Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
ప్రియాంక చోప్రా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్న ఈ స్టయిల్ స్టేట్మెంట్ ను గమనించారా?
నిక్ జోనస్ తో కలిసి మెలిసి తిరగడంతో పాటు ప్రియాంకా మరొక్క విషయాన్ని కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తోంది. అదేంటో తెలుసా? ప్రయాణాలు ఎక్కువగా చేస్తోందని మీరు సమాధానమిస్తే మీ సమాధానం తప్పు.
నిక్ జోనస్ తో కలిసి మెలిసి తిరగడంతో పాటు ప్రియాంకా మరొక్క విషయాన్ని కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తోంది. అదేంటో తెలుసా? ప్రయాణాలు ఎక్కువగా చేస్తోందని మీరు సమాధానమిస్తే మీ సమాధానం తప్పు. ఒకవేళ ఒకే రకమైన బట్టలు మళ్ళీ మళ్ళీ వేస్తోందని మీరు గెస్ చేసినా మీరు పప్పులో కాలేసినట్టే.

ప్రియాంకా అసలేం రిపీట్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక యాక్ససరీని ప్రియాంకా తెగ రిపీట్ చేసేస్తోంది. అవునండి మిస్ ప్రియాంకా చోప్రా క్యాట్ ఐ ఫ్రేమ్స్ ని తరచూ రిపీట్ చేస్తోంది. ఈ ఫ్రేమ్స్ ని మళ్ళీ మళ్ళీ ప్రియాంకా ఎందుకు రిపీట్ చేస్తుందో మనకి ఆశ్చర్యంగా ఉంది కదా?
ఎందుకంటే, ఇవి ప్రియాంకా స్టైల్ ని మరింత పెంపొందిస్తున్నాయి. అందుకే, ఇవి ప్రియాంకాకి మోస్ట్ ఫేవరేట్ స్టైలిష్ యాక్ససరీగా మారిపోయాయి.

1. గుడ్ లాక్ ఛార్మ్
ఆమె స్టైలిస్ట్ నుంచి లేదా ఆమె అభిమానుల నుండి ఆమెకు ఈ విషయంలో సలహా అంది ఉండవచ్చు. లేదంటే ఆమెకు మరింత ప్రత్యేకమైన వ్యక్తి నుంచి ఈ స్టైలిష్ యాక్ససరీ గురించి ఆమెకు అమూల్యమైన సలహా అంది ఉండవచ్చు. లేదంటే, ఆమెకు గుడ్ లాక్ ఛార్మ్ అయి కూడా ఉండవచ్చు. లేదా ఆమె ఈ లుక్ తో రాబోయే ఒక మూవీలో దర్శనం ఇవ్వడానికి సిద్ధంగా ఉండవచ్చు. ఎవరికి తెలుసు అసలీ స్టైలిష్ యాక్ససరీ వెనుక దాగున్న విషయం గురించి?
అయితే, మనకు తెలిసిన విషయం ప్రకారం ప్రియాంకా తన స్టైల్ స్టేట్మెంట్ ద్వారా ఈ క్యాట్ ఐడ్ ఫ్రేమ్స్ కి తెగ పబ్లిసిటీ ఇస్తోంది. నిజానికి, ప్రియాంకా ధరించడం వలన ఈ ఫ్రేమ్స్ కి మరింత పబ్లిసిటీ లభించిందని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ప్రియాంకా వద్ద వీటి కలక్షన్ బాగానే ఉండుంటుంది.

2. పింక్ కలర్ లో
కొన్ని సార్లు ప్రియాంకా ధరించిన ఈ ఫ్రేమ్స్ పింక్ కలర్ లో చిన్నగా ఉండగా, మరికొన్ని సార్లు ప్రియాంకా పెద్దవైన ప్రింటెడ్ ఫ్రేమ్స్ ని ధరించింది. ఇంకొన్ని సార్లు వైట్ మరియు పాయింటెడ్ వి ధరించింది.
కలరేదైనా లేదా సైజ్ ఏదైనా ప్రియాంకా ఈ టైప్ ఆఫ్ ఫ్రేమ్స్ ని తరచూ వాడుతోంది. ఈ ఫ్రేమ్ స్టైల్ లో మాత్రం మార్పు లేదు. ప్రియాంకా ఫ్రేమ్ స్టైల్ మనకు నచ్చింది కదా. అయినా, ఈ టైప్ ఫ్రేమ్స్ నే అమ్మడు ఎందుకు ధరిస్తుందో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ మాత్రం ఆమె అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

3. 70 ల సమయంలోనే
ఈ ఫ్రేమ్స్ ఇప్పుడు కొత్తగా మార్కెట్ లో కి వచ్చినవి మాత్రం కాదు. నిజానికి, ఈ ఫ్రేమ్స్ అనేవి 70 ల సమయంలోనే సందడి చేసాయి.
ప్రియాంకా లుక్ ను మనం ఇష్టపడుతున్నా ఈ క్యాట్ ఐ అవతార్ రాను రాను బోర్ కొట్టే అవకాశం ఉంది.
ఇక్కడ ప్రియాంకా క్యాట్ ఐ లుక్స్ ను కొన్ని మీకోసం షేర్ చేస్తున్నాము:

4. రోబెరీ & ఫ్రాడ్ షేడ్స్ లో ప్రియాంకా చోప్రా
నిజం చెప్పుకోవాలంటే, గ్రాండ్ గా అలంకరింపబడిన ఛానెల్ ఫ్లేర్డ్ జంప్ సూట్ లుక్ లో ప్రియాంకా ఆమె అభిమానులను బాగా డిజప్పాయింట్ చేసింది. ఆమె అవుట్ ఫిట్ అద్భుతంగా ఉంది. అయితే, ఈ లుక్ కి పోనీటెయిల్ అనేది అస్సలు మ్యాచ్ కాలేదు. నిజానికి, ఈ లుక్ లో రోబెరీ & ఫ్రాడ్ స్లీక్ పేల్ పింక్ షేడ్స్ అనేవి అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఆమె లుక్ ని ఇవే ఎలివేట్ చేసాయి.
5. వోగ్ X గిగి ఐ వేర్
గ్యానీ మరియు ఫ్రేమ్ జీన్స్ వారి ఎల్లో స్వేటర్ లో ప్రియాంకా ముద్దుగా కనిపించింది. అయితే, ఈ లుక్ కి మరింత అందం తీసుకొచ్చింది మాత్రం లెపర్ట్ ప్రింటెడ్ మరియు బ్లాక్ వోగ్ X గిగి ఐ వేర్.

6. ఇలేస్తేవా లో ప్రియాంకా చోప్రా
శరీరానికి అటుకున్నట్టు ఉండే ఈ పర్పుల్ వివియాన్నే వెస్ట్ వుడ్ డ్రెస్ లో అలాగే పాయింటెడ్ క్రిస్టియన్ లాబాటిన్ లెదర్ పంప్స్ లో ప్రియాంకా ముగ్ధ మనోహరంగా కనిపించింది. అయితే, ఆమె లుక్ ని ఇలేస్తివా వైట్ మ్యాట్రిక్స్ ఇన్స్పైర్డ్ క్యాట్ ఐ షేడ్స్ లో మరింత ఎలివేట్ చేసింది.



Click it and Unblock the Notifications











