Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Shaakuntalam: శాకుంతలం సినిమాలో 15 కిలోల బంగారంతో ఆభరణాలు, సమంత లుక్ కోసం గుణశేఖర్ ప్రత్యేక శ్రద్ధ
గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం శాకుంతలం. కాళిదాసు రచించి అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపొందిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూవీ టీమ్ ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా సినిమా నుండి సమంత లేటెస్ట్ పిక్స్ రిలీజ్ చేస్తూ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు డైరక్టర్ గుణశేఖర్.

కొత్తగా రిలీజ్ చేసిన ఫోటోల్లో సమంత మెరిసిపోతూ కనిపిస్తోంది. బంగారు వర్ణపు వస్త్రాల్లో, ఒంటి నిండా బంగారంతో మహారాణిలా కనిపిస్తోంది సమంత. వజ్రాభరణాలు సమంత అందాన్ని రెట్టింపు చేశాయి. మెరిసిపోతున్న నగలతో సమతం అందాల అపరంజిలా కనిపిస్తోంది. శాకుంతల మూవీ టీమ్ ఈ పిక్స్ అలా రిలీజ్ చేయగానే ఇలా వైరల్ గా మారాయి. ఇందులో సమంత సహా ఇతర కీలక క్యారెక్టర్లు ధరించిన నగల గురించి గుణశేఖర్ ఆసక్తికర విషయాలు చెప్పారు.

శాకుంతలం సినిమాలో కీలక పాత్రల కోసం రూ. 14 కోట్లు విలువ చేసే బంగారు, వజ్రాభరణాలు వాడినట్లు గుణశేఖర్ వెల్లడించారు. 'దాన వీర శూర కర్ణ' సినిమాలో నిజమైన బంగారు ఆభరణాలు, బంగారంతో చేసిన కిరీటం వాడిన స్ఫూర్తితోనే తన సినిమాలోనూ బంగారంతో చేసిన నగలనే వాడినట్లు చెప్పారు.

సుమారు 15 కిలోల బంగారంతో 14 రకాల ఆభరణాలు తయారు చేయించారు. పూర్తిగా చేతితో చేసిన ఈ ఆభరణాలు సినిమాలోని పాత్రలకు మరింత అందాన్ని, రాజసాన్ని తీసుకువచ్చాయని గుణశేఖర్ తెలిపారు.

ప్రముఖ డిజైనర్ నీతు లుల్లా సారథయంలో వసుంధర జ్యూయెలరీస్ శాకుంతలం కోసం సుమారు 7 నెలల పాటు శ్రమించి ఈ ఆభరణాలను తయారు చేసింది. ఈ నగలను పూర్తిగా చేతితోనే తయారు చేయడం విశేషం.

శకుంతల పాత్ర కోసం 15 కిలోల బంగారంతో 14 రకాల ఆభరణాలు తయారు చేసినట్లు డైరెక్టర్ గుణశేఖర్ తెలిపారు. దుష్యంత మహారాజు పాత్ర కోసం 8 నుండి 10 కిలోల బంగారంతో నగలు తయారు చేశామని చెప్పారు. మేనక పాత్రధారి మధుబాల కోసం 6 కోట్లతో వజ్రాలు పొదిగిన దుస్తులను రూపొందించినట్లు డైరెక్టర్ చెప్పుకొచ్చారు.
(all images: Instagram)



Click it and Unblock the Notifications