Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Cannes Film Festival 2023: సైడ్ స్లిట్ డ్రెస్సులో కేన్స్‌లో అందాలు ఆరబోసిన ఈషా గుప్తా
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 అట్టహాసంగా ప్రారంభమైంది. బాలీవుడ్ నటి ఈషా గుప్తా, జన్నత్ 2 మూవీ స్టార్, కేన్స్ రెడ్ కార్పెట్ పై మొదటి సారి కనిపించి కవ్వించింది. భారత ప్రభుత్వ ప్రతినిధి బృందంలో భాగంగా ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరైంది ఈషా గుప్తా. జానీ డెప్ నటించిన 'జీన్నే డు బారీ' ప్రీమియర్ షో కోసం ఈషా వచ్చింది.

లైట్ పింక్ కలర్ థై హై డ్రెస్సులో అందాలు ఆరబోసింది బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా. అద్భుతంగా ఉన్న ఈ ఔట్ ఫిట్లో మరింత అద్భుతమైన అందాలు ఒలకబోసింది. మెడపై సున్నితమైన లేస్ డ్రెస్‌కు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి.

డిజైనర్ నికోలస్ జెబ్రాన్ తీర్చిదిద్దిన ఈ రొమాంటిక్ ఐవరీ- పింక్ గౌనులో ఈషా గుప్తా మెస్మరైజ్ చేసింది. ఫ్లోవీ గౌను దాదాపు నడుము వరకు ఉన్న స్లిట్ నుండి థైస్ షోతో ఆకట్టుకుంది. తెల్లని పూల డిజైన్ తో అలంకరించిన షీర్ నెక్‌లైన్ ఈషా కాలర్డ్ గౌనుకు మరింత అందాన్ని తెచ్చిపెట్టింది.

మినిమం మేకప్ తోనే తన స్టైల్ ను క్యారీ చేసింది ఈషా గుప్తా. సాఫ్ట్ పింక్ బ్లష్, న్యూడ్ లిప్స్, సటిల్ ఐ గ్లామ్‌తో స్టైల్‌ను క్యారీ చేసింది ఈ బాలీవుడ్ బ్యూటీ. లైట్ బన్ హెయిర్ స్టైల్‌తో పాటు చెవుల పక్క నుండి ఫ్రేమ్ చేసింది. డ్యాజ్లింగ్ ఇయర్‌రింగ్స్ అద్భుతంగా ఉన్నాయి. స్టేట్మెంట్ రింగ్స్, బ్లింగ్ హీల్స్ అన్నీ కలిపి కేన్స్ రెడ్ కార్పెట్ పై ఆకట్టుకునేలా కనిపించింది ఈషా గుప్తా.

కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్.. ఫ్రాన్స్ లోని కేన్స్‌లో సంవత్సరానికి ఒకసారి జరిగే ఫిల్మ్ ఫెస్టివల్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల కొత్త చిత్రాలను ఇక్కడ ప్రివ్యూ చేస్తారు. ఈ ప్రీమియర్ షోలకు వచ్చే సెలబ్రిటీలు అద్భుతమైన ఔట్‌ఫిట్‌లతో రెడ్ కార్పెట్ పై హొయలు పోతారు. అలా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కాస్త ఫ్యాషన్ ఈవెంట్‌లా పేరు సంపాదించుకుంది. ఈ ఏడాది మే 16వ తేదీ నుండి మే 27 వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుంది.(All Images: Instagram)




Click it and Unblock the Notifications