Latest Updates
-
చుక్క నూనె లేకుండా రెస్టారెంట్ స్టైల్ మలాయ్ చికెన్..సాఫ్ట్ గా, జ్యూసీగా చేయండిలా -
చితి మంటల్లో కూడా కాలిపోని శరీర భాగం ఇదే..99శాతం మందికి తెలియని నిజం! -
వీకెండ్ స్పెషల్..గొంతుకు హాయినిచ్చే పెప్పర్ చికెన్ గ్రేవీ..పూరీ,చపాతీ,అన్నం దేనికైనా అదుర్స్ -
పెద్దలు కుదిర్చిన పెళ్లి: మీ కాబోయే భాగస్వామి ఒత్తిడితో పెళ్లికి ఒప్పుకున్నారా? ఇలా కనిపెట్టండి! -
విటమిన్లు, ఐరన్ పుష్కలం..చక్కెర,బెల్లం లేకుండానే సూపర్ టేస్టీ డ్రై ఫ్రూట్ రోల్ చేసుకోండిలా -
బరువు తగ్గాలా? ఈ ఆయుర్వేద చిట్కాతో కొవ్వును కొవ్వొత్తిలా కరిగించొచ్చు! -
క్యాల్షియం, ప్రొటీన్ల ఖజానా..ఎముకలకి ఉక్కులాంటి బలాన్నిచ్చే రాగి కిచిడీ -
ఎయిర్ పోర్ట్ డివోర్స్ అంటే ఏంటి?.. జంటలను ఆకర్షిస్తున్న కొత్త ట్రెండ్! -
వర్షాకాలంలో ఈ చిన్న పని చేస్తే..ఏ రోగాలు మీ దరిచేరవు! -
పంజాబీ ఫేమస్ చిక్కడ్ చోలే.. పూరీ, కుల్చాకి ఇది పర్ఫెక్ట్ మ్యాచ్!
Met Gala 2023: దేవకన్యలా అలియా, శారీ గౌన్‌లో ఇషా అంబానీ, అదిరిపోయే ఔట్‌ఫిట్‌లో ప్రియాంక..
ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో ఒకటైన మెట్ గాలా 2023 జోరుగా సాగుతోంది. న్యూయార్క్ సిటీలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో మెట్ గాలా ఫ్యాషన్ ఈవెంట్ ను ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది ఈ ఈవెంట్ లో ఇండియా నుండి బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, ప్రియాంక చోప్రా అలరించారు. దిగ్గజ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ కూతురు నిషా అంబానీ కూడా ఈ ఈవెంట్‌లో ఆకట్టుకున్నారు.

ఎప్పట్లాగే ఎంతో వైభలంగా ప్రారంభమైంది మెట్ గాలా 2023. ప్రపంచం నలుమూలల నుండి బాగా పేరున్న అతికొద్దిమంది సెలబ్రిటీలకు మాత్రమే ఈ ఈవెంట్‌కు ఆహ్వానిస్తుంటారు. ప్రఖ్యాత డిజైనర్లు రూపొందించి దుస్తున్న ఈ సెలబ్రిటీ మెట్ గాలా స్టెప్స్ పై హొయలొలికించారు.

బాలీవుడ్ క్యూట్ బ్యూటీ అలియా భట్ ఈ ఫ్యాషన్ ఈవెంట్ లో తెల్లటి స్లీవ్ లెస్ గౌనులో కనిపించి కవ్వించింది. ముత్యాలు పొదిగిన తెల్లటి గౌనులో దేవకన్యలా మెరిసిపోయింది అలియా. వైట్ అంట్ వైట్ గౌనులో అప్సరసలా మెరిసిపోయింది ఈ బాలీవుడ్ క్యూట్ బ్యూటీ.

చానెల్ కోచర్ బ్రైడ్స్ తరహా గౌనులో అలియా అదిరిపోయింది. ఈ గౌనుపైకి వైట్ కలర్ ఫింగర్ లెస్ గ్లోవ్ ధరించింది. లోనెక్ గౌను నుండి ఎద అందాలను ఆరబోసింది. చెవులకు ముత్యాలు పొదిగిన ఇయర్ రింగ్స్ ధరించింది. పోనీ టెయిల్ హెయిర్ స్టైల్ ను జోడించింది.

ఈ ఫ్యాషన్ ఈవెంట్‌లో ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్ తో కలిసి పాల్గొంది. బ్లాక్ అండ్ వైట్ కలర్ వాలెంటినో డ్రెస్సులో దర్శనమిచ్చింది ప్రియాంక. నిక్ జోనస్ బ్లాక్ కలర్ ప్యాంట్ అండ్ సూట్ ధరించి లోపల వైట్ కలర్ షర్ట్ వేసుకున్నాడు.

సైడ్ స్లిట్ తరహా ఔట్ ఫిట్ నుండి ప్రియాంక థైస్ షోతో అలరించింది. కవ్వించే అందాలతో మెట్ గాలా ఈవెంట్‌లో ఆకట్టుకుంది. పియర్వాలో పిచ్చోలీ తీర్చిదిద్దిన ఈ డ్రెస్సులో ప్రియాంక, నిక్ జోనస్ స్టైల్ గా కనిపించారు. ప్రియాంక మరింత హాట్ గా కనిపించగా, నిక్ మరింత హ్యాండ్సమ్ గా కనిపించాడు.

దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కూతురు నిషా అంబానీ మెట్ గాలా 2023 ఫ్యాషన్ ఈవెంట్ లో అలరించింది. ఇతర సెలబ్రిటీలు వెస్టర్న్, మోడ్రన్ డ్రెస్సులో కనిపించగా.. నిషా అంబానీ మాత్రం సాంప్రదాయ రీతిలో ఉంటూనే ట్రెండీ టచ్ ఇచ్చిన శారీ గౌన్ డ్రెస్సులో కనిపించి ఆకట్టుకుంది.

బ్లాక్ కలర్ శారీలో నిషా తన గ్లామర్ ను ఒలకబోసింది. బ్లాక్ కలర్ శారీపైకి సిల్వర్ కలర్ గెలాక్సీ బార్డర్ విశేషంగా ఆకట్టుకుంది. సిల్వర్ కలర్ నెక్ పీస్‌తో స్టైల్ చేసింది. చిన్న హ్యాండ్ పర్స్‌ను తన స్టైల్‌కు జోడించింది.(All Images: Instagram)



Click it and Unblock the Notifications