Latest Updates
-
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్‌గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా..
Cannes 2023: జలకన్యలాంటి డ్రెస్సులో అదరగొట్టిన మృణాల్ ఠాకూర్
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 లో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ అదరగొట్టడానికి సిద్ధమైంది. వోడ్కా బ్రాండ్ గ్రే గూస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మృణాల్.. కేన్స్ రెడ్ కార్పెట్ కోసం బ్లాక్ కలర్ ఔట్ ఫిట్ ఎంచుకుంది. ఈ డ్రెస్సులోని కొన్ని పిక్స్ ను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేసింది. ఫెస్టివల్ డి కేన్స్ ఉత్సవాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ క్యాప్షన్ ఇచ్చింది.

కేన్స్ రెడ్ కార్పెట్ కోసం మృణాల్ ఠాకూర్ ధృవ్ కపూర్ తీర్చిదిద్దిన బ్లాక్ కలర్ ఔట్ ఫిట్ ధరించింది. బ్లింగ్ జాకెట్, లేస్ ప్యాంట్ తో వెరాండా బ్లాక్ స్విమ్ సూట్‌తో స్టైల్ చేసింది. క్రిస్టియన్ లౌబౌటిన్ కు చెందిన హీల్స్ ను వేసుకుని స్టైలిష్ గా కనిపించింది.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనడం మృణాల్ ఠాకూర్ కు ఇది తొలిసారి. కేన్స్ రెడ్ కార్పెట్ పై నడుస్తుండటం చాలా థ్రిల్లింగ్ గా ఉందంటూ మృణాల్ చెప్పుకొచ్చింది. ఇలాంటి ప్రతిష్టాత్మక వేదికపై గ్రే గూస్ వంటి ప్రముఖ బ్రాండ్ కు ప్రాతినిధ్యం వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు మృణాల్ పేర్కొంది.

దుల్కర్ సల్మాన్ సరసన సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది మృణాల్ ఠాకూర్. ఇందులో సీతగా, నూర్జహాన్ గా కనిపించి కుర్రాళ్ల మనసు దోచేసింది.

ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మృణాల్ కు కుర్రాళ్ల ఫుల్ క్రేజ్ వచ్చేసింది. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ తన అందాలతో ఇన్‌స్టా లో సెగలు పుట్టిస్తోంది.

ఈ అందాల భామ తన హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాలో హీటెక్కిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది మృణాల్.

ఏ తరహా డ్రెస్సు వేసుకున్నా ఈ బ్యూటీ గ్లామర్ షోకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అదిరిపోయే అందాలు ఆరబోస్తుంటే గోల గోల చేస్తున్నారు. చీర, లంగావోణీ, పరికిణి, లెహంగా లాంటి సాంప్రదాయ దుస్తుల్లోనూ పరువాలు ప్రదర్శిస్తోంది మృణాల్.



Click it and Unblock the Notifications
