Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వోగ్ బ్యూటీ అవార్డ్స్ -2018 ఫంక్షన్లో, రెడ్ గౌన్స్ లో అలరించిన కత్రినా కైఫ్, దియా మీర్జా
వోగ్ బ్యూటీ అవార్డ్స్ -2018 ఫంక్షన్లో, రెడ్ గౌన్స్ లో అలరించిన కత్రినా కైఫ్, దియా మీర్జా
ఓమైగాడ్, ప్రెట్టీ అంటే అర్ధం ఇదా? అని అనిపించేలా, కత్రినాకైఫ్ మరియు దియామీర్జాలు రెడ్ గౌన్ ధరించి వోగ్ బ్యూటీ అవార్డ్స్–2018 లో ఒకరి అందంతో మరొకరు పోటీపడుతున్నట్లుగా కనిపించి ప్రేక్షకులకు కన్నులవిందు చేశారు. ఇద్దరూ ఇంచుమించు ఒకేలా ఉన్న దుస్తులు ధరించి, కూల్ ఫంక్షన్లో , హాట్ లుక్స్ తో హీట్ పెంచేలా కనిపించారు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి డ్రెస్సింగ్ విధానంలో తేడాలు వెతకడం, ఇప్పుడు నెటిజన్ల ఆటగా మారింది.
ఇక్కడ కత్రినాకైఫ్ ఈ అవార్డ్ ఫంక్షన్లో, స్కార్లెట్ ఓంగ్-ఓజ్ పైరం రోబ్ గౌన్ ధరించి, చూపరుల తలను తనవైపు తిప్పుకునేలా చేయడంలో సఫలీకృతమైంది. ఈ దుస్తులు డీప్-నెక్ ఫుల్లీ స్లీవ్డ్ షర్ట్ బ్లౌజ్ కలిగి కత్రినాకు పరిపూర్ణమైన లుక్ ఇచ్చేలా కనిపించాయి. ఇక స్కర్ట్ విషయానికి వస్తే, కాళ్ళ వద్ద చీలికని కలిగి షాకింగ్ లుక్ తో అబ్బురపరచేలా కనిపించింది. ముఖ్యంగా ఈ డ్రెస్ డీప్-నెక్ లుక్ కలిగి ఉండడం మరొక ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. డ్రెస్ తగినట్లు, సిల్వర్ కలర్ పెన్సిల్ హీల్ చెప్పల్స్, సొగసైన హూప్ చెవిరింగులు, మరియు చేతి వేళ్ళకి స్టేట్మెంట్ రింగ్ ధరించి సూపర్బ్ అనిపించేలా కనిపించింది.

ఇక మేకప్ విషయానికి వస్తే, “కాట్” టీం, కత్రినాకి, న్యూడ్ లుక్ టచ్ ఇచ్చి, స్మోకీ ఐస్ మరియు బుజాలు మీద జాలువారేలా సైడ్-పార్టెడ్ హెయిర్ లుక్ తో ముగించగా, కత్రినా తన రూపానికి జస్టిఫికేషన్ ఇచ్చినట్లు ఫిట్స్పిరేషన్ ఆఫ్ ది యియర్ అవార్డ్ కైవసం చేసుకుంది.
దియామీర్జా కత్రినాకి ఏ మాత్రం తీసిపోని విధంగా ఓమైగాడ్ రావిషింగ్ లుక్ ఇచ్చింది. క్రమంగా కత్రినాతో సమానంగా బోల్డ్ లుక్ ఇచ్చి, ఫుల్ పాయింట్స్ కొట్టేసింది. ఫేమస్ డ్రెస్ డిజైనర్ నిఖిల్ థంపి రూపొందించిన ఈ రెడ్ గౌన్ V-నెక్ షేప్ కలిగి, దియా శరీరాకృతికి సరిగ్గా నప్పేలా కనిపించింది. వీరిరువురి దుస్తులు ఇంచుమించు ఒకేలా ఉండడం ద్వారా పెద్దగా మార్పులు కనపడకపోయినా, దియా వేసుకున్న స్కర్ట్ ఫ్లోర్ లెంగ్త్ మరియు డీప్ సైడ్ స్లిట్ కలిగి అద్భుతంగా కనిపించి కొంతమేర మార్పుకనిపించేలా చేసింది.

దియామీర్జా స్టైల్:
కత్రినాకు కొంచం భిన్నంగా, గోల్డెన్ కలర్ పెన్సిల్ హీల్ చెప్పల్స్ మరియు వేలాడే చెవిరింగులను ధరించి, జుట్టును వెనుకకు వదిలి, స్మోకీ ఐస్ కూడిన “డ్యూవీ మేకప్”తో ముగించింది.

ఇద్దరి లుక్స్ సమానంగా, ప్రెట్టీగా కనిపించాయి కదూ?
మావరకు ఇద్దరూ అద్భుతంగా కనిపించారు, ఇక మీ ఓటు ఎవరికి వేస్తారు? క్రింది వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.





Click it and Unblock the Notifications