Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
Cannes 2023: సిల్వర్ ఔట్‌ఫిట్‌లో అదరగొట్టిన ఐశ్వర్య, డ్రెస్సు చూస్తే వావ్ అనాల్సిందే
ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా కేన్స్ రెడ్ కార్పెట్ పై ఐశ్వర్య రాయ్ అదరగొట్టేసింది. వావ్ అనిపించే డ్రెస్సు ధరించి అందరి చూపును తనవైపు తిప్పుకుంది. 21వ సంవత్సరం ఐశ్వర్య రాయ్ బచ్చన్ కేన్స్ రెడ్ కార్పెట్ పై తన అందాలు ఆరబోసింది. సిల్వర్ గౌనులో హుడ్, బ్లాక్ బో తో స్టైల్ చేసింది. సోఫీ కోచర్ తీర్చిద్దిదిన ఈ డ్రెస్సు వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

అల్యూమినియం, క్రిస్టల్స్ తో తయారు చేసిన సిల్వర్ సీక్విన్స్ తో ఈ డ్రెస్సును సోఫీ కోచర్ తీర్చిదిద్దింది. కేన్స్ క్యాప్సుల్ కలెక్షన్ నుండి లైట్ వెయిట్ అల్యూమినియంతో ఈ డ్రెస్సును తీర్చిదిద్దారు. సిగ్నేచర్ కార్సెట్, క్రిస్టల్స్ తో వర్క్ చేశారు.
వింగ్డ్ ఐలైనర్, రెడ్ లిప్స్ తో మేకప్‌ను క్యారీ చేసింది ఈ సీనియర్ బాలీవుడ్ బ్యూటీ. హెయిర్ ను లూజ్ గా వదిలేసింది. రెండు చేతుల వేళ్లకు రింగ్స్ ధరించింది. బ్లాక్ అండ్ సిల్వర్ డ్రెస్సులో ఐశ్వర్య అదిరిపోయింది.
హారిసన్ ఫోర్ట్ నటించిన ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ ప్రీమియర్ కోసం ఐశ్వర్య రాయ్ రెడ్ కార్పెట్ పై వాక్ చేసింది. ఐశ్వర్య రాయ్ దాదాపు 20 ఏళ్లకు పైగా కేన్స్ లో సౌందర్య ఉత్పత్తుల దిగ్గజం లోరియల్‌కు ప్రాతినిధ్యం వహిస్తోంది.
గత 21 ఏళ్లుగా ఐశ్వర్య రాయ్ ఫ్రాన్స్‌లోని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరవుతోంది. ప్రతి ఏటా అద్భుతమైన ఔట్‌ఫిట్‌లతో ఫ్యాషన ప్రియులను అలరిస్తోంది. 2022లో ఐశ్వర్య అద్భుతమై డ్రెస్సులో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై తన అందాలు ఒలకబోసింది. కస్టమ్ గౌరవ్ గుప్తా కోచర్ గౌనును ధరించింది. దీంతో పాటు డోల్సే & గబ్బానాకు చెందిన ఫ్లవర్ ఔట్‌ఫిట్‌లో అద్భుతంగా కనిపించింది.
కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్.. ఫ్రాన్స్ లోని కేన్స్‌లో సంవత్సరానికి ఒకసారి జరిగే ఫిల్మ్ ఫెస్టివల్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల కొత్త చిత్రాలను ఇక్కడ ప్రివ్యూ చేస్తారు. ఈ ప్రీమియర్ షోలకు వచ్చే సెలబ్రిటీలు అద్భుతమైన ఔట్‌ఫిట్‌లతో రెడ్ కార్పెట్ పై హొయలు పోతారు. అలా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కాస్త ఫ్యాషన్ ఈవెంట్‌లా పేరు సంపాదించుకుంది. ఈ ఏడాది మే 16వ తేదీ నుండి మే 27 వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుంది.



Click it and Unblock the Notifications