For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ తారల చీరలతో మీరు అందమైన పెళ్లికూతురిలా మారిపోవచ్చు...!

|

ఫ్యాషన్ లోకంలో ఎన్ని కొత్త ట్రండ్స్ వచ్చినా చీరది మాత్రం ఎప్పటికీ తొలి స్థానమే. ఎందుకంటే కాలం మారుతున్న కొద్దీ.. ట్రెండ్స్ కు అనుగుణంగా చీర కూడా తన రూపాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ కొత్త సొబుగులు అద్దుకుంటోంది.

అందుకే హీరోయిన్లను మొదలుకుని సామాన్య మహిళల వరకు తమ వార్డ్ రోబ్ లో చీరలకు కచ్చితంగా స్థానం ఇస్తారు. అయితే ప్రస్తుత తరం అమ్మాయిలు పెళ్లి వేడుకలకు, ఇతర ఫంక్షన్లకు చీరలు కట్టుకోవడానికి అంతగా ఇష్టపడేవారు కాదు.

ఎక్కువగా లెహంగాలు, పంజాబీ డ్రెస్ లేదా ఇతర వెస్ట్రన్ డ్రెస్ లపై ఎక్కువగా ఆసక్తి చూపేవారు. కానీ ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు పట్టుచీరలు కట్టుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. తమ పెళ్లి కోసం రకరకాల పట్టుచీరలను తమ వార్డ్ రోబ్ లో చేర్చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో మీరు కూడా తారలు కట్టుకున్న పట్టుచీరలను కట్టుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పటి ఫ్యాషన్ ప్రపంచంలో ట్రెండింగ్ అవుతున్న కొన్ని రకాల పట్టుచీరల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ పట్టుచీరలు కట్టుకుంటే మీరు కొత్త పెళ్లికూతురిలా కనిపించడం ఖాయం. ఇంకెందుకు ఆలస్యం ఆ చీరలపై మీరు కూడా ఓ లుక్కేయండి.

గద్వాల్ చీరలు..

గద్వాల్ చీరలు..

తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల్ జిల్లాలో తయారయ్యే ఈ చీరలు ప్రపంచ ప్రసిద్ధి గాంచినవి. అందమైన డిజైన్లతో అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ చీరలు చూడటానకి మాత్రమే కాదు.. కట్టుకోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. సిల్క్, కాటన్, కాటన్ సిల్క్ తో కలిపి వీటిని తయారు చేస్తారు. పెళ్లి పట్టుచీరల్లో వీటికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఏ వయసులో ఉన్నవారైనా ఈ చీర కట్టుకుంటే అందమైన పెళ్లికూతురిలా కనిపిస్తారు. అదే ఈ చీరలోని ప్రత్యేకత.

పోచంపల్లి..

పోచంపల్లి..

తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలోని పోచంపల్లికి సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరు వచ్చింది. ఎందుకంటే ఇక్కడి దారాలకే రంగులు అద్ది వాటినే డిజైన్లుగా మలిచే చీరలతో మీ అందం మరింత పెరుగుతుంది. ఈ చీరలపై ఉన్న డిజైన్ ను ఇక్కత్ డిజైన్ అని పిలుస్తారు. ఇవి కట్టుకోవడానికి చాలా కంఫర్ట్ గా ఉండటంతో పాటు ఎక్కువ కాలం మన్నికగా వస్తాయి. వీటిని ఎండాకాలంలో ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ తయారైన పట్టు, సిల్క్, కాటన్ చీరలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది.

బెనారస్..

బెనారస్..

ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో బెనారస్, బనారసీ చీరలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత సంపాదించుకున్నాయి. ఈ చీరలలో ప్రత్యేకత ఏంటంటే.. ఇక్కడ సన్నని బంగారం, వెండి దారలతో వీటిని తయారు చేస్తారు. ఒకప్పుడు మొఘలు రాజవంశస్థుల కోసం ఈ చీరలను తయారు చేసేవారు. అందమైన పువ్వుల డిజైన్లతో పాటు రాజసం ఉట్టిపడేలా ఉండే ఈ చీరలు నేటితరం అమ్మాయిల అభిరుచులకు తగ్గట్టు రూపుదిద్దుకుంటున్నాయి. వీటిలో జంగ్లా, తానోచీ, టిష్యూ, బుటీదార్, కట్ వర్క్, వస్కత్ జందానీతో పాటు అనేక రకాలున్నాయి. డిజైన్ల ఆధారంగా వీటిని డివైడ్ చేశారు. ఇందులో వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి. పెళ్లిళ్లు.. పండుగలు.. ఇతర ఫంక్షన్లు ఎప్పుడైనా వీటిని కట్టుకోవచ్చు.

కంచి పట్టు..

కంచి పట్టు..

పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ చీరలపైనే ఎక్కువ ఫోకస్ పెడతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే అన్నింటికంటే ముందుగా కంచి పట్టుకు తొలి ప్రాధాన్యత ఇస్తారు. బంగారపు జరీతో నేసే ఈ చీరకు కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. తమిళనాడులోని కాంచీపురంలో తయారయ్యే ఈ చీరల అంచుల్లో టెంపుల్ డిజైన్ కచ్చితంగా ఉంటుంది. కంచి పట్టు చీరలు నూలుతో తయారవుతాయి. కాబట్టి వీటిని ఎప్పుడైనా కట్టుకోవచ్చు. ఇవి ఆధునిక హంగులను అద్దుకుంటున్నాయి. ప్రస్తుతం కాంచీవరం సిల్క్ శారీస్ అని పిలుస్తారు.

చెట్టినాడ్..

చెట్టినాడ్..

ఒకప్పుడు ఇలాంటి చీరలను ఎవ్వరూ ఎక్కువగా ఇష్టపడేవారు కాదు. కానీ ఇటీవలి కాలంలో చాలా మంది అమ్మాయిలు చెట్టినాడు చీరలను కట్టుకోవడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతున్నారు. తేలికగా, ట్రెండీగా ఉండే ఈ చీరలు మిగిలిన వాటితో కంపేర్ చేస్తే చాలా స్పెషల్ గా ఉంటాయి. వీటిని ఎక్కువగా కాటన్ తో తయారు చేస్తారు. ఈ చీరలు చాలా ట్రెండీగా ఉంటాయి.

మైసూర్ సిల్క్..

మైసూర్ సిల్క్..

కర్నాటక రాష్ట్రంలోని మైసూరు సిల్క్ రాజదర్భానికి ప్రతీకగా నిలుస్తోంది. ఈ చీరలు చాలా సున్నితమైన ఫ్యాబ్రిక్ తో తయారవుతాయి. ఇవి కట్టుకుంటే చాలా మందికి రిచ్ లుక్ వస్తుంది. ఈ జరీ చీరలు చాలా లైట్ గా ఉంటాయి. అందుకే చాలా మంది అమ్మాయిలు ఇలాంటి సిల్క్ శారీలను కట్టుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ చీరలను కట్టుకున్నప్పుడు, క్లీన్ చేసేటప్పుడు కొంచెం కేర్ ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే ఈ చీర చాలా సున్నితంగా ఉంటుంది. ఇది త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది.

నలుగురిలో భిన్నంగా..

నలుగురిలో భిన్నంగా..

మీరు ఏదైనా ఫంక్షన్ కు వెళ్లినప్పుడు అందరికంటే ప్రత్యేకంగా, సింపుల్ గా కనిపించాలంటే.. మీరు కాన్సెప్ట్ శారీ వంటి వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిల్యానీ పేస్టల్ షేడ్ లో రూపొందించిన చీరలతో మీ లుక్ మరింత పెరిగిపోతుంది.

English summary

These Actress sarees ideas best for brides

Here are these actress sarees ideas best for brides. Take a look
Story first published: Friday, August 20, 2021, 16:38 [IST]