Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
గార్జియస్ గులాబీ రంగు దుస్తులలో అభిమానులకు వినూత్నంగా జూహీ చావ్లా
గార్జియస్ గులాబీ రంగు దుస్తులలో అభిమానులకు వినూత్నంగా జూహీ చావ్లా
గార్జియస్ గులాబీ రంగు దుస్తులలో అభిమానులకు వినూత్నంగా ఈద్-ముబారక్ గ్రీటింగ్స్ చెప్పిన జూహీ చావ్లా
బాలీవుడ్ ప్రపంచంలో విలక్షణ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జుహీ చావ్లా, 'గులాబ్ గ్యాంగ్' సినిమాలో ప్రతి నాయిక పాత్రను సైతం పోషించి విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. ఒక రాజకీయ నాయకురాలిగా, ప్రతి నాయికగా జూహీ తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించి తనలో సరికొత్త కోణాన్ని బాలీవుడ్ ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ సినిమాలో గులాబీ రంగు దుస్తులు ధరించిందో లేదో కానీ, నిజ జీవితంలో గులాబీ రంగుకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంటుంది జూహీ. ఎక్కువగా ఫార్మల్ శారీలో కనిపిoచే జూహీ, పెళ్లి కార్యక్రమం లేదా స్నేహితులతో ఫంక్షన్స్ వంటి ఎటువంటి కార్యక్రమాలలోనైనా గులాబీ రంగు దుస్తులనే ధరించడానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంటుంది. ఈద్-ఉల్-ఫితర్ పవిత్రమైన పండుగ సందర్భంగా, జుహీ చావ్లా మరలా గులాబీ రంగు అనార్కలీ దుస్తులను ధరించి ఒక మిలియన్ డాలర్ బేబీలా కనిపించింది.

తన ఫాలోవర్స్ కు పండుగ శుభాకాంక్షలను తెలిపే క్రమంలో ఇన్స్టాగ్రామ్ ను వేదికగా చేసుకున్న జూహీ, తన పోస్టుకు కాంప్లిమెంట్ గా తన ఫోటోను కూడా జోడించింది. ఈ ఫోటోలో తేలికపాటి పింక్ షేడ్ రంగు బోట్ నెక్ మరియు చేతులను పూర్తిగా కప్పినటువంటి ఫుల్లీ స్లీవ్డ్ డిజైన్ కలిగిన అనార్కలి దుస్తులకు తెల్లటి పూల ఎంబ్రాయిడరీ అదనంగా జోడించబడి ఎంతో అద్భుతంగా కనిపించింది జూహీ.
ముఖ్యంగా ఈ గులాబీ రంగు కుర్తీలో క్రీమీ రంగు పూల ఎంబ్రాయిడరీతో అలంకరించిన ప్రింటెడ్ బార్డర్, దుస్తులకే ప్రత్యేకమైన కళను తీసుకుని వచ్చింది అని చెప్పవచ్చు. పండుగ వాతావరణం మొత్తం తనలోనే కనిపించేలా కనిపించిన జూహీ, అందరి మన్ననలనూ అందుకుంది. మరియు అనార్కలీ దుస్తులకు జతగా ఉన్న గులాబీ రంగు దుప్పటా దుస్తులకు ప్రత్యేకంగా నాటకీయతను జోడించినట్లుగా కనిపిస్తుంది. కానీ దుప్పటాకి కూడా ఫ్లోరల్ టచ్ ఇచ్చి ఉంటే దుస్తులు మరింత అందంగా కనిపించేదని కొందరు నెటిజన్ల అభిప్రాయం.

అయితే, ఆమె ధరించిన లేయర్డ్ ముత్యాల హారము దుస్తులకు సరిగ్గా నప్పేలా ఉంది. మహిళా అభిమానుల దృష్టిని మరల్చనీయకుండా చేసింది అనడంలో ఆశ్చర్యం లేదు. వీటికి తోడుగా హారానికి తీసిపోని విధంగా, ఉంగరం, చెవి రింగులు కూడా అదనపు ఆకర్షణను జోడించినట్లు దుస్తులకు అద్భుతంగా సరిపోయాయి.
జూహీచావ్లా, ఈద్-ఉల్ –ఫితర్ శుభాకాంక్షల ఐడియా బాగుంది కదా. ఈ గులాబి రంగు అనార్కలిలో జూహీ చావ్లా మీకేలా అనిపించింది. మీ అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి. ఇటువంటి అనేక ఆసక్తికర మరియు ఫాషన్ సంబంధిత అంశాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి.



Click it and Unblock the Notifications