Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
రణ్వీర్ సింగ్ మమ్ములను క్షమించాలి, రణభీర్ కపూర్ - దీపికా పదుకునే పెయిర్ అదిరింది
రణ్వీర్ సింగ్ మమ్ములను క్షమించాలి, రణభీర్ కపూర్ - దీపికా పదుకునే పెయిర్ అదిరింది
మొన్న గురువారం రాంప్ పై మనిష్ మల్హోత్రా డిజైన్ చేసిన ప్రత్యేకమైన దుస్తులతో రాంప్ వాక్ చేసిన దీపికా పదుకొనే – రణభీర్ కపూర్ కార్యక్రమానికే కేంద్రబిందువుగా నిలిచారు. తద్వారా పద్మావత్ సినిమాలో తనతో నటించిన రణ్వీర్ సింగ్ కన్నా, రణభీర్ కపూర్ తో పెయిర్ అదిరింది అంటూ న్యూస్ షికార్లు చేస్తూ ఉంది. మిజ్వాన్ సంక్షేమ సంఘం నిర్వహించిన ఫాషన్ షో లో భాగంగా పాల్గొన్న వీరు ప్రపంచాన్నే అబ్బురపరచే అందమైన కపుల్ గా కన్పించారు.
రణభీర్ - దీపిక ఇద్దరూ “ ది వాక్ ఆఫ్ మిజ్వాన్ “ ఫాషన్ షో లో ౩ సంవత్సరాల తర్వాత కలిసి కనిపించారు. ఈ ఫాషన్ షో లో దీపికా ముత్యాలతో పూలవలె ఎంబ్రాయిడ్ చేసిన లెహంగా చోళీని ధరించగా, రణభీర్ కపూర్ నలుపు షేర్వాణీ మీద తెలుపు రంగు ఎంబ్రాయిడరీ చేసిన దుస్తులను ధరించి ఎంతో ఆకర్షణీయంగా కనిపించారు.

ఈ ఇద్దరూ చేతిలో చేయి వేసుకుని రాంప్ నుండి కిందకు దిగుతూ ప్రేక్షకులను పలకరిస్తూ కార్యక్రమానికే ఒక కళను తీసుకుని వచ్చారు. తద్వారా దీపిక – రణభీర్ జంట టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ జంట ఇదివరకే “ ఏ జవానీ హై దివానీ “ సినిమాలో నటనకు ప్రేక్షకుల ప్రశంసలను పొందారు. మరలా ఇన్ని సంవత్సరాల తర్వాత, రాంప్ పై ఎంతో ఆకర్షణీయంగా కనిపించి ప్రేక్షకుల మతులు పోగొట్టారు.
మనీష్ మల్హోత్రా దీపికా – రణభీర్ మద్యన ఎలా కనిపించారంటే :
మనీష్ మల్హోత్రా, వీరిరువురితో కలిసి స్టేజ్ మద్యలో చేరి సంతోషం , స్నేహపూరిత వాతావరణం మద్య ఉబ్బితబ్బిబ్బైనట్లుగా కనిపించారు. తద్వారా ఫాషన్ షో ఏంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.

రణభీర్ కపూర్ తర్వాతి సినిమా ఎవరితో అంటే ...
అయన్ ముఖర్జీ తీస్తున్న “బ్రహ్మాస్త్ర” సినిమాలో ఆలియా భట్ , దీపికా పదుకునే లతో తన తర్వాతి ప్రాజెక్ట్ లో నటించనున్నట్లు తెలిపారు.
బాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్ దీపిక పదుకునే , రణ్వీర్ సింగ్ తో ఇది వరకే పద్మావత్ లో నటించగా, దీపికా బాయ్ ఫ్రెండ్ రణ్వీర్ గా రూమర్లు షికార్లు చేస్తున్న విషయం విదితమే. ఇవి ఈ సంవత్సరం చివరలో అయినా ఒక ముగింపును ఇస్తాయేమో చూడాలి.



Click it and Unblock the Notifications