Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
పంజాబీ సంప్రదాయ వస్త్రధారణలో 'ధడక్' ప్రచార కార్యక్రమంలో మెరిసిన జాన్వీ, ఈషాన్!
పంజాబీ సంప్రదాయ వస్త్రధారణలో ఛండీఘర్ లో నిర్వహించిన'ధడక్' ప్రచార కార్యక్రమంలో మెరిసిన జాన్వీ, ఈషాన్!
జాన్వీ కపూర్ మరియు ఇషాన్ ఖట్టర్, మరో రెండు రోజులలో విడుదల కాబోయే తమ తొలి చిత్రం 'ధడక్' ప్రమోషన్ పనులలో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఇటీవలే, ఈ చలన చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా వారు చండీగఢ్ వెళ్లారు. వాళ్ళను పంజాబీ అవతారాలలో చూసిన అభిమానుల ఆశ్చర్యానందాలకు అవధులు లేవు.
ఇద్దరు వారి వారి దుస్తులలో అందంగా మెరిసిపోయారు. ఇషాన్ చాలా సాధారణంగా తయారవగా, జాన్వీ మాత్రం అధునాతన ఫ్యాషన్ ను ప్రతిబింబించే విధంగా ఉండే దుస్తులతో అభిమానులను మెప్పించాలని భావించారు. ఆమె చూపుతిప్పుకోలేనంత అందంగా కనిపించినప్పటికిని, తన ప్రయత్నం పూర్తిగా సఫలీకృతం కాలేదు.

ఇషాన్ సాధారణమైన తెల్లని కాటన్ కుర్తాకు జతగా డెనిమ్ జీన్స్ మరియు గోధుమ రంగులో ఉన్న బూట్లు ధరించారు. అతని వస్త్రధారణ తన తరం వారికి స్ఫూర్తినిచ్చే విధంగా ఉంది. మరోవైపు జాన్వీ, రితికా మిర్చందాని రూపకల్పన చేసిన చండీగఢ్ శైలిని ప్రతిబింబించే దుస్తులు ధరించింది. ఆమె లేత ఊదా రంగులో ఉన్న నూడిల్-స్ట్రాప్డ్ షార్ట్ కుర్తి ధరించింది.

జాన్వీ కపూర్ ఫ్యాషన్:
ఆమె ధరించి కుర్తి, విశిష్టమైన అద్దాల సొగసులను కలిగి ఉంది. దానికి జతగా, లిలాక్ రంగు పాటియాలా సల్వార్ వేసుకుంది. ఆమె మినరాలి ఎండ్ సిల్వర్ స్ట్రీక్ వారి ఆక్సిడైజ్డ్ చెవిపోగులు మరియు గాజులతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె తేలికైన మేకప్ లో పరిపూర్ణతకు మారుపేరులా అనిపించింది. అయితే, ఆమెపాపిడి తీసుకుని వేసుకున్న రెండు జడలు ఆమెకు అంతగా నప్పలేదు.
సరే కానీ, జాన్వీ మరియు ఇషాన్ చేసిన ఫ్యాషన్ ప్రయోగాలు మీకెలా అనిపించాయి. వారి వస్త్రధారణ శైలిని గురించి మీ అభిప్రాయం ఏమిటి? మీ అభిప్రాయాలను కామెంట్స్ విభాగం ద్వారా మాకు తెలియజేయండి.



Click it and Unblock the Notifications