Latest Updates
-
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా?
Priyanka chopra birthday: ప్రియాంక చోప్రా క్రేజీ ఫ్యాషన్ వేర్
జులై 18న ప్రియాంక చోప్రా పుట్టిన రోజు. ప్రియాంక కేవలం నటి మాత్రమే కాదు.. రచయిత్రి, వ్యాపారవేత్త కూడా.
Priyanka chopra birthday: ప్రియాంక చోప్రా స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు. మంచి రచయిత్రి, వ్యాపారవేత్త, ప్యాషన్ ఔత్సాహికురాలు, గ్లోబల్ ఐకాన్. దేశం గర్వించదగ్గ తారల్లో ప్రియాంక కూడా ఒకరు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు వెళ్లి ప్రపంచ వేదికపై భారత దేశ ప్రతిభను చాటింది. తన గ్లామర్ కెరియర్ లో ముఖ్యంగా ఫ్యాషన్ రంగంలో భారత దేశం గర్వపడేలా చేసిన చాలా క్షణాలు ఉన్నాయి.

ప్రియాంక చోప్రా జులై 18వ తేదీ 1982లో జన్మించింది. ఈ సందర్భంగా ఆమె సాధించిన అరుదైన ఘనతలు, అలాగే ఆమె ఫ్యాషన్ లుక్ పై ఓ లుక్కేద్దాం.

ఫ్యాషన్ ప్రియులు మర్చిపోలేని దుస్తులు..
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2019లో జరిగిన ఓ పార్టీ కోసం ప్రియాంక ఆరెంజ్ కలర్ దుస్తులు ధరించింది. ఈ నారింజ రంగు దుస్తుల్లో ప్రియాంక మెరిసిపోయింది. మెడ చుట్టూ కప్పి ఉంచి ఫుల్ హ్యాండ్స్, బోడిస్, సిల్హౌట్ తో ఆ డ్రెస్ అదిరిపోయింది. ఆరెంజ్ డ్రెస్ మెటాలిక్ టోన్స్ తో హైలైట్ చేశారు.ఈ డ్రెస్ పైకి గోల్డెన్ హీల్స్ ధరించింది ప్రియాంక, ఎర్రని లిప్ షేడ్ ప్రియాంకను క్రేజీగా మార్చేసింది. ఈ డ్రెస్ పైకి పోనీ టైల్ వేయడంతో లుక్ కిక్కెక్కించింది.

బ్లాక్ గౌన్
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ప్రియాంక బ్లాక్ గౌన్ లో కనిపించింది కవ్వించింది. ఆఫ్-షోల్డర్ గౌన్ లో ప్రియాంక దేవకన్యలా కనిపించింది. బోడిస్ పై వైన్-హ్యూడ్ స్ప్లాష్ అదిరిపోయాయి. ఈ సూపర్ కూల్ బ్లాక్ గౌన్ తో ఇంటీరియర్ బ్యాక్ డ్రాప్ తో ఫోటోలకు ఫోజులిచ్చింది.

బ్లూ డ్రెస్
ఈ ఐసీ బ్లూ డ్రెస్ లో ప్రియాంక లుక్స్ సూపర్బ్ అనే చెప్పాలి. కఫ్టాన్, లేస్ తరహా బోడిస్ డ్రెస్సుకు జత చేయడంతో... ప్రియాంక అందం మరింత పెరిగింది. పాయింటెడ్ వైట్ హీల్స్ ఈ డ్రెస్ పైకి అచ్చంగా సరిపోయాయి. పెర్ల్ నెక్ పీస్, స్టడ్ లు చాలా బాగా నప్పాయి. ఈ డ్రెస్ పైకి పింక్ లిప్ షేడ్ ను ఎంచుకుంది ప్రియాంక. లైట్ కలర్ పింక్ ఐ షాడోతో చోప్రా కూల్ గా కనిపించింది. వైట్ కలర్ హ్యాట్ ప్రియాంక సొగసును రెట్టింపు చేసింది.

బ్లాక్ సరియల్ గౌన్
ఈ బ్లాక్ సరియల్ గౌన్ ను తీర్చిదిద్దింది లా రోచ్. బిషప్ స్లీవ్స్ ను ఆదర్శంగా తీసుకుని ఈ గౌన్ కు రూపం కల్పించారు.దీని పైకి ప్రియాంక బగ్లరీ చిక్ రింగ్స్ ను ధరించింది ప్రియాంక.

ప్రియాంక చోప్రా ఘనతలు
* "ఫోర్బ్స్" 100 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ప్రియాంక చోప్రా 2018లో చోటు సంపాదించింది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న తొలి భారతీయ మహిళ ప్రియాంక కావడం గమనార్హం. ఈ జాబితాలో ప్రియాంక రెండు సార్లు చోటు దక్కించుకుంది. * అమెరికాకు చెందిన ఫ్యాషన్ మ్యాగజైన్ "వోగ్" కవర్ పేజీపై చోటు సంపాదించుకున్న మొదటి దక్షిణాసియా వ్యక్తి ప్రియాంకనే. 2018లో "వోగ్" కవర్ పేజీపై ప్రియాంక ఫొటో ముద్రించారు.
* మరాచెక్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సన్మానం పొందిన మొదటి బాలీవుడ్ నటి కూడా ప్రియాంక చోప్రానే.
* ప్రియాంక బాలల హక్కుల కోసం గ్లోబల్ యునిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా ఎంపికైంది.
* 2016లో గ్లోబల్ యునిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా ప్రియాంకను ప్రకటించారు.గ్లోబల్ అండాసిడర్ కాకముందు.. ఆమె 10 సంవత్సరాల పాటు యునిసెఫ్ సంస్థకు జాతీయ అంబాసిడర్ గా ఉన్నారు. ఇది ఒక్క ప్రియాంక చోప్రాకే సాధ్యమైంది.
* టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివ్ అంబాసిడర్ గా ఎంపికైన మొట్టమొదటి భారతీయ నటి ప్రియాంక చోప్రా.
* ప్రముఖ జువెల్రీ బ్రాండ్ బుల్గారీ సంస్థకు గ్లోబల్ అంబాసిడర్ గా వ్యవహరించిన మొదటి భారతీయ నటి ప్రియాంక చోప్రా.
* టెలివిజన్ లో ఉత్తమ నటిగా పీపుల్స్ ఛాయిస్ అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ నటి.
* 2000లో పద్దెనిమిదేళ్ల వయసులోనే ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకుంది.



Click it and Unblock the Notifications











