Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Cannes 2023: దేశీ లుక్‌లో కేన్స్ రెడ్ కార్పెట్‌పై సారా అలీ ఖాన్
బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ మొదటిసారిగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 రెడ్ కార్పెట్ పై మెరిసింది. దేశీ లుక్‌లో సారా అదిరిపోయింది. పెద్ద గౌను, పెద్ద సైజు ఆభరణాలు ధరించి రెడ్ కార్పెట్‌పై హొయలు పోయింది. అబు జానీ - సందీప్ ఖోస్లాలు తీర్చిదిద్దిన ఐవరీ లెహంగాను సారా అలీ ఖాన్ ధరించింది. హెయిర్ బన్‌పైకి దుపట్టాతో పిన్ చేసింది.

మినిమల్ మేకప్‌తోనే కనిపించింది సారా. తన స్టేట్మెంట్ డ్రాప్ ఇయర్ రింగ్స్‌ను తన స్టైల్‌కు జోడించింది. పాస్టెల్ బ్లౌజ్, సిల్వర్ ఎంబెలిష్‌మెంట్ డిటైల్స్, ప్లంగింగ్ నెక్‌లైన్‌తో తన స్టైల్‌ను క్యారీ చేసింది.

వైట్ షేడ్స్‌లో ఎథినిక్ ప్యాటర్న్స్, ఫ్లోవీ స్కర్ట్‌తో అద్భుతంగా కనిపించింది. వైట్‌లో ఫీచరింగ్ డిటెయిల్స్, బార్డర్‌లో టల్లే డిటెయిల్స్ ఆకట్టుకున్నాయి.

కేన్స్ రెడ్ కార్పెట్‌పైకి వెళ్లే ముందు సారా అలీ ఖాన్ కొన్ని పిక్స్ ను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేసింది. 'యు కేన్స్ డు ఇట్' అంటూ సారా వాటికి క్యాప్షన్ ఇచ్చింది.

ఎల్లో ఎంబెడెడ్ స్టోన్స్‌తో మ్యాచింగ్ స్టేట్‌మెంట్ సిల్వర్ ఇయర్ రింగ్స్‌తో సారా చాలా స్టైల్‌గా కనిపించింది. ఒకవైపు డైమండ్ బ్రాస్‌లెట్ ధరించింది. హెయిర్ స్టైలిష్ట్ శాంకీ ఎవ్రస్ స్టైల్‌గా రూపొందించింది.

న్యూడ్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, బ్లాక్ కోహ్ల్, మాస్కరా-లాడెన్ ఐలాషెస్, కాంటౌర్డ్ చీక్స్, న్యూడ్ లిప్‌స్టిక్‌తో సారా తన లుక్ ను క్యారీ చేసింది.

సారా అలీ ఖాన్‌తో పాటు ఇంటర్నేషల్ క్రిటిక్స్ వీక్ జ్యూరీలో ఉన్న ఫిల్మ్ క్యూరేటర్, క్రిటిక్స్ మీనాక్షి షెడ్డే కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 76వ ఎడిషన్ మొదటి రోజు చీరలో కనిపించి ఆకట్టుకుంది.

కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్.. ఫ్రాన్స్ లోని కేన్స్‌లో సంవత్సరానికి ఒకసారి జరిగే ఫిల్మ్ ఫెస్టివల్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల కొత్త చిత్రాలను ఇక్కడ ప్రివ్యూ చేస్తారు.

ఈ ప్రీమియర్ షోలకు వచ్చే సెలబ్రిటీలు అద్భుతమైన ఔట్‌ఫిట్‌లతో రెడ్ కార్పెట్ పై హొయలు పోతారు. అలా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కాస్త ఫ్యాషన్ ఈవెంట్‌లా పేరు సంపాదించుకుంది. ఈ ఏడాది మే 16వ తేదీ నుండి మే 27 వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుంది.



Click it and Unblock the Notifications