Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఈ ఫోటోలో అదిరిపోయే లుక్ తో కనిపించిన రజని కాంత్ మరియు హుమా ఖురేషీ
ఈ ఫోటోలో అదిరిపోయే లుక్ తో కనిపించిన రజని కాంత్ మరియు హుమా ఖురేషీ
వావ్! హుమా ఖురేషి సోషల్ మీడియా ఫీడ్ ద్వారా ఈ అద్భుతమైన పోస్ట్ పొందాము. వచ్చే నెల జూన్ 7 న విడుదల కానున్న 'కాలా' చిత్రానికి సంబంధించి, రజనీ కాంత్ తో ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ - 2018 లో ఈ సంవత్సరం మనకు ఫ్రెంచ్ రివీరాలో సాంప్రదాయ దుస్తులను ధరించి, ఫాషన్ ఫర్ రిలీఫ్ లో సెక్సీ షేడ్ చూపించి ప్రజలకు నివ్వెర పోయేలా కనిపించిన హుమా ఖురేషీ ఇప్పుడు రజనీ కాంత్ హీరోయిన్ గా “కాలా” లో నటించనుందని ఇదివరకే తెలిసిన నిజం.
మరియు ఈ దివా “కాలా” సినిమా నుండి రజినీ కాంత్ తో ఉన్న తన మొదటి ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఇక రజనీ అభిమానులలో పండుగ వాతావరణం లేకుండా ఉంటుందా చెప్పండి, అనతి కాలంలోనే దేశమంతా చక్కర్లు కొట్టేస్తూ ఉంది ఈ ఫోటో ఇప్పుడు. ఈ చిత్రంలో టేబుల్ కు అటు ఇటుగా కుర్చీలలో కూర్చుని, ఒకరి కళ్ళల్లో ఒకరు సంతోషంగా చూసుకుంటూ ఉన్న సన్నివేశం అద్భుతంగా ఉందని చెప్పక తప్పదు. కాలు మీద కాలేసుకుని ఉన్న రజనీ స్టైల్ ఓ మై గాడ్ లుక్ ఇచ్చిందనే చెప్పాలి.

ఈ స్టార్లెట్ హుమా ఖురేషి, అలంకరణకు వస్తే ఆకుపచ్చని రంగులో ఉన్న చెవిపోగులతో, హెవీ మేకప్ వేసినట్లు ఉన్న కళ్ళతో, ఆమె స్టైలింగ్ పరిపూర్ణతకు చేరుకుంది. మరియు ఇంచుమించు పాతకాలపు నటిని పోలి ఉండేలా కనిపించడంలో సక్సెస్ అయిందనే చెప్పాలి. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ నుండి తన భిన్నమైన దుస్తుల ఎంపికతో, ప్రజల చూపులను పూర్తిగా తనవైపు తిప్పుకునేలా చేస్తూ ఉంది హుమా ఖురేషీ.
ఇక రజనీకాంత్ విషయానికి వస్తే, అత్యంత సాదాసీదా పాతకాలపు దుస్తులలో అధునాతన నీలం రంగు చొక్కా మరియు సరిపోలే ప్యాంటుతో పాటు నలుపు రంగు బూట్లను ధరించి కాలు మీద కాలేసుకుని స్టైల్ గా కూర్చుని నవ్వుతున్నట్లు కనిపిస్తున్నాడు. ఏది ఏమైనా రజనీ స్టైలే వేరు.
మీరేమనుకుంటున్నారు ? ఈ ఇద్దరూ సూపర్ జోడీగా కనిపించడం లేదా? మీ వ్యాఖ్యలను క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి.



Click it and Unblock the Notifications