఫుల్ బ్లోన్ హోల్స్ బదులు ష్రెడ్స్ మరియు స్క్రేప్స్ ను ప్రయత్నించండి

ఫిబ్రవరిలో ఫుల్ బ్లోన్ హోల్స్ మిమ్మల్ని చలితో చంపేస్తాయి ( అనుకోకుండా ఎండగా ఉండి, వెచ్చగా ఉంటే తప్ప) . అందుకని మీకు రిప్డ్ ప్యాంట్లు నచ్చితే, ష్రెడెడ్ మరియు స్క్రేప్డ్ వెరైటీలను ఈ నెలకి ఎంచుకోండి. ఇదిగో దీపిక ఈ చిత్రంలో వేసుకున్నట్లు ప్రయత్నించండి.

మీ ఇన్నర్ ప్యాంట్ క్రేజీతనాన్ని ఇంకాస్త ఎండగా ఉన్నప్పుడు ప్రయత్నించండి.

చిట్కా #4 కాంతివంతమైన రంగులను ఎక్కువగా వేసుకోండి

చిట్కా #4 కాంతివంతమైన రంగులను ఎక్కువగా వేసుకోండి

ఇంకా అప్పుడే వసంతకాలం రాకపోవచ్చు, కానీ మెల్లగా పగలు సమయం ఎక్కువయి, రాత్రి తక్కువయిపోతూ, వాతావరణం కూడా వెచ్చగా మారిపోతోంది.(మొత్తంగా కాదనుకోండి)

అందుకని, మీరు మారుతున్న వాతావరణంలోని వసంతాన్ని ఆనందంగా ఎంజాయ్ చేయటానికి, ఎక్కువగా పేస్టెల్ రంగులు మరియు కాంతివంతంగా ఉండే బట్టలను ఫిబ్రవరిలో వేసుకోండి. ఇదిగో సిదార్థ్ మల్హోత్రా వేసుకున్న బ్లేజర్ లాంటిది ప్రయత్నించండి.

చిట్కా #5 మొత్తంగా సంప్రదాయ దుస్తుల్లో తయారవ్వండి

చిట్కా #5 మొత్తంగా సంప్రదాయ దుస్తుల్లో తయారవ్వండి

జనవరి చివర్లో మరియు ఫిబ్రవరి మొత్తం పెళ్ళిళ్ల సీజన్ ఉండటానికి ఒక కారణం ఉంది – టన్ను బరువుండే నగలను మోస్తూ, ఈ వాతావరణంలో అటూ ఇటూ తిరగటం సులభంగా ఉంటుంది. అందుకే సంప్రదాయ బట్టలను వేసుకోటం ఈ కాలానికి చాలా బావుంటుంది, చీరలు, సల్వార్ కమీజ్ లు మరియు కుర్తీలు ఇవన్నీ తేలికగా ఉండి, చెమటతో నిండిపోవు.

చిట్కా#6 వాలెంటైన్ వారానికి తయారవ్వండి!

చిట్కా#6 వాలెంటైన్ వారానికి తయారవ్వండి!

ఫిబ్రవరి గురించి మాట్లాడుతూ వాలెంటైన్ దినోత్సవం గురించి మాట్లాడకుండా ఉండలేం ( మరియు ఆ రోజు ముందు వారం గురించి కూడా). అందుకని వాతావరణం ఇలా విచిత్రంగా ఉన్నప్పుడు, ఈ ప్రేమనిండిన నెలలో ఇలా తయారవ్వండి!

బయట చల్లగా ఉన్నప్పుడు, పొడవు డ్రస్ మరియు బిషప్ లేదా రాగ్లాన్ వంటి ఆడంబరమైన స్లీవ్స్, లేదా మూడు పీస్ ల సూట్ ( మీరు మగవారు అయితే) ధరించండి.

కాకపోతే, మీ లోపలి మనిషి మాట విని, పొట్టి స్కర్టులు మరియు టక్ చేసిన షర్టులు లేదా కళ్లకి ఇంపుగా కన్పించే వెయిస్ట్ కోట్ టీషర్ట్ పైన మరియు ప్యాంట్లతో వేసుకోండి ( మీరు అమ్మాయి అయితే).

ఈ ఆర్టికల్ షేర్ చేయండి!

మీరు ఏడాది పొడగూ అందంగా కన్పడాలనే మేము కోరుకుంటాం. అందుకని ఈ చిట్కాలను ప్రయత్నించి, ఫోటో తీసుకుని ఫేస్ బుక్ మరియు ఇన్స్ టాగ్రామ్ లో #februaryfashion అనే ట్యాగ్ తో పోస్ట్ చేయండి.

English summary

Top 6 February Fashion Tips for Transitioning From Winter to Spring

February is an awkward month when you feel cold and warm at the same time. However, your outfit does not have to be awkward. All you have to do is keep your outfits layered, light and long, and wear brighter colours.
Story first published:Tuesday, February 13, 2018, 15:35 [IST]
Desktop Bottom Promotion