Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఎత్నిక్ అవుట్ ఫిట్స్ లో అందంగాఒదిగిపోయిన హేమ మాలినీ మరియు తన కుమార్తె ఈషా డియోల్
ప్రముఖ నటి హేమ మాలినీ మరియు ఆమె కుమార్తె ఈషా డియోల్ సంజుక్తా దత్తా కోసం లాక్మే ఫ్యాషన్ వీక్ వింటర్ ఫెస్టివ్ 2018 లో రాంప్ వాక్ చేశారు. తల్లీకూతుళ్ళిద్దరూ ట్రెడిషనల్ అట్టైర్ లో కనువిందు చేశారు. ఇండియన్ టెక్స్టైల్ మరియు హ్యాండ్లూమ్ హెరిటేజ్ వైభవాన్ని చాటారు.

వైబ్రెంట్ ప్రింట్స్ తో మల్టీకలర్ సిల్క్ శారీలో హేమమాలినీ అందంగా ఒదిగిపోయారు. ఆమె ధరించిన నేవీ బ్లూ, రెడ్ మరియు బ్రైట్ ఎల్లో శారీ అనేది దక్షిణ భారతీయతను కళ్ళకు కట్టింది. శారీపై టెంపుల్ ప్రింట్స్ ముగ్ధ మనోహరంగా కనిపించాయి. హేమ మాలినీ ఎప్పటిలాగానే స్టన్నింగ్ గా కనిపించింది. చీరకు మ్యాచ్ అయ్యే విధంగా నగలను ధరించింది. సాంప్రదాయ ఆభరణాలతో పాటు స్టేట్మెంట్ నెక్లెస్ ను ధరించింది. పాపిట బిళ్ళను ధరించింది. ఎర్రటి బొట్టుతో అలాగే తగినంత మేకప్ తో లుక్ ను ఎలివేట్ చేసుకుంది.

మరోవైపు ఈషా తన స్టైల్ ను ఎలివేట్ చేసే అటైర్ తో రాంప్ వాక్ చేసింది. క్వార్ట్రర్ స్లీవ్డ్ పింక్ కలర్ బ్లౌజ్ ను ధరించి దానికి ప్రింటెడ్ బార్డర్ కలిగిన సిల్వర్ స్కర్ట్ ను మ్యాచ్ చేసింది. గుజరాతీ స్టయిల్ లో దుపట్టాను అలంకరించుకుంది. తన స్టయిల్ కు భారీ కమర్బంద్ ను జోడించింది. ఈషా తక్కువగా నగలను అలంకరించుకుంది. పాపిట బిళ్ళను అలంకరించుకుంది. ఎర్రటి బొట్టును ధరించింది. గజ్రా హెయిర్ స్టైల్ ను ధరించింది.

ఈ ఇద్దరూ తమ తమ స్టయిల్స్ తో రాంప్ వాక్ తో ప్రేక్షకులను అలరించారు. మరి, మీకే లుక్ నచ్చింది?




Click it and Unblock the Notifications