Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
వైట్ హౌస్ లోకి అలాంటి బట్టలతోనా? ఉక్రెయిన్ అధ్యక్షుడి డ్రెస్ డిజైనర్ ఎవరో తెలుసా, భారీగా ఆర్డర్స్
గతవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అమెరికాలో పర్యటించారు. ఆ సమయంలో ఆయన వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో భేటీ అయ్యారు. ఆ సమయంలో ఇరువురు దేశాధినేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో జరిగిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ట్రంప్ తో భేటీ సమయంలో జెలెన్ స్కీ వేసుకున్న డ్రెస్ పై పెద్ద చర్చ జరిగింది. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వైట్ హౌస్‌లోకి వస్తుండగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలకిరిస్తూ..జెలెన్ స్కీ దుస్తులపై వ్యాఖ్యానించాడు. ఈ రోజు అందంగా ముస్తాబయ్యారు ట్రంప్ జెలెన్ స్కీతో అన్నారు.
జెలెన్ స్కీ..బూట్లు, నల్ల కార్గోప్యాంటు, మూడు బటన్లు ఉన్న లాంగ్ స్లీవ్ పోలో చొక్కా మీద ఉక్రెనియన్ జెండాలో ఉండే త్రిశూలం వంటి చిహ్నలతో కూడిన డ్రెస్ ని ధరించారు. అగ్రరాజ్య అధ్యక్షుడితో అది కూడా వైట్ హౌస్ లో భేటీ అవుతున్నప్పుడు డ్రెస్ కోడ్ పాటించాలి కదా,ఇలా టీషర్టులు వేసుకొని ఇక్కడికి రావడం అమెరికన్లను అవమానించడమే అంటూ అక్కడి మీడియా ప్రతినిధులు జెలెన్ స్కీపై ఫైర్ అయ్యారు. అయితే యుద్ధం ముగిసేవరకు తాను సూటు వేసుకోనని, ఆ తర్వాత మీ కంటే మంచిది లేదా తక్కువ ఖరీదుదైనా వేసుకుంటా,స్వేచ్ఛను కోరుకుంటున్న తన దేశానికి ప్రతికగా ఈ వస్త్రధారణ అంటూ వైట్ హౌస్ లో మీడియా ప్రతినిధులకు జెలెన్ స్కీ ఘాటుగా సమాధామిచ్చారు. ఈ క్రమంలో ట్రంప్ తో భేటీ సమయంలో జెలెన్ స్కీ ధరించిన దుస్తుల ప్రత్యేకత, వాటి డిజైనర్ గురించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు చాలా మంది గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు.

ట్రంప్ తో భేటీలో జెలెన్ స్కీ వేసుకున్న డ్రెస్ ను డిజైన్ చేసిన వ్యక్తి పేరు ఎల్విరా గసనోవా. ఈమె ఉక్రేనియన్ డిజైనర్. ఆమె డామిర్లి బ్రాండ్ పురుషుల దుస్తుల కలెక్షన్ నుంచి పోలో చొక్కా, ప్యాంటుని ధరించారు జెలెన్ స్కీ. ఎల్విరా.. జెలెన్‌స్కీ కోసం ఈ పత్యేక వెర్షన్‌ను డిజైన్ చేసింది. దీన్ని డిజైనర్ 1991లో ఉక్రెయిన్ స్వీకరించిన కోట్ ఆఫ్ ఆర్మ్స్ త్రిశూలం ఉన్న షీల్డ్ ఆధారంగా రూపొందించింది. ట్రంప్ తో భేటీలో జెలెన్ స్కీ ఆ డ్రెస్ వేసుకోవడాన్ని ఎల్విరా సమర్థించింది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ కూడా పెట్టింది.
ఎల్విరా తన ఇన్ స్టా పోస్ట్ లో.. " ఉక్రెయిన్ భవిష్యత్తు కోసం పోరాటం సాగిస్తున్నా తమ ధైర్యానికి గుర్తుగా జెలెన్‌స్కీ సూట్‌ని కాకుండా ఉక్రెయిన్ బ్రాండ్ డామిర్లి పోలో చొక్కాను ఎంచుకున్నారు. ఇది ఆధునిక యోధుని యూనిఫాం. స్వేచ్ఛ కోసం నిలబడే దేశం అజేయమైన ఆత్మకు చిహ్నం. ఫ్యాషన్ సౌందర్యాన్ని అధిగమించి.. ధిక్కరణ, విజయంపై విశ్వాసానికి శక్తిమంతమైన చిహ్నంగా, స్వరంగానూ ఈ వస్త్రధారణ ఉంటుంది" అని తెలిపింది.

"జెలెన్స్కీ ధరించిన అల్లిన డామిర్లి పోలో షర్ట్ అమ్మకాలు ఈ వారాంతంలో పెరిగాయని ఎల్విరా తెలిపారు ఇప్పుడు చాలా మంది ఈ చొక్కాను కొనుగోలు చేస్తున్నారు, దీని ధర 215 యూరోలు. అమెరికా నుండి తమకు చాలా ఆర్డర్లు వస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఎల్విరా 2013లో డొనెట్స్క్‌లో తన బ్రాండ్‌ని స్థాపించారు. దీన్ని ఆమె ఇద్దరు సభ్యులతో ప్రారంభించింది. జెలెన్స్కీ బీరువాలో 99 శాతం ఆమె డిజైన్లే ఉన్నాయని అంచనా. ఉక్రెయిన్ ప్రథమ మహిళ ఒలెనా జెలెన్‌స్కీ తరచుగా ఈ బ్రాండ్ బట్టలనే ధరిస్తుంటారు. నిజానికి ఎల్విరా దంత వైద్యురాలు అవ్వాలనుకుంది. అయితే అనుకోకుండా డోనెట్స్క్ ఫ్యాషన్ డేలో పాల్గొంది. అక్కడ నుంచి ఫ్యాషన్ డిజైనర్‌గా మారాలని ఫిక్స్ అయ్యి ఈ రంగంలోకి వచ్చింది. ఆమె తొలి ఫ్యాషన్ షో నవంబర్ 01, 2013న జరిగింది. అలా ఆమె ఫ్యాషన్ డిజైనర్ ప్రస్థానం ప్రారంభమైంది.
జెలెన్స్కీ వార్డ్‌రోబ్‌లో 99 శాతం ఆమె డిజైన్లే ఉన్నాయని అంచనా వేసిన గసనోవా, ఉక్రేనియన్ సైనికులకు సంఘీభావం మరియు గౌరవానికి చిహ్నంగా, మూడేళ్ల క్రితం రష్యన్ దండయాత్ర తర్వాత జెలెన్స్కీ సూట్ ధరించలేదని అన్నారు.



Click it and Unblock the Notifications