Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సోనం పెళ్లి వేడుకలలో శ్రీదేవి కూతుర్లు జాన్వి , ఖుషి మెరుపులు
సోనం పెళ్లి వేడుకలలో జాన్వి , ఖుషి మెరుపులు
శ్రీదేవీ మరణం తర్వాత కొంతకాలం ఎవరి కంటా పడని శ్రీదేవీ కూతుళ్ళు జాన్వీ, ఖుషి మొన్న “మాం” సినిమాతో ఉత్తమనటిగా శ్రీదేవీకి వచ్చిన అవార్డు తీసుకునే నేపద్యంలో భాగంగా బోనీ కపూర్ తో మరలా కనిపించి కనువిందు చేశారు. ఆ తర్వాత మరలా తమ బాబాయ్ అనిల్ కపూర్ కూతురు మరియు తమ సోదరి అయిన సోనం కపూర్ పెళ్ళిలో భాగంగా ధగధగలాడే తెల్లని దుస్తులలో ఏంజెల్స్ లా కనిపించి కనువిందు చేశారు.
భారతదేశపు టిన్సెల్ టౌన్ ముంబాయిలో జరిగిన సోనంకపూర్ మెహెందీ వేడుకలలో భాగంగా ఈ కపూర్ ద్వయం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలబడ్డారు. నిజానికి ఇది పెళ్లివేడుక అనే కన్నా, బాలీవుడ్ స్టార్ల వేడుక అంటే అతిశయోక్తికాదేమో. బాలీవుడ్ కి చెందిన ప్రముఖ తారలందరూ విచ్చేసిన ఈ అనిల్ కపూర్ కూతురి పెళ్లివేడుకలలో భాగంగా జరిగిన మెహెందీ కార్యక్రమంలో జాన్వీ, ఖుషి తమవంతుగా అలరించారు.

మరియు పెళ్లివేడుకలలో భాగంగా జరిగిన సంగీత్ వేడుకలు బాలీవుడ్ తారాగణంతో చరిత్రలో మరచిపోలేని విధంగా అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తారాగణం ఏ ఒక్కరూ తీసిపోని విధంగా, పిచ్-పర్ఫెక్ట్ గా కనువిందు చేసి అందరినీ అలరించారు. అందులో భాగంగా జాన్వి, ఖుషిలు కూడా సాంప్రదాయక దుస్తులను ధరించి, అందరికీ ఆహ్వానం పలుకుతూ కనిపించారు.
ఈమద్యన జరిగిన నేషనల్ ఫిలిం అవార్డ్స్ కార్యక్రమంలో శ్రీదేవి చిత్రం “మాం” కు గాను ఉత్తమనటి అవార్డు తీసుకునే క్రమంలో భాగంగా ఈ కపూర్ ద్వయం, తండ్రి బోనీకపూర్ తో విచ్చేసినప్పుడు చీర, లెహెంగా చోళీలతో కనువిందు చేసిన ఈ సోదరీమణులు, ఇప్పుడు తెల్లని పెళ్లిదుస్తులలో మెరిసిపోయారు.

వీరిలో జాన్వీ తెల్లటి క్రిస్ప్ లెహెంగా, చంకీ ఇంట్రికేట్ ఎంబ్రాయిడరీ కలిగిన చోళీ ధరించి “భంద్-గల”హారాన్ని మరియు కంగన్స్ ధరించి చేతిలో గోల్డెన్ క్లచ్(పర్స్)తో ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. తన “న్యూడ్-మేకప్”, అలల జుట్టు, షీర్ దుప్పటా ఈ క్లాసీ లుక్ అందానికి అదనపు ఆకర్షణగా నిలిచాయి.
ఖుషి ఎక్కువ ఆభరణాల జోలికి పోకుండా, జాన్వీ వలె ఒకేరకమైన దుస్తులను మాత్రం ధరించి ఆకర్షణీయమైన పాపిటిబిళ్ళ(మాగ్ టిక్కా), చెవిరింగులతో అందంగా కనిపించింది.



Click it and Unblock the Notifications