Latest Updates
-
క్యాల్షియం, ప్రొటీన్ల ఖజానా..ఎముకలకి ఉక్కులాంటి బలాన్నిచ్చే రాగి కిచిడీ -
ఎయిర్ పోర్ట్ డివోర్స్ అంటే ఏంటి?.. జంటలను ఆకర్షిస్తున్న కొత్త ట్రెండ్! -
వర్షాకాలంలో ఈ చిన్న పని చేస్తే..ఏ రోగాలు మీ దరిచేరవు! -
పంజాబీ ఫేమస్ చిక్కడ్ చోలే.. పూరీ, కుల్చాకి ఇది పర్ఫెక్ట్ మ్యాచ్! -
ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు, కట్టల కొద్దీ కరెన్సీ? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు! -
ఇలాంటి స్త్రీ ఎంతటి కష్టంలోనూ మిమ్మల్ని విడిచిపెట్టదు! -
ఈ స్పెషల్ బెండకాయ రోస్ట్ ముందు నాన్ వెజ్ ఫ్రైలు కూడా పనికిరావు..ట్రై చేసి చూడండి! -
డీప్ ఫ్రై లేకుండానే KFC స్టైల్ పాప్ కార్న్ చికెన్.. మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
మీ బ్రెయిన్ పవర్ పెరగాలా? ఎయిమ్స్ డాక్టర్ చెప్పిన ఈ సీక్రెట్స్ మీకోసమే! -
జూలై 3న నక్షత్ర మార్పు.. ఈ రాశుల వారికి ఆర్థికంగా తిరుగేలేదు!
లాక్మే ఫ్యాషన్ వీక్ 2018 లో ఇరిడిసెంట్ గవున్ లో ముగ్ధమనోహరంగా మెరిసిన కరీనా కపూర్
లాక్మే ఫ్యాషన్ వీక్ 2018 లో ఇరిడిసెంట్ గవున్ లో ముగ్ధమనోహరంగా మెరిసిన కరీనా కపూర్
ప్రముఖ డిజైనర్ మోనిషా జైసింగ్ తన లేటెస్ట్ కలక్షన్స్ ను ప్రదర్శించింది. "షేడ్స్ ఆఫ్ దివా" పేరిట ప్రదర్శితమైన ఈ కలక్షన్ లక్జరీ, సెన్సుయాలిటీ తో పాటు వివిధ మూడ్స్ ను రిఫ్లెక్ట్ చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మరి ఈ కలక్షన్ కు కరీనా కపూర్ కంటే మెరుగైన షో స్టాపర్ ని మీరూహించగలరా? ఊహించలేము. రాంప్ పై తన హొయలుతో పాటు కరీనా ఈ కలక్షన్ ను ప్రదర్శించింది. ఆమె అట్టైర్ లో వివిధ మూడ్స్ మరియు షేడ్స్ కనిపిస్తాయి.
కరీనా అట్టైర్ గ్లామర్ ని పెంచడంతో పాటు ఆమె అందాన్ని మరింత ఎలివేట్ చేసింది. సాయంకాల సమయంలో పార్టీస్ కి ఈ అట్టైర్ అద్భుతంగా సూట్ అవుతుంది. ఈ అవుట్ ఫిట్ ను క్యారీ చేయడం అంత సులభం కాదు. కానీ, బాలీవుడ్ హీరోయిన్ కరీనా ఈ అట్టైర్ ను ఎంతో కాన్ఫిడెంట్ గా క్యారీ చేసి విజయం సాధించింది. కరీనా ధరించడంతో ఈ అట్టైర్ యొక్క అందం మరింత ఎలివేట్ అయిందని చెప్పడంలో సందేహం లేదు.

ఆఫ్ షోల్డర్ మరియు డీప్ నెక్డ్ గవున్ పై కట్టబడిన ఓవర్లాపింగ్ బ్లౌజ్ అలాగే సైడ్ స్లిట్స్ ఆమెలోని గ్లామర్ క్వీన్ ని తట్టిలేపాయి. అలల్లా ఎగిసిపడుతున్న కరీనా స్కర్టు అనేది ఆమె బ్లౌజ్ కి అటాచ్ అయి ఉంది. స్లీక్ ప్లీట్స్ తో పాటు అసిమెట్రికల్ హెమ్ లైన్ స్కర్ట్ ని హైలైట్ చేశాయి. ఆమె గవున్ ఖచ్చితంగా ప్రత్యేకమైనది.

ఇరిడిసెంట్ గ్రీన్ మరియు పర్పుల్ కలర్స్ లో ఆమె అటైర్ కి అదనపు హంగు అద్దబడింది. ఇది ఖచ్చితంగా ఆప్టికల్ ఇల్యూజన్ అట్టైర్ కోవలోకే వస్తుంది. డిఫెరెంట్ లైటింగ్ తో కలర్ వేరియేషన్స్ ను గమనించవచ్చు. ఈ గవున్ పై దర్శనమిచ్చే కొన్ని డీటెయిల్స్ అనేవి అట్టైర్ ని ఆసక్తికరంగా మలిచాయి అనడంలో సందేహం లేదు.

ఇక కరీనా మేకప్ విషయానికి వస్తే పర్పుల్ ఐ షాడో తో ఆలాగే సైడ్ పార్టెడ్ వేవీ ట్రెసెస్ తో కరీనా మెరిసిపోయింది.

ఇకపోతే, కరీనా కపూర్ లాక్మే ఫ్యాషన్ వీక్ 2018 లో తన స్టయిల్ పెర్ఫార్మెన్స్ ను ఇచ్చింది. ఆమె అందాన్ని చూస్తూ చూపు తిప్పుకోవడం కష్టం. ఫ్యాషన్ వీక్ కి సంబంధించిన ఇంటరెస్టింగ్ అప్డేట్స్ లో ఇది ముఖ్యమైనది. మీకు కూడా కరీనా డ్రెస్ నచ్చిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి.




Click it and Unblock the Notifications