Latest Updates
-
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే..
తషాన్ సినిమా లో కరీనా ధరించిన 5 స్టైలిష్ డ్రెస్సులు
అక్షయ్ కుమార్,సైఫ్ అలీ ఖాన్,కరీన నటించిన హిందీ సినిమా తషాన్ ఎవరికి గుర్తుండదు??మీరు ఆ సినిమా చూసుండకపోవచ్చు కానీ ఆ సినిమా విడుదలయ్యాకా “సైజ్ జీరో” అన్న మాటని విని ఉంటారు.
చిన్నప్పుడు కరీనా బొద్దుగా ఉండేది.తషాన్ సినిమా రూపొందించే ముందు ఈమె బాగా సన్నబడి తన ఒంపు సొంపులతో అందంగా తయారయ్యింది.ఈ సైజ్ జీరో ఫిగర్‌తో ఆమె రాత్రి కి రాత్రే భారత దేశం లో స్టైల్ సింబల్ అయిపోయింది.రోజుకి ఒక బాదం పలుకు మాత్రం తిని సన్నబడే స్టైల్ ని కరీనానే కదా మొదట ప్రారంభించింది. రోజుకి ఒక్క బాదం మాత్రమే అని సరదాకి అన్నాము కానీ సన్నబడాలంటే మీరు చక్కటి ఆహార నియమాలని పాటించాలి. ఈ జీరో సైజ్ ట్రెండ్ ని తషాన్ సినిమా ద్వారా బాగా ప్రాచుర్యం లోకి తెచ్చింది కరీనా. ఆకుపచ్చని బికినీ ధరించి చలియా చలియా పాటలో కరీనా నీళ్ళల్లోంచి బయటకొచ్చే సీనుకయితే హాలులో ఈలలు మారుమోగాల్సిందే.చాలా మంది హాలులో ఈ సినిమా చూస్తూ ఈలలేసి గోల చేసే ఉంటారు కూడా.కరీనా స్కిన్నీ ఫిగర్ గురించి చర్చ ఆపి ఈ సినిమా లో ఆమె ధరించిన స్టైలిష్ దుస్తుల గురించి చూద్దాము.
స్కిన్నీ(సన్నగా) ఉంటే ఏదైనా నప్పుతుంది అని ఎవరన్నారో కానీ అది కరక్టే.సునీల్ షెట్టి కి చాతీ మీద వెంట్రుకలు ఎంత నిజమో ఇదీ అంతే నిజం.కరీనా కి ఈ సినిమాలో ఎన్నో రంగుల దుస్తులు ధరించే అవకాశం వచ్చింది.ఎంత సమ్మోహనకరంగా ఉందొ ఆ దుస్తుల్లో ఈమె.కరీనని అలా చూసాకా అమాయిలు జీరో సైజ్ కోసం డైటింగులు అవీ మొదలు పెట్టారంటే ఆశ్చర్యం లేదు.ఆమె దుస్తులన్నీ బీచ్ థీం తో రూపొందించబడ్డాయి.ఈ సినిమా విడుదలయ్యి చాలా ఏళ్ళయినా అందులో కరీనా ధరించిన దుస్తుల ట్రెండ్ ఇప్పటికీ కొత్తగానే ఉంటుంది.

వైట్ డ్రెస్:
వైట్ టాప్ తో వైట్ కలర్ డెనిం షార్ట్స్ ధరించింది కరీనా.మరి మీరు ఈసారి బీచ్ కి వెళ్ళినప్పుడు వెంట ఏ దుస్తులు తీసుకెళ్ళాలో తెలుసు కదా.

బోల్డ్ బ్లూ:
నీలం రంగు డ్రెస్ కి ధీటుగా తన సెక్సీ గా ఎగురుతున్న జుట్టుని అక్కడక్కడా హైలైట్ చేసుకున్న బెబో ఎంత అందం గా ఉందొ ఈ డ్రెస్ లో.బ్లూ ట్యాంక్ టాప్ మీద ఉన్న సన్నటి డిజన్, దానికి తోడుగా ధరించిన లెదర్ బెల్త్ తో కరీనా ని చూస్తే పగ తీర్చుకునే సుందరి లా లేదూ??బీచ్ పార్టీ కి ఈ డ్రెస్స్ సరిపోతుంది. ఈ సారి మీ జుట్టు ని కర్ల్ చేయించుకున్నపుడు లేదా గోవా వెళ్ళినప్పుడు ఏమి ధరించాలో తెలుసు కదా.

రెక్లెస్ రోడ్ ట్రిప్ ఔట్‌ఫిట్:
తన అందమైన ఊరువులని కరీనా ఈ డ్రెస్ లో ప్రదర్శించింది.ముందు అలా అలవోకగా ముడి వేసి వదిలిన వైట్ షర్ట్, డెనిం షార్ట్స్ అధ్భుతంగా ఉన్నాయి.ఈ డ్రెస్ తో పాటు ఆమె ధరించిన బూట్లని మర్చిపోతే ఎలాగ??మీరు ఈసారి వెళ్ళే రోడ్ ట్రిప్ కి ఈ స్టైల్ ని కాపీ చెయ్యచ్చు.

రూత్లెస్ షిమ్మర్:
ఆమెకి పార్టీలు చేసుకోవడం అంటే ఇష్టం, మాకు తెలుసు. ఇదీ ఆమె డ్రెస్ ని వర్ణించాల్సొస్తే ఎవరైనా అనే మాట.అంత మెరుపుల టాప్ ధరించలేము అనుకుంటే స్కర్టు మెరుపులతో ఉన్నది ధరించి పైన నల్లటి క్రాప్ టాప్ ధరించండి.

సమ్మోహకర డ్రెస్:
అవును మేము ఈ డ్రెస్ కి పెట్టిన టైటిల్ కి తగ్గట్టే ఉంటుంది ఈ డ్రెస్ కూడా.మీ పూల్ పార్టీలలో ధరించడానికి ఈ డ్రెస్ మీ దగ్గర తప్పక ఉండి తీరాలి.మెరుపులతో ఉన్న గోల్డెన్ షార్ట్స్ పార్టీ ప్రియుల వద్ద తరచుగా కనిపిస్తోంది ఈ మధ్య.ఇది మిస్స్ అవ్వకండే.
ఆమె జీరో ఫిగర్ స్టైల్ కంటే ఆమె దుస్తులు మాకు బాగా నచ్చాయి. మరి మీరేమంటారు?



Click it and Unblock the Notifications











