Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
Celebrity Wedding 2022: 2022లో పెళ్లి పీటలెక్కిన సినీ తారలు.. ఎలాంటి దుస్తులు ధరించారో చూడండి
2022 ఏడాదిలో పలువురు సినీ సెలబ్రిటీలు పెళ్లి పీటలెక్కారు. సెలబ్రిటీలు తమ వివాహ వేళ ధరించిన సాంప్రదాయ దుస్తులు ఫ్యాషన్ ప్రియులను మంత్రముగ్దులను చేశాయి. చీరలు, లెహంగాలు ధరించిన సినీ తారలు, మంచి డిజైనర్ ఆభరణాలతో సూపర్ స్టన్
2022 ఏడాదిలో పలువురు సినీ సెలబ్రిటీలు పెళ్లి పీటలెక్కారు. అలియా భట్-రణబీర్ కపూర్, నయనతార-విఘ్నేష్ శివన్, మౌని రాయ్-సూరజ్ నంబియార్, రిచా చద్దా- అలీ ఫజల్, హన్సిక మోత్వానీ- సోహైల్ సహా ఇంకా పలువురు సినీ తారలు మూడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. సెలబ్రిటీలు తమ వివాహ వేళ ధరించిన సాంప్రదాయ దుస్తులు ఫ్యాషన్ ప్రియులను మంత్రముగ్దులను చేశాయి. చీరలు, లెహంగాలు ధరించిన సినీ తారలు, మంచి డిజైనర్ ఆభరణాలతో సూపర్ స్టన్నింగ్ లుక్‌లో కనిపించారు.

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న దృష్ట్యా సినీ సెలబ్రిటీలు తమ పెళ్లిళ్ల వేళ ధరించిన దుస్తులు, నగలు ఎలా ఉన్నాయి.. తమ వెడ్డింగ్ ఫ్యాషన్ ఎలా మైమరిపించిందో ఓ లుక్కేద్దాం.
అలియాభట్ - రణబీర్
2022 ఏప్రిల్ 14వ తేదీన అలియా భట్ - రణబీర్ కపూర్ కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి వేళ అలియా భట్, రణబీర్ కపూర్ తెలుపు రంగు దుస్తుల్లో మెరిసిపోయారు. సవ్యసాచి డిజైన్ చేసిన చీరలో అలియా, రణబీర్ కనిపించారు. పీచు, పాస్టెల్ థీమ్‌తో పెళ్లి వేడుక నిర్వహించారు.
ఆర్గాన్జా ఫ్యాబ్రిక్‌తో చేసిన ఐవరీ షేడ్ చీరను ధరించింది అలియా. అన్‌కట్ డైమండ్లను ధరించింది. హ్యాండ్ థ్రెడ్ ముత్యాలు వేసుకుంది.
నయనతార - విఘ్నేష్ శివన్
నయనతార, విఘ్నేష్ శివన్ జూన్ 9వ తేదీన పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. నయనతార మోనికా, కరిష్మా తీర్చిదిద్దిన డైజనర్ సారీ ధరించింది. లేస్, సీక్విన్ ఎంబ్రాయిడరీ చీర అందాన్ని రెట్టింపు చేసింది.
మ్యాచింగ్ ఫ్లోర్ స్వీపింగ్ ట్రైన్, ఎమెరాల్డ్, డైమండ్ లేయర్డ్ నెక్లెస్ ధరించింది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, మాంగ్ టికా, బ్రేస్‌లెట్స్, రింగ్స్, హీల్స్ మంచి లుక్‌ను తీసుకువచ్చాయి.
హన్సిక - సోహైల్
నటి హన్సిక మోత్వాని తన మిత్రుడు, ప్రియుడు అయిన సోహైల్ కథురియాను వివాహమాడింది. జైపూర్‌లోని ముందోటా ఫోర్ట్‌లో వీరి పెళ్లి 2022 డిసెంబర్ 4వ తేదీన జరిగింది.
పెళ్లి వేడుక కోసం హన్సిక మోత్వాని ఎరుపు రంగు లెహంగా ధరించింది. దీనిపై హెవీ ఎంబ్రాయిడరీ రిచ్ లుక్‌ను తీసుకువచ్చింది. క్లాసిక్ హెయిర్ బన్, ఇయర్ రింగ్స్, నాత్, చోకర్ నెక్లెస్, బ్రాస్‌లెట్‌లు ధరించింది.
నిక్కీ గల్రానీ - ఆది పినిశెట్టి
నిక్కీ గల్రానీ, ఆది పినిశెట్టి 2022 ఏడాదిలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ప్రేమ పక్షలు 2022 మే 18వ తేదీన వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.
పీచ్ కలర్ బార్డర్ వచ్చిన హాఫ్ వైట్ శారీ కట్టుకుంది నిక్కీ గల్రానీ. వెరీ మినిమల్ ఆభరణాలతో మంచి కూల్ లుక్‌లో కనిపించింది నిక్కీ.
రిచా చద్దా - అలీ ఫజల్
రిచా చద్దా, అలీ ఫజల్ 2022 అక్టోబర్‌లో వివాహం చేసుకున్నారు. అబు జానీ సందీప్ ఖోస్లా తీర్చిద్దిన ట్రెడిషనల్ షరారాలో రిచా చద్దా కనిపించింది. దుపట్టా తన లుక్‌ను రిచ్‌గా మార్చింది.
రిచా చద్దా బ్రౌన్ న్యూడ్ లిప్, బ్రౌన్ షాడో, మస్కారా పెట్టుకుంది. క్లాసిక్ హెయిర్ బన్, సాంప్రదాయ పాసా, ఇయర్ రింగ్స్, నాత్, చోకర్ నెక్లెస్, బ్రాస్‌లెట్‌లు ధరించింది.
మౌనీ రాయ్ - సూరజ్ నంబియార్
మౌనీ రాయ్ తన ప్రియుడు సూరజ్ నంబియార్‌ను వివాహం చేసుకుంది. 2022 జనవరిలో వీరి పెళ్లి జరిగింది. వీరి పెళ్లి బెంగాలీ, మలయాళీ సాంప్రదాయంలో జరిగింది.
బెంగాలీ సాంప్రదాయంలో మౌనీ రాయ్ సవ్యసాచి తీర్చిదిద్దిన రెడ్ కలర్ లెహంగా ధరించగా.. మలయాళీ సాంప్రదాయంలో జరిగిన వేడుక సమయంలో మౌనీ రాయ్ తెలుపు రంగు గరడ్ పట్టు చీరను ధరించింది. బంగారు ఆభరణాలు ధరించింది.



Click it and Unblock the Notifications