For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జాన్వీ-ఖుషీలే తన స్టైల్ బుక్స్ అని స్టయిల్ సీక్రెట్స్ ను వెల్లడించిన శ్రీదేవి

|

చాలాకాలం క్రితం, శ్రీదేవి ఒక ఇంటర్వ్యూలో తన స్టయిల్ ఇన్స్పిరేషన్స్ గురించి చెప్పుకొచ్చింది. జాన్వీ, ఖుషీలు స్టైల్ విషయంలో శ్రీదేవి గైడెన్స్ ను తీసుకుంటారా అనే ప్రశ్నకు బదులిస్తూ వారే తనకి ఫ్యాషన్ టిప్స్ ని ఇస్తారని వివరించింది. తన కుమార్తెల దగ్గరనుంచి స్టైల్ కి సంబంధించిన చిట్కాలను తెలుసుకుంటూ ఉంటానని చెప్పుకొచ్చింది.

ఒక ఇంటర్వ్యూలో తన ఫ్యాషన్ ఇన్స్పిరేషన్ గురించి మాట్లాడుతూ, "నేను మా కుమార్తెల నుంచి స్టైల్ ఇన్స్పిరేషన్ పొందుతాను. ఫ్యాషన్ అంటే నాకంటే బాగా వారికే తెలుసు. వారు నాకు ఎన్నో సలహాలను అందిస్తారు. తల్లిగా వారి సలహాలు స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉంటుంది. వారిని టిప్స్ అడగడం నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. కొన్ని సార్లు, వారికి కొన్ని అవుట్ ఫిట్స్ నప్పుతాయా లేదానని నన్నడుగుతారు. అప్పుడు నేను వారికి సూచనలిస్తాను" అని శ్రీదేవి తన కుమార్తెలు జాన్వీ, ఖుషీలే తన స్టైల్ ఇన్స్పిరేషన్స్ అని గర్వంగా చెప్పుకొచ్చింది.

Sridevi's Style Inspirations Were Jhanvi And Khushi

బాలీవుడ్ లోని గ్లామర్ వరల్డ్ లోకి ఎంటర్ అయినప్పటినుంచి శ్రీదేవి స్టైల్ కి అడ్రస్ గా మారింది. విభిన్న పాత్రలను పోషిస్తూ ఆ పాత్రలకు తగిన దుస్తులను ఎంచుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచేది. కాస్త గమనిస్తే, అప్పటి హీరోయిన్స్ లో ఫ్యాషన్ పై మక్కువతో దుస్తులపై కేర్ చూపించిన హీరోయిన్ గా శ్రీదేవిని పేర్కొనవచ్చు. శ్రీదేవి స్టైల్స్ ఇప్పటికీ ట్రెండీగా ఉన్నాయనడంలో సందేహం లేదు.

ఈ అద్భుతమైన నాటికి నివాళులు అర్పిస్తూ తన కుమార్తెలు జాన్వీ, ఖుషీలతో శ్రీదేవి లుక్స్ ని ఈ ఆర్టికల్ లో పొందుబరిచాము.

మోహిత్ మార్వా వెడ్డింగ్ వద్ద

మోహిత్ మార్వా వెడ్డింగ్ వద్ద

అతిలోక సుందరికి సంబంధించిన లాస్ట్ లుక్ ఇది. ఈ ఈవెంట్ కోసం శ్రీదేవి మానిష్ మల్హోత్రా ఎంసెంబిల్ ని ధరించింది. ఎప్పటిలాగే ఆరోజు కూడా అందంగా మెరిసింది. ఈ స్టిల్ లో శ్రీదేవి చిన్నకుమార్తె కూడా మానిష్ మల్హోత్రా పింక్ లెహంగాలో ముచ్చటగా కనిపించింది.

మరొక ఫ్యామిలీ వెడ్డింగ్ లో

మరొక ఫ్యామిలీ వెడ్డింగ్ లో

ఈ ఫ్యామిలీ పిక్చర్ శ్రీదేవికి చెందిన మరొక ఫ్యామిలీ వెడ్డింగ్ కి సంబంధించినది. శ్రీదేవి ఈ వెడ్డింగ్ కి తన ఫ్యామిలీతో అటెండ్ అయింది. శ్రీదేవితో పాటు ఆమె కుమార్తెలు కూడా మానిష్ మల్హోత్రా అవుట్ ఫిట్స్ ను ధరించారు. ఈ ముగ్గురు ఈ డిఫెరెంట్ స్టైల్స్ ని చక్కగా క్యారీ చేయగలిగారు. ముగ్గురూ అత్యద్భుతంగా కనిపించారు.

IFFI 2017 వద్ద

IFFI 2017 వద్ద

ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2017 ఈవెంట్ కు అటెండ్ గోవాలో జరిగింది. ఈ వేడుకకు తన కుమార్తె జాన్వీతో అలాగే బోణీ కపూర్ తో శ్రీదేవి అటెండ్ అయింది. జాన్వీ మల్టిపుల్ హ్యూడ్ లెహంగాలో సందడి చేసింది. మనీష్ మల్హోత్రా శారీలో శ్రీదేవి అత్యద్భుతంగా కనిపించింది.

ఎయిర్ పోర్ట్ లుక్స్

ఎయిర్ పోర్ట్ లుక్స్

శ్రీదేవి, జాన్వీ మరియు ఖుషీలు తరచూ ఎయిర్ పోర్ట్ లో దర్శనమిస్తూ ఉంటారు. ఈ పిక్ లో వీరంతా ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. ఈ పిక్ లో ఈ ముగ్గురు స్టన్నింగ్ ఎయిర్ పోర్ట్ లుక్స్ లో తళుక్కుమన్నారు. వైట్స్ మరియు డెనిమ్స్ తో ఆకట్టుకున్నారు. శ్రీదేవి బ్లూ జంప్ సూట్ లో మెరిసింది.

"మామ్" ప్రమోషన్స్ వద్ద

ఆఖరిగా విడుదలైన శ్రీదేవి సినిమా "మామ్". 2017లో విడుదలైన ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా శ్రీదేవి తన కుమార్తెలను కూడా ఈవెంట్ కి తీసుకువచ్చేది. ఈ ఫ్యామిలీ మొత్తం స్టైలిష్ గా కనిపించేవారు. క్లాసీ ఆలివ్ గ్రీన్ బీజ్ డ్రెస్ లో శ్రీదేవి అద్భుతంగా కనిపించింది. జాన్వీ పాప్ కల్చర్డ్ అవుట్ ఫిట్ అనేది వైరల్ గా మారింది.

టూర్ స్టైల్ బుక్స్

టూర్ స్టైల్ బుక్స్

తన ఫ్యామిలీతో స్విట్జర్లాండ్ ని సందర్శించిన శ్రీదేవి తన వెకేషన్ ని సంబంధించిన పిక్స్ ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునేది. ఈ లుక్స్ అనేవి ఎంతో కూల్ గా ఉండేవి. బ్లాక్ ఫర్ అవుట్ ఫిట్స్ లో శ్రీదేవి కుమార్తెలు స్టన్నింగ్ గా కనిపించరు. శ్రీదేవి కూడా పింక్ లో వైబ్రెంట్ గా సందడి చేసింది. తల్లీకూతుళ్లు తమ స్టయిల్ ను ఎప్పుడు కో ఆర్డినేట్ చేసుకుంటూ ఉండేవారు.

ట్రిప్ కి సంబంధించి మరికొన్ని లుక్స్

ట్రిప్ కి సంబంధించి మరికొన్ని లుక్స్

జాన్వీతో తన పిక్చర్ ని షేర్ చేసింది శ్రీదేవి. ఈ లుక్ లో ఇద్దరూ స్టన్నింగ్ గా ఉన్నారు. జాన్వీ క్రాప్ వైట్ టాప్ ని అలాగే బ్యాగీ ఎంబ్రాయిడర్డ్ జీన్స్ ను దైర్నచింది. తల్లీకూతుళ్లు స్టయిల్ కే కేర్ ఆఫ్ అడ్రస్ లా మారిపోయారు.

మోనోక్రోమ్ గేమ్:

మోనోక్రోమ్ గేమ్:

స్టైలిష్ మదర్ తన కూతుళ్లతో మోనోక్రోమ్ స్టయిల్ ను ఒకానొక స్టెఫానో రిసిస్ ఈవెంట్స్ లో ప్రదర్శించింది. శ్రీదేవి, జాన్వీలు బ్లాక్ లో సందడి చేశారు. చిన్నమ్మాయి వైట్ బాడీ కాన్ లో దర్శనమిచ్చింది.

లాక్మే ఫాషన్ వీక్ లో

లాక్మే ఫాషన్ వీక్ లో

ఇటీవలే లాక్మే ఫాషన్ వీక్ సమ్మర్ రిసార్ట్ 2018లో శ్రీదేవి తన కుమార్తె జాన్వీతో పాల్గొంది. అనితా డోంగ్రే స్ప్రింగ్/సమ్మర్ కలెక్షన్ ని ఈ ఈవెంట్ లో ప్రదర్శించారు. జాన్వీ ఫ్లోరల్ జంప్ సూట్ ను ధరించింది. శ్రీదేవి పాస్టెల్ గ్రీన్ అవుట్ ఫిట్ ను ధరించింది.

స్ట్రాప్లెస్ స్టైల్ లో

స్ట్రాప్లెస్ స్టైల్ లో

శ్రీదేవి, జాన్వీలకు చెందిన ఈ లుక్ చాలా కాలం క్రితంది. ఇందులో శ్రీదేవి పెద్దకుమార్తెలో బడ్డింగ్ ఫ్యాషనిస్టాను గమనించవచ్చు. స్ట్రాప్ లెస్ పాస్టెల్ గ్రీన్ టుల్లే డ్రెస్ ని ధరించిన జాన్వీ స్టన్నింగ్ గా కనిపించింది. శ్రీదేవి సెక్విన్ స్ట్రాప్లెస్ గావున ని ధరించి ఆశ్చర్యపరిచింది.

షోల్డర్ మానియా

షోల్డర్ మానియా

మనం ఏ దుస్తులను ధరించం అన్నదాని మీద స్టైల్ అనేది ఆధారపడదు. వాటిని ఏ విధంగా క్యారీ చేశాం అన్నదానిపై స్టయిల్ ఆధారపడి ఉంటుంది. శ్రీదేవికి ఆమె కుమార్తెలకు ఈ విషయం బాగా తెలుసనిపిస్తోంది. ఈ లుక్ లో శ్రీదేవి వన్ షోల్డర్ గౌన్ లో తళుక్కుమంటే ఆమె కుమార్తె జాన్వీ బ్లూ స్ట్రాప్లెస్ గౌన్ లో మనల్ని మంత్రముగ్దుల్ని చేసింది.

సెక్విన్ మాస్టర్స్

సెక్విన్ మాస్టర్స్

తన పిల్లల స్టైలింగ్ ని ఎప్పుడూ అనుసరిస్తూ ఉండేది అందాల నటి శ్రీదేవి. ఈ లుక్ కోసం కూడా శ్రీదేవి తన కుమార్తె జాన్వీతో కలిసి సెక్విన్ లో మెరిసింది. బార్ డాట్ స్లీవ్డ్ సెక్విన్ గౌన్ ను జాన్వీ ధరించగా, శ్రీదేవి వైట్ శారీపై సెక్విన్ బ్లౌజ్ ను హుందాగా క్యారీ చేసింది. మొత్తానికి వీరిద్దరూ సెక్విన్ మాస్టర్స్ గా పేరొందారు.

English summary

Sridevi's Style Inspirations Were Jhanvi And Khushi

Sridevi's Style Inspirations Were Jhanvi And Khushi, Sridevi had once owned up about getting style-inspired by Jhanvi and Khushi and here are their best looks together. Have a look.
Story first published:Wednesday, February 28, 2018, 15:50 [IST]
Desktop Bottom Promotion