Latest Updates
-
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.!
అమ్మాయిలు.. సంక్రాంతికి ఈ డ్రెస్‌లు వేసుకుంటే మీ అంత అండగా ఎవరూ ఉండరు! అదిరిపోతారంతే!
సంక్రాంతి అంటే సరదాల పండుగ. రంగుల పండుగ. ఎక్కడెక్కడో ఉండే వ్యక్తులంతా ఆ రోజున పల్లెటూరికి చేరి తల్లిదండ్రులతో పాటు బంధుమిత్రులతో కలిసి పండగను చేసుకుంటారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ పండగను ఎంతో వైభవంగా ఘనంగా నిర్వహించుకుంటారు. అలాంటి ప్రత్యేకమైన పండగ రోజున అందంగా స్టైలిష్‌గా కనిపించాలని అందరూ అనుకుంటారు. అందుకోసం వారం రోజుల ముందు నుంచే షాపింగ్ చేసేస్తుంటారు. అయితే పండగకు ఎలాంటి బట్టలు వేసుకోవాలి అని కొందరికి తోచదు. అందుకే మీకోసం కొన్ని డ్రెస్సింగ్ ఐడియాస్ ఇక్కడ ఇచ్చాము. అవేంటో చూడండి..
పట్టుచీర
పండగ ఏదైనా సంప్రదాయబద్ధమైన విధానంలో చేసుకుంటే చాలా మంచిది. కనీసం పండగ రోజున అయినా సాంప్రదాయకంగా కనిపిస్తే చాలా బాగుటుంది. సాంప్రదాయ కట్టు అంటే గుర్తుకొచ్చేది పట్టుచీర. ఈ సంక్రాంతికి మీరు కూడా పట్టు చీర వేసుకుంటే అందరిలో మీరే స్పెషల్‌గా కనిపిస్తారు. బోర్డర్లు, జారీ వర్క్ ఉన్న పట్టు చీరలు చాలా అందంగా ఉంటాయి.

లంగా వోణి
సాంప్రదాయకంగా కనిపించాలంటే కేవలం పట్టుచీరలు మాత్రమే కాదు. లంగా ఓణీలు కూడా చాలా బాగుంటాయి. లంగా ఓణీలు కూడా సాంప్రదాయకమైన లుక్‌ను క్రియేట్ చేస్తాయి. అయితే రంగుల పండగ అయిన సంక్రాంతి నాడు రంగు రంగుల ఓణీలు వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తారు. అందరిలో చాలా స్పెషల్‌గా కనిపిస్తారు. అలాగే పండగలో మీరే షైన్ అవుట్ అవుతారు.
మోడరన్ లుక్ కోసం కుర్తీ విత్ ప్లాజో
పండగకు ప్రతి ఒక్కరికీ సంప్రదాయకంగానే కాదు మోడ్రన్‌గా కూడా కనిపించాలని ఉంటుంది. అందుకోసం కుర్తీ విత్ ప్లాజో వేసుకుంటే చాలా మోడ్రన్‌గా కనిపిస్తారు. అలాగే చాలా స్టైలిష్‌గా కనిపిస్తారు. అలాగే చాలా సుఖవంతంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది.
లెహంగా
పండగ అంటేనే లెహంగా. లెహంగా అంటేనే పండగ. పండగ ఏదైనా లెహంగా వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తారు. లెహంగా వేసుకోవడం వల్ల ఒక ప్రత్యేకమైన వైబ్ వస్తుంది. పండగలో అందరికంటే మీరే ఒక స్పెషల్ వ్యక్తిగా కనిపిస్తారు. ఈసారి సంక్రాంతికి మీరూ లెహంగా వేసుకొని ట్రై చేయండి. అందరిలో మీరే షైన్ అవుట్ అవ్వకపోతే నన్ను అడగండి.
జ్యువెలరీ:
పట్టుచీర వేసుకుంటే దానిపై నెక్లెస్ సెట్ చాలా బాగా సూట్ అవుతుంది. అలాగే ఎలాంటి డ్రెస్ వేసుకున్నా దానికి అదనపు అందాన్ని జుమ్కాలు జోడిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక ప్రత్యేకమైన ఆకర్షణీయత మీకు అందిస్తుంది. బంగారు నగలు కూడా ఎలాంటి డ్రెస్ వేసుకున్నా వాటికి బాగా సెట్ అవుతాయి. దీంతో పాటు పట్టు చీర వేసుకుంటే దానికి పట్టుకుచ్చు వేసుకోవడం చాలా అందాన్ని జోడిస్తుంది. అలాగే బ్రేడ్స్ వేసుకోవడం వల్ల చాలా కంఫర్టబుల్ అండ్ స్టైలిష్‌గా ఉంటారు. మీరు ఓపెన్ హెయిర్‌తో ఫ్లవర్స్ అటాచ్ చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications