Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఎయిర్ పోర్టులో స్పోర్టీ లుక్ తో కనిపించిన జాన్వీ, ఖుషీ
ఎయిర్ పోర్టులో స్పోర్టీ లుక్ తో కనిపించిన జాన్వీ, ఖుషీ
ట్రాక్ ప్యాంట్స్ స్టైల్ తో ఈ ప్రసిద్ధ కపూర్ కుటుంబం, సరికొత్త ట్రెండ్ దిశగా నడుస్తున్నట్టు కనిపిస్తోంది. కీ.శే.శ్రీదేవి భర్త బోనీ కపూర్ మరియు కుమార్తెలైన జాన్వీ మరియు ఖుషి ట్రాక్ సూట్లలో విమానాశ్రయం నుండి బయటకు వచ్చారు. అయినప్పటికీ, తండ్రి-కుమార్తెల త్రయం వారి అథ్లెజర్ దుస్తులకు కాస్త గ్లామర్ జోడించి, మనకు ఎయిర్పోర్ట్ ఫ్యాషన్ దృష్ట్యా సరికొత్త బ్రాండ్ ఆలోచన ఇచ్చే దిశగా కనిపించారు. ఇది సరికొత్త ఆలోచన మాత్రమే కాదు, ప్రయాణిస్తున్నప్పుడు ఈ ట్రాక్ పాంట్స్ దుస్తులు మనకు అత్యంత సౌకర్యవంతమైన దుస్తులుగా కూడా ఉండగలవు.
ఇక్కడ, జాన్వీ తనకు సరిగ్గా నప్పేలా మరియు సౌకర్యవంతంగా ఉన్న సాధారణ బేబీ పింక్ ట్రాక్ సూట్ ధరించింది. మరియు ఈ దుస్తులు చేతులను, మెడను పూర్తిగా కప్పినట్లు ఉండే ఫుల్లీ స్లీవ్డ్ హై-నెక్ డిజైన్ తో, స్ట్రక్చర్డ్ పైజామాతో అధ్బుతంగా ఉన్నాయి. వదులుగా భుజాల మీద అలలుగా జాలువారుతున్న జుట్టుని కలిగి, నీలం మరియు గోధుమ రంగు కలయికలోని హాండ్-బాగ్ తో దర్శనమిచ్చింది. ట్రాక్ సూట్లో జాన్వీ అభిమానుల కళ్ళను తనవైపుకి తిప్పుకునేలా చేయగలిగింది.

మరోవైపు, ఖుషి మరింత నాగరిక జోడించిన అవతారంతో తన సోదరికి పూర్తి భిన్నంగా కనిపించింది. ఆమె ఒక తెల్లని టాప్ ధరించి, తెల్ల చారలు కలిగిన ఎరుపు రంగు పైజమాతో కనిపించింది. అయితే, ఆమె ధరించిన ఎరుపు రంగు గ్రాఫిక్ డిజైన్డ్ జాకెట్ మనందరి దృష్టిని ఆకర్షించింది అనడంలో ఆశ్చర్యమే లేదు. మరియు వదులుగా జారవిడిచిన జుట్టుతో, నల్లని రంగు షేడ్స్ కలిగిన బాక్స్ స్టైల్ బ్యాగ్ చేతిలో పట్టుకుని హుందాగా కనిపించింది.

ఇక వారి తండ్రి బోనీకపూర్, ఆల్ బ్లూ ట్రాక్ సూట్ ధరించాడు. ఈ దుస్తులలో విమానాశ్రయం నుండి వస్తున్న వీరు ఒక హాపీ ఫామిలీ వలె కనిపించారు.

వారి ఎయిర్ పోర్ట్ ఫ్యాషన్ ఒక అద్భుతమైన ఆలోచనగా అనిపించింది. ఏది ఏమైనా, శ్రీదేవి మరణం అనే వార్త నుండి పిల్లలను బయట వేయడానికి బోనీకపూర్ పడుతున్న కష్టం, అందరికీ ఒక ఆదర్శ తండ్రి ఎలా ఉండాలో అన్న ఆలోచనను ఇస్తుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.



Click it and Unblock the Notifications