Latest Updates
-
మీరు మీ జీవిత భాగస్వామిని నిజంగా ప్రేమిస్తున్నారా.. ఈ ప్రశ్నలతో చెక్ చేసుకోండి.! -
వర్షాకాలంలో ఇంట్లో చీమల బెడద.. ఈ ఆయుర్వేద చిట్కాలతో ఇట్టే తరిమేయండి.! -
సండే స్పెషల్.. మిరియాల ఘాటుతో నోరూరించే స్పైసీ లెమన్ చికెన్ స్టార్టర్.! -
మేకప్ తర్వాత మీ ముఖం మరింత అందంగా కనిపించాలంటే.. ఏ బ్లషర్ ఎంచుకోవాలో తెలుసా.? -
నాలుగు నెలల తర్వాత ఖమేనీ అంత్యక్రియలు.. మృతదేహాన్ని ఎంతకాలం భద్రపరచొచ్చు.? -
మీ భోజనంలో ఈ ఒక్క లోపంతో ఇన్ని సమస్యలా.. బలహీనమైన జుట్టు, గోళ్లకు ఇదే కారణం.! -
రోడ్ సైడ్ టిఫిన్ సాంబార్..ఏం రుచిరా బాబు కేక అంతే..10 నిమిషాల్లో మీ ఇంట్లో చేసుకోండిలా.. -
కన్ను అదురుతుందని ఇలా చేస్తున్నారా.. అసలు కారణం తెలిస్తే ఈ తప్పులు చేయరు.! -
డాక్టర్ సలహా..షుగర్ ఉన్నవారు తప్పకుండా తినాల్సిన 3 కూరగాయలు, 3 పండ్లు.. -
చుక్క నూనె లేకుండా రెస్టారెంట్ స్టైల్ మలాయ్ చికెన్..సాఫ్ట్ గా, జ్యూసీగా చేయండిలా
తారీఫెన్: సిజ్లింగ్ అవతార్ లో స్టన్నింగ్ గా కనిపించిన సోనమ్ - కరీనా

కపూర్ లేడీస్ కు ఫ్యాషన్ పై ఉన్న మక్కువ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. స్టార్స్ చుట్టూనే ఫ్యాషన్ తిరుగుతూ ఉంటుందని, వారేం చేసిన స్టయిల్ అని, చుట్టూ ఫ్యాషనిష్టాస్ ఉన్నా కేవలం కపూర్ లేడీస్ పైనే ఫోకస్ ఎక్కువగా ఉంటుందని మీరనుకోవచ్చు. అలా అయితే, మీ అభిప్రాయం తప్పు.
"వీరే దీ వెడ్డింగ్" ట్రైలర్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇది కేవలం వుమెన్ ఓరియెంటెడ్ చిత్రం మాత్రమే కాదు. ఇది అన్ని రకాల స్టీరియోటైప్స్ ను బద్దలకొట్టడానికి అలాగే కథలోని ఇంకొక ముఖ్య భాగాన్ని ముందుకు తేవడానికి ఈ చిత్రం ఉపయోగపడుతుంది.

ఈ సినిమాకి చెందిన మొదటి పాట ఇటీవలే విడుదలైంది. బ్లాక్ అండ్ గోల్డ్ లో కరీనాతో పాటు సోనమ్ కొన్ని ఇంటరెస్టింగ్ మూవ్స్ తో అలరించారు. వీటిని హాట్ మూవ్స్ అనడం కూడా తక్కువే. వీరి మూవ్స్ కి అమితమైన రెస్పాన్స్ అందుతోంది.
బ్రైట్ కలర్ కాస్ట్యూమ్స్ తో మెరుస్తున్న వీరిద్దరూ ఉబర్ స్టైలిష్ యాక్ససరీలను ధరించారు. అలాగే అందుకు తగిన పిచ్ పెర్ఫెక్ట్ మేకప్ లో ఓ పాటలో దర్శనమిచ్చారు. అలాగే, ఈ పాటకు వీరి లిప్ సింకింగ్ కూడా అద్భుతంగా మ్యాచ్ అయింది. వీరి పాట విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది.

తారీఫెన్ సాంగ్
ఈ వీడియో ను చూసిన వాళ్లెవరికైనా "కరీనా ఒక ఏడాది వయసున్న బిడ్డకు తల్లా" అన్న సందేహం వచ్చి తీరుతుంది.
కరీనా ఈ సాంగ్ లో హాట్ గా నటించి మతిపోగొడుతోంది. ఎడ్జీ ఫ్యాషన్ తో అద్భుతం సృష్టిస్తోంది.

తారీఫెన్ లో కరీనా కపూర్
మరోవైపు స్వర మరియు శిక్షలు కూడా సూపర్ హాట్ గా కనిపించారు. హై ఫై స్టైల్ కొషేంట్ తో మురిపించారు.
రెగ్యులర్ బాలీవుడ్ ఐటెం నంబర్స్ కి బిన్నంగా తారీఫెన్ లోని ఈ పాట తెరకెక్కింది. ఈ పాటలో స్టయిల్ ను మేళవించి కూడా ఐటెం సాంగ్ లోని కిక్ ను జోడించవచ్చని మేకర్స్ స్పష్టం చేశారు. ఇందులోని స్టైల్ కి ఆకాశమే హద్దు అనిపిస్తుంది.
నిజానికి, ఈ ఐటెం నంబర్ అనేది ఒక ట్రెండ్ ను సృష్టిస్తుందనడంలో సందేహం లేదు.
"వీరే దీ వెడ్డింగ్" గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కరీనా "అవును, ఈ చిత్రంలో నా వెడ్డింగ్ అనేది కాస్తంత ప్రత్యేకంగా ఉంటుంది. రియా నన్ను స్టైల్ చేస్తుంది. ఎంతో స్టైలిష్ గా ఉంటాను. సోనమ్ తో పాటు ఫ్యాషనిష్ఠాగా అలరిస్తాను. నా స్టైల్ ప్రత్యేకించి మిమ్మల్ని ఆకర్షిస్తుంది. ఈ సినిమాతో స్టైల్ అనేది కొత్తపుంతలు తొక్కుతుంది." అని చెప్పుకొచ్చింది.

నిజమే కదా
ఈ సినిమా జూన్ 1న విడుదల అవడానికి సిద్ధంగా ఉంది. సోనమ్ మ్యారేజ్ మే 8 న గ్రాండ్ గా జరగనుంది.
ఈ వీడియో ను చూడండి మరి.



Click it and Unblock the Notifications