Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Cannes 2023: మెడలో బంగారు మొసలి, పింక్ కలర్ గౌనులో దేవకన్యలా ఊర్వశి రౌటేలా
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా అదిరిపోయే ఔట్ ఫిట్‌లో కనిపించింది. లార్జర్ దెన్ లైఫ్ పింక్ కలర్ గౌనులో దర్శనిమిచ్చి మైమరిపించింది. ఈ ఔట్ ఫిట్‌లో ఊర్వశి రౌటేలా నెక్‌లెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొసలి తరహాలో ఉన్న నెక్ లెస్ చాలా అందంగా, ఆకట్టుకునేలా ఉంది.

అందాల బ్యూటీ ఊర్వశి రౌటెలా తన స్టన్నింగ్ లుక్స్ తో అభిమానులను అలరించింది. పింక్ డ్రెస్సులో దేవకన్యలా మెరిసిపోయింది. ఊర్వశి తన మెడలో ధరించిన నెక్ లెస్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఎప్పుడూ తన ఔట్ ఫిట్‌తో మెస్మరైజ్ చేసే ఈ బ్యూటీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 లోనూ తన స్టైల్‌తో వార్తల్లో నిలిచింది. బంగారు మొసళ్లతో ఈ నెక్లెస్‌ను డిజైన్ చేశారు. రెండు మొసళ్లు తొకలతో పెనవేసుకుపోయి మెడలో వేలాడుతున్నట్లుగా ఉంది ఈ నెక్‌పీస్.

ఈ నెక్‌లెస్‌కు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ధరించింది. ఈ ఫెస్టివల్ కు సంబంధించిన తన ఫోటోలు, వీడియోలను ఊర్వశి తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. తన ఇన్‌స్టా గ్రామ్ పోస్టుకు 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ ఓపెనింగ్ అనే క్యాప్షన్ ఇచ్చింది.

ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కాగానే నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఈ ఔట్ ఫిట్‌లో దేవకన్యలా కనిపిస్తున్నావ్ కానీ ఆ మొసళ్ల నెక్‌లెస్ ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. నువ్వు అందంగా ఉన్నా.. ఆ బంగారు మొసళ్లు భయంకరంగా ఉన్నాయని మరొకరు కామెంట్ పెట్టారు. ఈ మొసళ్ల నెక్‌పీస్‌ను మెడలో వేసుకోవడానికి వికారంగా అనిపించడం లేదా మరొకరు ప్రశ్నించారు.

కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్.. ఫ్రాన్స్ లోని కేన్స్‌లో సంవత్సరానికి ఒకసారి జరిగే ఫిల్మ్ ఫెస్టివల్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల కొత్త చిత్రాలను ఇక్కడ ప్రివ్యూ చేస్తారు.
ఈ ప్రీమియర్ షోలకు వచ్చే సెలబ్రిటీలు అద్భుతమైన ఔట్‌ఫిట్‌లతో రెడ్ కార్పెట్ పై హొయలు పోతారు. అలా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కాస్త ఫ్యాషన్ ఈవెంట్‌లా పేరు సంపాదించుకుంది. ఈ ఏడాది మే 16వ తేదీ నుండి మే 27 వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుంది.



Click it and Unblock the Notifications