Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Karan Torani: సెక్స్ వర్కర్ల లైఫ్ థీమ్‌తో ఫ్యాషన్ క్యాంపెయిన్
రంగు రంగుల దుస్తులు, డిజైనర్ వేర్స్, అప్సరసల్లాంటి అమ్మాయిలు, హ్యాండ్సమ్ గా ఉండే అబ్బాయిలు ర్యాంప్ పై అలా నడుస్తూ ఫ్యాషన్ వేర్‌ను ప్రదర్శిస్తుంటారు. వాటినే మనం ఫ్యాషన్ వీక్, ఫ్యాషన్ షో, ఫ్యాషన్ ఈవెంట్ అంటూ పిలుస్తుంటాం. డిజైనర్లు తమ సృజనాత్మకత వాడి తీర్చిదిద్దిన ఔట్‌ఫిట్‌లను ఫ్యాషన్ ఈవెంట్లలో ప్రదర్శిస్తుంటారు.

దిల్లీకి చెందిన సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ కరణ్ తొరానీ తను డిజైన్ చేసిన దుస్తులను ప్రదర్శించడానికి కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. అందరిలా ఫ్యాషన్ ఈవెంట్లలో కాకుండా నడి రోడ్డుపై తను తీర్చిదిద్దిన ఔట్‌ఫిట్‌లను ప్రదర్శించాడు.

అయితే కరణ్ తొరానీ చేసిన ఈ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలాగే కొందరు కరణ్ తొరానీ క్రియేటివిటీని మెచ్చుకుంటే, మరికొందరు మాత్రం తిట్టిపోస్తున్నారు.

కరణ్ తొరానీ కొన్ని చీరలను డిజైన్ చేశాడు. వాటి ప్రమోషన్ కోసం తాను ఈ కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. సెక్స్ వర్కర్ల జీవితాన్ని థీమ్ గా తీసుకున్నాడు. దానికి 'చాందినీ రాతేన్' అనే పేరు కూడా పెట్టాడు. తను కొత్తగా డిజైన్ చేసిన చీరలతో ప్రచార వీడియోలు రూపొందించి వాటిని సోషల్ మీడియాలో పెట్టాడు.

రాత్రి వేళ సెక్స్ వర్కర్లు ఎలా తయారవుతారు, ఎలా చీరలు ధరించి అందాలు ఆరబోస్తారు, రాత్రి వేళ వారి హావభావాలు ఇలా అన్నింటిని తను షూట్ చేశాడు. ఈ ప్రమోషన్ వీడియోలో బాలీవుడ్ నటి తాన్య మానిక్తలా నటించడం విశేషం.

కరణ్ తొరానీ షేర్ చేసిన ప్రమోషన్ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. రంగురంగుల దుస్తులు, వేలాది ఖరీదైన చీరల కోసం సెక్స్ వర్కర్ల జీవితాన్ని వాడుకోవడాన్ని తప్పుబడుతూ కామెంట్లు పెడుతున్నారు. వ్యభిచారంలోని భయంకరమైన నిజాలను అందం పేరుతో కడిగివేసే ప్రయత్నమే ఇదంటూ కామెంట్ చేశాడు ఓ యూజర్.

ధనికులు మాత్రమే కొనగలిగే దుస్తులను డిజైన్ చేసి వాటిని అమ్ముకునేందుకు సెక్స్ వర్కర్ల జీవితాల ఆధారణంగా ప్రకటనలు చేయడం నీచమైన చర్య అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

కరణ్ తొరానీ ఆలోచన బాగుందని, కొత్తగా ఉందని మరికొందరు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. సెక్స్ వర్కర్ల జీవితాల ఆధారంగా ప్రకటన రూపొందించడం మంచి ఆలోచన మరొకరు కామెంట్ చేశారు.
అయితే దిల్లీకి చెందిన కరణ్ తొరానీ బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొణే, మాధురీ దీక్షిత్, కియారా అద్వాణీ వంటి వారికి వ్యక్తిగత ఫ్యాషన్ డిజైనర్ గా పని చేశాడు. గతంలో కరణ్ తొరానీ మిథ్య పేరుతో సెవెన్ సిన్స్ థీమ్‌తో డిజైన్ చేసిన ఔట్‌ఫిట్‌లకు మంచి పేరొచ్చింది.



Click it and Unblock the Notifications