Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
How To Look Taller: పొట్టిగా ఉన్నా ఇలా పొడుగ్గా కనిపించొచ్చు
అయితే మనం వేసుకునే డ్రెస్సులు, మన నడవడికతో పొట్టిగా ఉన్నప్పటికీ పొడుగ్గా కనిపించవచ్చు. ఎలాంటి డ్రెస్సులు, ఎలా వేసుకుంటే పొడుగ్గా కనిపించవచ్చో ఇప్పుడు చూద్దాం.
How To Look Taller: పొడుగు.. చాలా మంది సమస్య ఇది. పొడుగు అనే సమస్యకు ఆడ, మగ అనే తేడా లేదు. చిన్నా, పెద్దా అనే తేడా కూడా ఉండదు. చాలా మంది తాము పొట్టిగా ఉన్నామని మదన పడిపోతూ ఉంటారు. అయితే ఒక వయస్సు వచ్చిన తర్వాత పొట్టి, పొడుగు అనేది మన చేతుల్లో ఉండే అంశం కాదు. మనం ఉన్న ఎత్తును మనం అంగీకరించాల్సిందే.

అయితే మనం వేసుకునే డ్రెస్సులు, మన నడవడికతో పొట్టిగా ఉన్నప్పటికీ పొడుగ్గా కనిపించవచ్చు. ఎలాంటి డ్రెస్సులు, ఎలా వేసుకుంటే పొడుగ్గా కనిపించవచ్చో ఇప్పుడు చూద్దాం.

వదులుగా ఉండే దుస్తులు వేసుకోవద్దు
పొడుగ్గా కనిపించాలని కోరుకునే వారు మొట్ట మొదటగా చేయాల్సింది. వారి దుస్తులు మార్చాలి. మీరు వేసుకునే డ్రెస్సులు మీరు కనిపించే తీరును నిర్ణయిస్తాయి. పొట్టిగా ఉండే వాళ్లు వదులుగా ఉండే డ్రెస్సులను వేసుకోవద్దు. అలాంటివి వేసుకోవడం వల్ల పొట్టిగా కనిపిస్తారు. మోకాళ్ల వరకు ఉండే జాకెట్లను వేసుకోకపోవడం మంచిది
పొడుగు జాకెట్లను మానుకోవాలి
మీరు ఎత్తు తక్కువ ఉన్నారా.. అయితే పొడుగు జాకెట్లను వేయడం మానుకోండి. పొడుగైన జాకెట్లు, సూట్లు, బ్లేజర్లు... కాళ్లను చిన్నగా కనిపించేలా చేస్తాయి. అలా మీరు మరింత పొట్టిగా కనిపిస్తారు. చిన్నగా ఉండే సరిగ్గా నప్పే జాకెట్లు వేసుకుంటే పొడుగ్గా కనిపిస్తారు.
అలాగే బ్యాగు ఎంపికలోనూ జాగ్రత్త వహించాలి. పొట్టిగా ఉండే వారు పెద్దగా ఉండే భారీ బ్యాగులను కొనుగోలు చేయకపోవడమే మంచిది. అవి మీరు చిన్నగా ఉన్నారని తెలియచెబుతాయి.
హై వెయిస్ట్ జీన్స్, క్రాప్ టాప్స్
మీరు ఎత్తు తక్కువగా ఉన్నట్లైతే క్రాప్ టాప్ మీకు సరైన ఎంపిక. హై వెయిస్ట్ జీన్స్ పైకి క్రాప్ టాప్ వేసుకుంటే చక్కగా ఉంటుంది. టోన్డ్ జీన్స్, స్కర్ట్స్ వేసుకోవడం వల్ల పొడుగ్గా కనిపిస్తారు.
నిలువు గీతలు బెటర్
నిలువు గీతలు ఉన్న టీ షర్ట్స్, షర్ట్స్ ధరించాలి. నిలువు గీతలు మిమ్మల్ని పొడుగ్గా కనిపించేలా చేస్తాయి. పొట్టిగా ఉండే వాళ్లు ఎప్పుడైనా ఇలాంటి నిలువు గీతల డ్రెస్సులు ధరించడానికే మొగ్గు చూపండి.
మోనోక్రొమాటిక్
ఏకవర్ణ వేషధారణను ఎంచుకోవడం వల్ల పొడుగ్గా కనిపిస్తారు. మోనోక్రొమాటిక్ దుస్తులు చక్కగా సూట్ అవ్వడంతో పాటు మీరు పొడుగ్గా కనిపించేలా చేస్తాయి.

పురుషులు పొడ్డుగా కనిపించాలంటే..
1. వదులుగా ఉండే దుస్తులకు బదులు సరిగ్గా సూట్ అయ్యే దుస్తులు వేసుకోవాలి. స్ట్రీమ్ లైన్డ్ స్ట్రక్చర్ పొడుగ్గా కనిపించేలా చేస్తుంది.
2. ఏకవర్ణ దుస్తులు ధరించడం వల్ల మీరు పొడుగ్గా ఉన్నారని భ్రమ కలుగుతుంది. బ్లాక్ అండ్ బ్లాక్, సూట్స్ వంటివి ధరిస్తే మీరు కచ్చితంగా పొడుగ్గా కనిపిస్తారు.
3. గుండ్రంగా లేదా చతురస్రాకారంలో ఉండే షూలకు బదులుగా పాయింటెడ్ షూలను వేసుకోండి. ఇవి మిమ్మల్ని కాస్త పొడుగ్గా కనిపించేలా చేస్తాయి.
4. నిలువు గీతలు షర్ట్స్, టీ-షర్స్ట్ ధరించడం వల్ల ఆ గీతల్లాగే మీరూ పొడుగ్గా ఉంటారన్న భ్రమను అవి కలిగిస్తాయి. అడ్డు గీతల దుస్తులు వేసుకోవడం వల్ల మీరు మరింత పొట్టిగా కనిపించే అవకాశం ఉంది.
5. మీ దుస్తులలో నో బ్రేక్ లుక్ ను సృష్టించండి. దీని వల్ల ప్యాంటు నుండి బూట్ల వరకు ఎలాంటి బ్రేక్ లు లేకపోవడం వల్ల పొడుగ్గా కనిపిస్తారు.
6. పొడవాటి టాప్ కోట్లు ధరించడాన్ని మానుకోవాలి. నడుము వరకు ఉండే కోట్ల వల్ల పొడుగ్గా కనిపిస్తారు. కాబట్టి పొడుగ్గా తొడలు, మోకాళ్ల వరకు ఉండే వాటికి దూరంగా ఉండటం బెటర్.



Click it and Unblock the Notifications