For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అంబరాన్నంటే సంబరాలతో అట్టహాసంగా ప్రారంభమైన ఆస్కార్ అవార్డ్స్ 2016

|

హాలీవుడ్‌లో 'ఆస్కార్' ఫీవర్ మొదలైంది...ఈ ఆదివారం సాయంత్రం (భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 5.30am) లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న ఈ అవార్డ్ వేడుక కోసం నిర్వాహకులు సర్వసన్నాహాలు చేస్తున్నారు. అవార్డుకు వేదికగా నిలవనున్న డాల్బీ థియేటర్ అందంగా ముస్తాబైయింది. 'ది మోస్ట్ గ్లామరస్ నైట్' కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తళతళలాడే బంగారు బొమ్మ వరించేది ఎవరినా... అంటూ హాలీవుడ్‌లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ అవార్డుల వేడుక గురించి పలు ఆసక్తికరమైన విశేషాలు...

Oscars 2016: Golden Globe Awards Festival Fever Started

14 ఏళ్లుగా డాల్బీ థియేటర్‌లోనే ఆస్కార్ వేడుక జరుగుతోంది. 3,400 సీటింగ్ సామ ర్థ్యమున్న ఈ వేడుక ప్రాంగణానికి 500 అడుగుల నిడివున్న రెడ్ కార్పెట్‌పై నడుచు కుంటూ రావాలి. ఆస్కార్ స్థాయి పేరున్న 'గోల్డెన్ గ్లోబ్' అవార్డ్స్ రెడ్ కార్పెట్ కన్నా ఆస్కార్ అవార్డ్స్ రెడ్‌కార్పెట్ నిడివి ఎక్కువ. గోల్డెన్ గ్లోబ్ రెడ్ కార్పెట్ నిడివి 437 అడుగులే.

ఈసారి అవార్డులు ప్రదానం చేసే తారల్లో మన ప్రియాంకా చోప్రా ఉండటం విశేషం. మరి ఫ్యాషన్ ఐకాన్ అనిపించుకున్న ప్రియాంక ఈ వేడుకల్లో ఎలాంటి దుస్తులు ధరిస్తారో, విదేశీయుల్ని ఏ స్థాయిలో ఆకట్టుకుంటారో చూడాలి.

ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా వివిధ విభాగాల్లో మొత్తం 20 మంది నటులు ఆస్కార్ కోసం పోటిపడుతున్నారు. అయితే ఇందులో 70 శాతం మంది ఇది వరకు ఆస్కార్ తీసుకున్నవాళ్లే కావడం విశేషం.

ఇక 'టైటానిక్' ఫేమ్ లియోనార్డో డికాప్రియో ఈ సారి ఉత్తమ చిత్రవిభాగాల్లో నిలిచిన రెండు చిత్రాల్లో తెరపై మెరిశారు. ఆ సినిమాల్లో ఒకటి... 'ద రెవరెంట్', మరొకటి 'రూమ్'. విశేషం ఏంటంటే... 'ద రెవరెంట్' చిత్రంలో ఆయనది ప్రధాన పాత్ర. తద్వారా ఉత్తమ నటుడి విభాగంలో ఆయన ఆస్కార్ బరిలో నిలిచారు. ఇక, ఉత్తమ చిత్రం విభాగంలో ఉన్న మరో చిత్రం 'రూమ్'లోనూ ఆయన కనిపిస్తారు. కానీ, ఫొటో రూపంలోనే. ఈ చిత్రంలోని బాల నటుడు, డికాప్రియోకు వీరాభిమాని. ఆ అభిమానాన్ని వ్యక్తపరిచే సన్నివేశాల్లో లియొనార్డో ఫొటో కనిపిస్తుంది.

చిన్న వయసులోనే ఆస్కార్ దక్కించుకున్న నటిగా జెన్నీఫర్ లారె న్స్ 2013లో రికార్డు సాధించారు. ఆ తర్వాత ఆమె ఆస్కార్ బరిలో నిలుస్తూనే ఉన్నారు. ఈ ఏడాది కూడా నామినేషన్ దక్కించుకున్నారు. తనతో పాటు పోటీపడుతున్న తారలందరి కన్నా ఎక్కువగా సంపాదిస్తున్నది జెన్నిఫర్ లారెన్సే అట. ఈ క్యూట్ బ్యూటీ సంపాదన ఏడాదికి 358 కోట్ల రూపాయలట. మరి... జెన్నిఫరా... మజాకానా? ఇప్పుడు జెన్నీఫర్‌తో ఆస్కార్ బరిలో నిలిచిన తారలు కేట్ బ్లాంచెట్, బ్రీ లార్సెన్, ఛార్లోట్ రాంప్లింగ్, సాయోర్స్ రోనన్‌ల సంపాదన ఏడాదికి 41 కోట్ల రూపాయలు కూడా మించడం లేదట.

ఏకంగా 50 ఆస్కార్ నామినేషన్లు సాధించిన పెద్ద వయస్కుడిగా 'స్టార్ వార్స్- ద ఫోర్స్ ఎవేకన్స్' సంగీత దర్శకుడు జాన్ విలియమ్స్ ఈసారి కూడా నామినేషన్ల జాబితాలో ఉన్నారు. వాల్ట్ డిస్నీ ఏకంగా 59 నామినేషన్లతో చరిత్ర సృష్టిస్తే, ఆ తర్వాత స్థానంతో జాన్ తన పేరును చరితార్థం చేసుకున్నారు. ఇప్పటివరకూ జాన్ 5 సార్లు ఆస్కార్లు అందుకున్నారు. మరి, ఈసారీ ఆస్కార్ అందుకుంటారా?

English summary

Oscars 2016: Golden Globe Awards Festival Fever Started

Oscars 2016: Golden Globe Awards Festival Fever Started,The biggest awards show of the season has finally arrived, and it's sure to bring both laughs and surprises.
Desktop Bottom Promotion