Latest Updates
-
రోడ్ సైడ్ టిఫిన్ సాంబార్..ఏం రుచిరా బాబు కేక అంతే..10 నిమిషాల్లో మీ ఇంట్లో చేసుకోండిలా.. -
కన్ను అదురుతుందని ఇలా చేస్తున్నారా.. అసలు కారణం తెలిస్తే ఈ తప్పులు చేయరు.! -
డాక్టర్ సలహా..షుగర్ ఉన్నవారు తప్పకుండా తినాల్సిన 3 కూరగాయలు, 3 పండ్లు.. -
చుక్క నూనె లేకుండా రెస్టారెంట్ స్టైల్ మలాయ్ చికెన్..సాఫ్ట్ గా, జ్యూసీగా చేయండిలా -
చితి మంటల్లో కూడా కాలిపోని శరీర భాగం ఇదే..99శాతం మందికి తెలియని నిజం! -
వీకెండ్ స్పెషల్..గొంతుకు హాయినిచ్చే పెప్పర్ చికెన్ గ్రేవీ..పూరీ,చపాతీ,అన్నం దేనికైనా అదుర్స్ -
పెద్దలు కుదిర్చిన పెళ్లి: మీ కాబోయే భాగస్వామి ఒత్తిడితో పెళ్లికి ఒప్పుకున్నారా? ఇలా కనిపెట్టండి! -
విటమిన్లు, ఐరన్ పుష్కలం..చక్కెర,బెల్లం లేకుండానే సూపర్ టేస్టీ డ్రై ఫ్రూట్ రోల్ చేసుకోండిలా -
బరువు తగ్గాలా? ఈ ఆయుర్వేద చిట్కాతో కొవ్వును కొవ్వొత్తిలా కరిగించొచ్చు! -
క్యాల్షియం, ప్రొటీన్ల ఖజానా..ఎముకలకి ఉక్కులాంటి బలాన్నిచ్చే రాగి కిచిడీ
Fashion Year Ender 2022: అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో హొయలు ఒలకబోసిన నటీమణులు
Fashion Year Ender 2022: 2022 సంవత్సరంలో వివిధ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో భారతీయ నటీమణులు రెడ్ కార్పెట్‌పై డిజైనర్ డ్రెస్సుల్లో కనిపించి కనువిందు చేశారు. కొందరు రెడ్ కార్పెట్‌కే అందాన్ని తీసుకువచ్చారు. తమ అత్యుత్తమ ప్రదర్శన చూపరులను సైతం మంత్రముగ్దులను చేసింది. కస్టమ్ సవ్యసాచి కోచర్ చీరలో తొలి జ్యూరీ సభ్యురాలు దీపికా పదుకొణె నుండి మార్క్ బమ్‌గార్నర్ సైడ్ స్లిట్ గౌనులో అదితి రావు హైదరీ వరకు చాలా మంది రెడ్ కార్పెట్‌పై హొయలు ఒలకబోశారు.

2022లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అందచందాలతో అదిరిపోయే డ్రెస్సులతో హొయలు పోయిన ఉత్తమ నటీమణుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దీపికా పదుకొనే
లోరియల్ బ్రాండ్ అంబాసిడర్‌గా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెగ్యులర్ అయిన తర్వాత దీపికా పదుకొనే ఈ సంవత్సరం ప్రతిష్టాత్మక జ్యూరీ సభ్యురాలిగా చేరింది. బెంగాల్ పులి నుండి ప్రేరణ పొందిన సవ్యసాచి తీర్చిదిద్దిన చీరలో కనిపించి భారతీయ మూలాలకు ప్రాతినిధ్యం వహించింది దీపికా పదుకొనే.
కస్టమ్ రెడ్ లూయిస్ వ ిట్టన్ గౌను, సవ్యసాచి ప్యాంట్ సూట్, కస్టమ్ అబు జానీ సందీప్ ఖోస్లా రఫ్డ్ల్ చీర, కస్టమ్ ఐషి స్టూడియో తీర్చిదిద్దిన ఆరెంజ్ గౌను ఆమె బెస్ట్ లుక్‌లో కొన్ని.

ఐశ్వర్యరాయ్ బచ్చన్
ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రముఖ సభ్యురాలైన ఐశ్వర్యరాయ్ బచ్చన్ తన ఫ్యాషన్ టేస్టును మరోసారి ప్రపంచానికి చూపించింది. కస్టమ్ డోల్స్, గబ్బానా గౌను, హాట్ పింక్ వాలెంటినో మోనోక్రోమ్ ప్యాంట్ సూట్, పింక్ స్కల్ప్చర్డ్ గౌరవ్ గుప్తా కోచర్ గౌనులో ఐశ్వర్యరాయ్ మెరిసిపోయింది.

సోనమ్ కపూర్
మాతృత్వాన్ని ఫ్యాషన్‌ను ఎలా మిక్స్ చేయాలో సోనమ్ కపూర్‌కు తెలిసినంతగా మరెవరికి తెలియదనుకుంటా. రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం జెడ్డాలో తన విహారయాత్రలో సోనమ్ తన ఫ్యాషన్ గేమ్‌ను మరోసారి చూపించింది.

ఆదితి రావ్ హైదరీ
ఆదితి రావ్ హైదరీ నిస్సందేహంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తన తొలి ప్రదర్శనలో తన సార్టోరియల్ ఎంపికలతో అందరి దృష్టిని ఆకర్షించింది.
మార్క్ బమ్‌గార్నర్ సైడ్ స్లిట్ గౌను, భారీ స్లీవ్‌లతో అవారో ఫిగ్లియో జంప్ సూట్, మగ్లర్ తీర్చిదిద్దిన ఎల్బీడీ, నాటన్ కోచర్ షర్ట్, హిప్ ప్యాంట్, సవ్యసాచి ఐవరీ ఆర్గాన్జా చీర, వాలెంటినో కోర్డ్ సెట్, అన్నా కినో రొంపర్, సవ్యసాచి టల్లే పోర్ట్రెయిట్ గౌను ఈ సంవత్సరం ఆదితి రావు ధరించి ఉత్తమ ఫ్యాషన్ వేర్స్.

పూజా హెగ్డే
ఈ సంవత్సరం పూజా హెగ్డే పికాక్ లాంటి గౌనులో కనిపించి కవ్వించింది. లాంగ్ గౌను అచ్చంగా నెమలి పించంలా తీర్చిదిద్దారు డిజైనర్లు. ఈ గౌనులో పూజా హెగ్డే నెమలి అందంతో మెరిసిపోయింది.

తమన్నా భాటియా
తమన్నా ఈ సంవత్సరం భారతీయ ప్రతినిధి బృందంలో చేరారు. ఆమె తన సొగసైన ఎంపికలతో రెడ్ కార్పెట్‌పై ప్రత్యేకంగా నిలిచారు. ఐకానిక్ గౌరీ & నైనికా డచెస్ శాటిన్ గౌను మరియు అమిత్ అగర్వాల్ చేతితో ఎంబ్రాయిడరీ చేసిన మెటల్ పైప్ వర్క్, ప్లీట్‌లతో కూడిన చీరలో కనిపించింది.



Click it and Unblock the Notifications