Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
Cannes 2023: ఈకల డ్రెస్సులో ఊర్వశి రౌటేలా, ఫీనిక్స్ లాంటి లుక్
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా ఈ ఏడాది కేన్స్ ఫిల్స్ ఫెస్టివల్ లో వార్తల్లో నిలుస్తోంది. ఈ ఏడాది కేన్స్ రెడ్ కార్పెట్ పై ఇప్పటి వరకు నాలుగు సార్లు హొయలొలికించింది. మొదటి నుండి అదిరిపోయే ఔట్‌ఫిట్స్‌తో ఈ బ్యూటీ వార్తల్లో నిలుస్తోంది. మొదటి రోజు పిక్ కలర్ గౌను ధరించి మెడలో బంగారు మొసళ్ల నెక్‌లెస్ వేసుకుంది. తర్వాత వైట్ అండ్ బ్లూ కలర్ గౌను ధరించి బ్లూ కలర్ లిప్‌షేడ్‌తో ఆకట్టుకుంది.

తాజాగా ఈ హాట్ బ్యూటీ మరో విచిత్రమైన లుక్‌లో కనిపించింది. క్లబ్ జీరో మూవీ ప్రీమియర్ కోసం కేన్స్ రెడ్ కార్పెట్ పై హొయలొలికించిన ఊర్వశి రౌటేలా.. గ్రీన్ కలర్ ఫీదర్ డ్రెస్సులో కనిపించి ఆకట్టుకుంది. ఈకలతో తీర్చిదిద్దిన ఈ డ్రెస్సులో ఊర్వశి ఫ్యాషన్ ప్రియులను ఆకర్షించింది.
పూర్తిగా రెక్కలతో ఈ ఔట్ ఫిట్ ను డిజైన్ చేశారు. రెండు రెక్కలుగా కనిపించేలా డ్రెస్ ఉంది. గ్రీన్ కలర్ ఈకలతో అచ్చంగా ఫీనిక్స్ పక్షిలా కనిపించింది ఊర్వశి రౌటేలా. తలపై కూడా రెక్కల ఈకలతో తయారు చేసిన ఓ హ్యాట్ పెట్టుకుంది. వెయిర్డ్ లుక్ లో వెరైటీగా కనిపించింది ఈ బ్యూటీ.
నెక్ ను న్యూడ్‌గా వదిలేసింది. చెవులకు డాంగ్లింగ్ ఇయర్ రింగ్స్ ధరించింది. బోల్డ్ ఐ మేకప్ ప్లం లిప్ షేడ్, బ్లష్డ్ చీక్స్ తో మినిమల్ మేకప్ తో స్టైల్‌ను క్యారీ చేసింది.
రెండు చేతులకు రింగ్స్ పెట్టుకుంది.
కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్.. ఫ్రాన్స్ లోని కేన్స్‌లో సంవత్సరానికి ఒకసారి జరిగే ఫిల్మ్ ఫెస్టివల్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల కొత్త చిత్రాలను ఇక్కడ ప్రివ్యూ చేస్తారు. ఈ ప్రీమియర్ షోలకు వచ్చే సెలబ్రిటీలు అద్భుతమైన ఔట్‌ఫిట్‌లతో రెడ్ కార్పెట్ పై హొయలు పోతారు. అలా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కాస్త ఫ్యాషన్ ఈవెంట్‌లా పేరు సంపాదించుకుంది. ఈ ఏడాది మే 16వ తేదీ నుండి మే 27 వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుంది.



Click it and Unblock the Notifications