Latest Updates
-
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.! -
ప్రేమకు, పెళ్లికి జెన్ జీ యువత ఎందుకు దూరమవుతోంది? -
భాగస్వామి ఎంపిక విషయంలో పదే పదే తప్పు చేస్తున్నారా.. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే విషయాలివే.! -
మధ్యాహ్నం 12 లేదా 2 గంటలకే చెక్ ఇన్..హోటల్స్ ఫాలో అయ్యే రూల్ వెనుక అసలు కథ! -
బఠానీ, పెసరపప్పు కాంబినేషన్... ఈ సమోసా రుచి చూస్తే మళ్లీ మళ్లీ తింటారు! -
వ్యాయామం చేసటప్పుడు విపరీతంగా చెమట.. కొవ్వు కరిగిపోతుందని అస్సలు సంబరపడొద్దు.! -
ఉదయం లేవగానే ఒళ్లు నొప్పులు, జాయింట్స్ పట్టేస్తున్నాయా? -
పప్పులు నానబెట్టే పనిలేదు,రుబ్బే శ్రమలేదు..అటుకులు,బంగాళదుంపలతో క్షణాల్లో కరకరలాడే అప్పడాలు.. -
ప్రెగ్నెన్సీలో చర్మం ఎందుకు నల్లబడుతుందో తెలుసా.. పిగ్మెంటేషన్‌ను ఇలా పోగొట్టుకోండి.! -
ఈ 5 రాశుల వారికి నేడు అదృష్టం.. శివయోగం ప్రభావంతో కాసుల వర్షం ఖాయం!
Cannes 2023: రెడ్ కార్పెట్‌పై బ్లూ లిప్స్‌తో ఊర్వశి రౌటేలా, ఐష్ గుర్తొచ్చిందంటూ కామెంట్లు
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 లో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌటేలా తన ఔట్‌ఫిట్లతో ఫ్యాషన్ ప్రియులను అలరిస్తోంది. పింక్ కలర్ టల్లే గౌనులో దేవకన్యలా కనిపించి మెడలో మొసలి తరహా నెక్‌లెస్ తో ఆకట్టుకుంది ఊర్వశి. గోల్డ్ కలర్ లో ఉన్న ఈ నెక్‌పీస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒకవైపు దేవకన్య లాంటి డ్రెస్సు, మెడలో మాత్రం అలిగేటర్స్ నెక్‌లెస్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి. తాజాగా వైట్ అండ్ బ్లూ కలర్ గౌనులో కనిపించి ఊర్వశి.. మరోసారి విశేషంగా ఆకట్టుకుంది.

వైట్ అండ్ బ్లూ కలర్ గౌను ధరించిన ఊర్వశి రౌటేలా.. పెదాలకు బ్లూ కలర్ లిప్ స్టిక్ తో కనిపించి ఆకట్టుకుంది. తన ఔట్‌ఫిట్ కు మ్యాచింగ్ అయ్యేలా లిప్ షేడ్ క్యారీ చేయడంతో ఊర్వశి పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఊర్వశి రౌటేలా లుక్స్ చూసిన చాలా మంది బాలీవుడ్ సీనియర్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ ను గుర్తు చేశావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కేన్స్ ఫెస్టివల్ అనగానే ఇండియన్స్ కు గుర్తొచ్చే పేరు ఐశ్వర్య రాయ్. ఈ మత్తు కళ్ల సుందరి 21 ఏళ్ల నుండి కేన్స్ రెడ్ కార్పెట్‌పై తన అందాలు ఆరబోస్తోంది. ఆకట్టుకునే దుస్తులతో అలరిస్తూనే ఉంది.

2016 లో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా ఐశ్వర్య రాయ్.. ఫ్లోరల్ గోల్డ్ షిమ్మెరింగ్ గౌన్ ధరించింది. ఆఫ్ షోల్డర్ గౌనులో అద్భుతంగా కనిపించింది. ఈ సమయంలో ఐష్.. తన పెదాలకు పర్పుల్ కలర్ లిప్ షేడ్ వేసుకుంది. అప్పట్లో ఈ పిక్స్ ఇంటర్నెట్ లో హల్‌చల్ చేశాయి. పర్పుల్ లిప్ షేడ్ వేసుకోవడంతో సోషల్ మీడియా ఐశ్వర్యను ట్రోల్ చేసింది. అలా ఇంటర్నెట్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది ఐష్.

ఇప్పుడు ఊర్వశి రౌటేలా.. అప్పటి ఐశ్వర్ లుక్ ను గుర్తుకు తెచ్చేలా బ్లూ లిప్ షేడ్ ధరించడంతో సోషల్ మీడియా అప్పటి ఐష్ లుక్ గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. ఐష్ నుండి ఇన్‌స్పైర్ అయ్యావా అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఐశ్వర్యను గుర్తుకు తెచ్చావ్ అని మరొకరు కామెంట్ పెట్టారు. ఐష్ కు నివాళిగా ఇలా రెడీ అయ్యావా అని మరొకరు ప్రశ్నించారు.

కాగా, ఈ వైట్ అండ్ బ్లూ కలర్ గౌనులో ఊర్వశి తన అందాలు ఆరబోసి ఆకట్టుకుంది. ఆఫ్ షోల్డర్ గౌను నుండి ఎద అందాలతో మైమరిపించింది. ఎగిసపడే యవ్వన సంపదతో హాట్ గా కనిపించింది. ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ మూవీ ప్రీమియర్ కోసం ఊర్వశి కేన్స్ రెడ్ కార్పెట్ పై హొయలొలికించింది.
కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్.. ఫ్రాన్స్ లోని కేన్స్‌లో సంవత్సరానికి ఒకసారి జరిగే ఫిల్మ్ ఫెస్టివల్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల కొత్త చిత్రాలను ఇక్కడ ప్రివ్యూ చేస్తారు. ఈ ప్రీమియర్ షోలకు వచ్చే సెలబ్రిటీలు అద్భుతమైన ఔట్‌ఫిట్‌లతో రెడ్ కార్పెట్ పై హొయలు పోతారు. అలా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కాస్త ఫ్యాషన్ ఈవెంట్‌లా పేరు సంపాదించుకుంది. ఈ ఏడాది మే 16వ తేదీ నుండి మే 27 వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుంది.



Click it and Unblock the Notifications