Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
గోల్డెన్ దుస్తులలో అబ్బురపరచేలా కనిపించిన జాక్వెలీన్ ఫెర్నాండెజ్
గోల్డెన్ దుస్తులలో అబ్బురపరచేలా కనిపించిన జాక్వెలీన్ ఫెర్నాండెజ్
బాలీవుడ్ ప్రముఖ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మళ్ళీ మళ్ళీ మనల్ని అలవాటుగా హుతాశయుల్ని చేస్తూనే ఉంది. చివరిసారి, అందమైన బహుళ వర్ణపు బాడీ-హగ్గింగ్ దుస్తులతో కనపడి అలరించింది; కానీ ఈ సారి మాత్రం ఆమె 'డ్ర్రోలిసియస్' వస్త్రధారణతో ఇంటర్నెట్ కు ఒక ఝలక్ ఇచ్చిందనే చెప్పవచ్చు.
ఈ 'రేస్ 3' స్టార్లెట్ మన హృదయాలను మిలియన్ రెట్లు వేగంగా స్పందించేలా చేస్తూ ఉంది, అద్దానికి వ్యతిరేకంగా నిలబడి ఇచ్చిన ఈ పోజు చూస్తే మతిపోని పురుషజాతి ఉంటుందా అని అనిపించేలా ఉన్న జాక్వెలిన్ ఒక సెన్సేషన్ అని వేరే చెప్పనవసరం లేదు. జాకీ మ్యూట్ బ్యాక్డ్రాప్లో, సిజ్లింగ్ గా కనిపిస్తూ అబ్బురపరుస్తూ ఉంది. ఆమె విభిన్నమైన వ్యక్తీకరణతో, ఆమె తన ప్రతి అంగుళంలో సెక్సీనెస్ మరియు సెడక్టివ్ ఉట్టిపడేలా కనిపిస్తూ ఉంది. ఈ భిన్నమైన పోజులో ఒక బెల్లీ డాన్సర్ లా కనిపిస్తూ ఉంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

ఈ పొడవు కాళ్ళ సుందరి ఈ సారి బంగారపు ఛాయ బిగుతైన దుస్తులను ధరించి, ఆమె సన్నని ఫ్రేమ్ కై ప్రాధాన్యత ఇచ్చేలా కనిపించాయి, ఈ ఉత్కృష్టమైన దుస్తులు బంగారు సెక్విన్స్ కలిగి, ఓరియంటల్-ప్రేరేపిత ఎంబ్రాయిడరీని కలిగి హైలైట్ గా నిలిచాయి. తద్వారా ఆమె స్ఫగెట్టి-స్ట్రాప్డ్ దుస్తులలో హాట్నెస్ లెవల్స్ పెంచేలా కనిపించింది.
ఈ అలంకరణలో చెప్పుకోదగ్గ మరొక అంశం, ఖచ్చితంగా శాండల్స్ అనే చెప్పవచ్చు. ఎరుపు రంగులో పూర్తిగా ముంచి లేపిన అనుభూతిని కలిగించే శాండల్స్, ఎంతో అందంగా అలంకరించబడి చూపరుల కళ్ళను తెలివితో తన కాళ్ళవైపు తిప్పుకునేలా కనిపిస్తూ ఉంది. జుట్టును వదులుగా జారవిడిచి, సగభాగం చెంపల మీదనుండి భుజాలమీదుగా జాలువారే అలల వంటి లుక్ ఇస్తూ అన్నిటా ప్రత్యేకతను చాటుకుంది. ఇక మేకప్ విషయానికి వస్తే, తక్కువ న్యూడ్ లుక్ మేకప్ ను ఆశ్రయించి, లిప్ గ్లాస్ తో ముగించింది.
మాకైతే, తన నూతనమైన ఫాషన్ పోకడలతో, పోజులతో జాకీ మా మతులు పోగొట్టింది. ఈ పోజు ముందు బంగారం కూడా వెలవెలబోయేలా కనిపించింది. మరి జాక్వేలిన్ పై మీ అభిప్రాయం ఏమిటి? జాకీ డ్రెస్, పోజ్ మీకెలా అనిపించింది? మీ అభిప్రాయాలను వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి. మరిన్ని ఫాషన్ మరియు లైఫ్స్టైల్ సంబంధిత వివరాలకై బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శిస్తూ ఉండండి.



Click it and Unblock the Notifications