Latest Updates
-
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే!
న్యూ ఇయర్ పార్టీకి వెళ్తున్నారా.. ఇలా డ్రెస్ చేశారంటే అదిరిపోవాల్సిందే
న్యూ ఇయర్ పార్టీలో ట్రెండీగా కనిపిస్తూనే కంఫర్ట్‌గా ఉండేలా ఇక్కడ కొన్ని ఔట్‌ఫిట్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్త సంవత్సరాన్ని కొత్త జోష్‌తో ఆహ్వానించేందుకు సర్వం సిద్ధమైపోయింది. న్యూ ఇయర్ పార్టీలో టొటల్లీ న్యూ లుక్‌తో పిచ్చెక్కించేందుకు కుర్రకారు కూడా ఎదురుచూస్తోంది. న్యూ ఇయర్ పార్టీలో ట్రెండీగా కనిపించాలని యువతులు ఉత్సాహం చూపిస్తుంటారు. నైట్ పార్టీలో అందంగా కనిపించడంతో పాటు ట్రెండీగానూ ఉండాలి, అదే సమయంలో కంఫర్ట్‌గా కూడా ఫీల్ అవ్వాలి. స్టైల్ ఉండి కంఫర్డ్ లేకపోతే దానిని క్యారీ చేయలేం. కంఫర్ట్ ఉండి స్టైలిష్‌గా కనిపించకపోతే పార్టీ మూడ్ రాదు.

న్యూ ఇయర్ పార్టీలో ట్రెండీగా కనిపిస్తూనే కంఫర్ట్‌గా ఉండేలా ఇక్కడ కొన్ని ఔట్‌ఫిట్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఎవర్'గ్రీన్'
గ్రీన్ ఎవర్‌గ్రీన్ కలర్. గ్రీన్ కలర్‌లోని నైస్ పార్టీ వేర్ ఎంచుకుంటే సగం డ్రెస్సింగ్ అయిపోయినట్లే. పఫ్డ్ స్లీవ్స్, నెక్‌లైన్ గ్రీన్ టీ ఎంచుకోండి. మంచి ఎమరాల్డ్ గ్రీన్ టాప్‌కు బ్లాక్ లేదా వైట్ జీన్స్ మ్యాచ్ చేయవచ్చు. ఈ ఔట్‌ఫిట్ ఎవర్‌గ్రీన్ అందాన్ని అందిస్తుంది. ఎంతమందిలో ఉన్న ప్రత్యేకంగా ఉండాలంటే గో విత్ గ్రీన్. మ్యాచింగ్ నెక్‌పీస్, ఇయర్ రింగ్స్ మర్చిపోవద్దు. మినిమల్ యాక్ససెరీస్‌తో క్యారీ చేసేయవచ్చు. లైట్‌గా మేకప్ వేసుకున్నా మెరిసిపోతారంతే.
2. సీక్విన్డ్ షిమ్మర్
న్యూ ఇయర్ ఈవ్ పార్టీలో సీక్విన్డ్ షిమ్మర ధరించే అందరి కళ్లన్నీ మీపైనే ఉంటాయి. జాక్స్టాపోజిషన్ రిఫ్డ్ బ్లాక్ జీన్స్, సిల్వర్ బీడెడ్ చెప్పులతో జత చేస్తే అల్ట్రా-ఫెమినైన్ వైన్ సీక్విన్ షిమ్మర్ టాప్ అదిరిపోతుంది. సీక్విన్డ్ షిమ్మర్ పైకి వైట్ కలర్ జాకెట్ వేసుకుంటే స్టైల్ క్రేజీగా ఉంటుంది.
మ్యాచింగ్ జ్యూవెలరీతో పాటు స్లింగ్ బ్యాగ్ మంచి స్టైలిష్ లుక్‌ను తీసుకువస్తాయి. న్యూ ఇయర్ పార్టీలో అందంగా కనిపించొచ్చు.
౩. వన్ షోల్డర్ జంప్‌సూట్
శాటిన్ ఫ్యాబ్రిక్‌తో చేసిన జంప్‌సూట్ మంచి పార్టీ లుక్‌ను ఇస్తుంది. వన్ షోల్డర్ జంప్‌సూట్ ధరించి పార్టీకి హాజరయ్యారంటే క్రేజీగా అదిరిపోతుంది. ఈ వన్ షోల్డర్ జంప్‌సూట్ ఎలాంటి శరీరాకృతి వారికైనా ఎంతో అందంగా కనిపిస్తుంది. హై హీల్స్, బూట్స్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్‌తో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. మినిమల్ మేకప్‌తోనూ ఈ డ్రెస్ క్యారీ చేయవచ్చు.
4. LBD - లిటిల్ బ్లాక్ డ్రెస్
బ్లాక్ కలర్ ఎప్పటికీ వన్నె తగ్గని ఫ్యాషన్ కలర్. శాటిన్- ఫినిష్డ్ బ్లాక్ ప్యాంట్‌లు, బ్లాక్ కలర్ బ్లేజర్, బ్లాక్ సూట్‌లు, బ్లాక్ పార్టీ గౌనులు ఇవి న్యూ ఇయర్ పార్టీకి సరిగ్గా సరిపోయే డ్రెస్సులు.
5. ఇండో వెస్ట్రన్
ఇండో వెస్ట్రన్ చక్కని నైట్ పార్టీ ఔట్‌ఫిట్స్. నెక్‌లైన్‌లు, స్లీవ్‌లతో ఇవెంతో అందంగా, సౌకర్యంగా ఉంటాయి. వీటికి బ్లూ లేదా బ్లాక్ జీన్స్ మ్యాచింగ్‌లా బాగుంటాయి. హై-హీల్ చెప్పులను ఈ ఔట్‌ఫిట్‌కు జతచేయవచ్చు. సిల్కీ హెయిర్‌కి సిల్క్ స్కార్ఫ్‌ని జోడించవచ్చు. చిన్న బిందీతో ఈ రూపాన్ని మరింత అందంగా మార్చవచ్చు. రెడ్, బ్లాక్, వయోలెట్ కలర్స్ న్యూ ఇయర్ పార్టీకి బాగుంటాయి.



Click it and Unblock the Notifications











